Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు విద్యార్థులతో ముచ్చటించనున్న ప్రధాని ఉపాధ్యాయుల‌ దినోత్సవం సందర్భంగా రేపు విద్యార్థులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ముచ్చటించనున్నారు.


ఢిల్లీలోని మానెక్ షా ఆడిటోరియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఆడిటోరియంలోని విద్యార్థుల‌తో పాటు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా పాలుపంచుకునే తొమ్మిది రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులతోనూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడుతారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని ఉపన్యాసం మొదలై సుమారు 90 నిమిషాల‌ పాటు విద్యార్థులతో నిర్విరామంగా మాట్లాడుతారు.

ఈ సందర్బంగా ప్రధాని మోదీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మృతి చిహ్నంగా ఆయన ముఖచిత్రంతో ఉన్న నాణెంను ఆవిష్కరిస్తారు. దీంతో పాటు విద్యార్థులలో కళలను, దేశ సంస్కృతిని పెంపొందించడానికి సాంస్కృతిక విద్యతోపాటు శిక్షణను ఇవ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కళా ఉత్సవ్ అంతర్జాల వెబ్ సైట్ ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ తోపాటు కేంద్ర స‌హాయ మంత్రులు

శ్రీ ఉపేంద్ర కుశ్వహా, శ్రీ రామ్ శంక‌ర్‌ ఖతేరియా, శ్రీ జయంత్ సింహా పాల్గొంటారు.