Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 ప్రారంభ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం

వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 ప్రారంభ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం


యువ‌ర్ హైనెస్,

ఎక్స్ లెన్సీస్

నమస్కారం!

140 కోట్ల మంది భారతీయుల తరఫున,  వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతంగత రెండు శిఖరాగ్ర సమావేశాల్లోమీలో చాలా మందితో సన్నిహితంగా కలిసి పనిచేసే అవకాశం నాకు లభించిందిఈ సంవత్సరం భారత సార్వత్రిక ఎన్నికల తరువాతఈ వేదికపై మీ అందరితో సంభాషించే అవకాశం నాకు మరోసారి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

మిత్రులారా..

 2022లో భారత్ జీ20 అధ్యక్ష పదవిని చేపట్టే సమయంలో జీ20కి కొత్త రూపం ఇవ్వాలని తీర్మానించాంవాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అభివృద్ధి సంబంధిత సమస్యలు, ప్రాధాన్యతల గురించి బహిరంగంగా చర్చించడానికి ఒక వేదికగా మారింది.

గ్లోబల్ సౌత్ ఆశలుఆకాంక్షలుప్రాధాన్యతల ఆధారంగా జీ20 ఎజెండాను భారత్ రూపొందించిందిసమ్మిళితఅభివృద్ధి కేంద్రీకృత విధానంతో జీ20ని ముందుకు నడిపించారుఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) జీ20లో శాశ్వత సభ్యత్వం పొందిన చారిత్రాత్మక ఘట్టమే దీనికి అతిపెద్ద ఉదాహరణ.

మిత్రులారా.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ రోజు మనం కలుస్తున్నాంకొవిడ్ ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా బయటపడలేదుఅదే సమయంలో యుద్ధ పరిస్థితులు మన అభివృద్ధి ప్రయాణానికి సవాళ్లు విసురుతున్నాయిమనం ఇప్పటికే వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు ఆరోగ్య భద్రతఆహార భద్రత, ఇంధన భద్రత గురించి కూడా ఆందోళన చెందుతున్నాం.

ఉగ్రవాదంతీవ్రవాదంవేర్పాటువాదం మన సమాజానికి పెను ముప్పుగా పరిణమించాయిసాంకేతిక విభజన, సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడిన కొత్త ఆర్థిక సామాజిక సవాళ్లు కూడా ఉద్భవిస్తున్నాయిగత శతాబ్దంలో ఏర్పడిన గ్లోబల్ గవర్నెన్స్ఆర్థిక సంస్థలు ఈ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోలేకపోయాయి.

మిత్రులారా.

 అందువలనగ్లోబల్ సౌత్ లోని దేశాలు ఏకం కావడంఒకే స్వరంతో కలిసి నిలబడటం, ఒకరికొకరు బలంగా మారడం ప్రస్తుత అవసరంఒకరి అనుభవాల నుంచి మరొకరు పాఠాలు నేర్చుకుందాంమన సామర్థ్యాలను పంచుకుందాంకలిసి మన తీర్మానాలను విజయంగా మార్చుదాం.

మూడింట రెండొంతుల మానవాళికి గుర్తింపు తెచ్చేందుకు అందరం కలిసి పనిచేద్దాంభారత్ తన అనుభవాలనుసామర్థ్యాలను గ్లోబల్ సౌత్ లోని అన్ని దేశాలతో పంచుకోవడానికి కట్టుబడి ఉందిపరస్పర వాణిజ్యంసమ్మిళిత వృద్ధిసుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతిమహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించాలని మేం కోరుకుంటున్నాంఇటీవలి సంవత్సరాల్లోమౌలిక సదుపాయాలుడిజిటల్, ఇంధన కనెక్టివిటీ ద్వారా మన పరస్పర సహకారాన్ని పెంపొందించుకున్నాము.

మిషన్ లైఫ్ కింద భారత్ లోనే కాకుండా భాగస్వామ్య దేశాల్లో కూడా రూఫ్ టాప్ సోలార్పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నాంఆర్థిక సమ్మిళితం, చివరి  మైల్ డెలివరీలో మా అనుభవాలను పంచుకున్నాంయునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్అనగా యుపిఐతో గ్లోబల్ సౌత్ లోని వివిధ దేశాలను అనుసంధానించడానికి చొరవలు తీసుకున్నాం. విద్యసామర్థ్యం పెంపునైపుణ్య రంగాల్లో మా భాగస్వామ్యంలో గణనీయమైన పురోగతి ఉంది.

గత ఏడాది గ్లోబల్ సౌత్ యంగ్ డిప్లొమేట్ ఫోరంను కూడా ప్రారంభించారు. ‘దక్షిణ్‘ అంటే గ్లోబల్ సౌత్ ఎక్సలెన్స్ సెంటర్ మన మధ్య సామర్థ్య పెంపునైపుణ్యంజ్ఞాన భాగస్వామ్యంపై పనిచేస్తోంది.

మిత్రులారా.

సమ్మిళిత వృద్ధికి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అంటే డీపీఐ సహకారం ఒక విప్లవానికి ఏ మాత్రం తీసిపోదుమా జి 20 అధ్యక్షతన సృష్టించబడిన గ్లోబల్ డిపిఐ రిపోజిటరీడిపిఐపై మొట్టమొదటి బహుళపక్ష ఏకాభిప్రాయం.

గ్లోబల్ సౌత్ కు చెందిన 12 భాగస్వాములతో ఇండియా స్టాక్” ను పంచుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉందిగ్లోబల్ సౌత్ లో డిపిఐని వేగవంతం చేయడానికి మేము సోషల్ ఇంపాక్ట్ ఫండ్ ను సృష్టించాముదీనికి భారత్ 25 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వనుంది.

మిత్రులారా,

 వన్ వరల్డ్ వన్ హెల్త్ అనేది ఆరోగ్య భద్రత కోసం మా మిషన్మా విజన్ – “ఆరోగ్య మైత్రి” అంటే ఆరోగ్యం కోసం స్నేహం“. ఆఫ్రికాపసిఫిక్ ద్వీప దేశాలకు ఆసుపత్రులుడయాలసిస్ యంత్రాలుప్రాణాలను కాపాడే మందులు, ‘జన ఔషధి కేంద్రాలు‘ అందించడం ద్వారా ఈ స్నేహాన్ని కొనసాగించాం.

పపువా న్యూ గినియాలో అగ్నిపర్వత విస్ఫోటనం లేదా కెన్యాలో వరద సంక్షోభం వంటి మానవతా సంక్షోభ సమయాల్లోభారతదేశం తన మిత్ర దేశాలకు మొదటి ప్రతిస్పందనగా సహాయం చేస్తోందిగాజాఉక్రెయిన్ వంటి ఘర్షణాత్మక ప్రాంతాల్లో మానవతా సహాయం అందించాం.

మిత్రులారా.

ఇప్పటి వరకు వినని ప్రజల అవసరాలుఆకాంక్షలకు వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ వేదికైందిమన బలం మన ఐక్యతలోనే ఉందనిఈ ఐక్యత బలంతో మనం కొత్త దిశలో పయనిస్తామని నేను నమ్ముతున్నానువచ్చే నెలలో ఐక్యరాజ్యసమితిలో ఫ్యూచర్ సమ్మిట్ జరగనుందిదీనిలో భాగంగా భవిష్యత్తు కోసం ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ ఒప్పందంలో గ్లోబల్ సౌత్ స్వరాన్ని బలోపేతం చేయడానికి మనమందరం కలిసి సానుకూల వైఖరిని అవలంభించగలమాఈ ఆలోచనలతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నానుఇప్పుడు మీ ఆలోచనలు వినడానికి ఎదురుచూస్తున్నాను.

చాలా ధన్యవాదాలు.

 

***