Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు స్వాగతం పలికిన శ్రీ మోదీ


ఈ రోజు భారత్ కు విచ్చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.

భారత్-యూఏఈ దేశాధినేతలు, ఉన్నతాధికారులు తరుచూ ద్వైపాక్షిక పర్యటనలు చేపట్టడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు ప్రధాని శుభాకాంక్షలు అందజేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాల కొనసాగింపునకు ప్రతీకగా, నూతన తరానికి చెందిన అబు ధాబీ యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ బిన్ జయెద్ అల్ నహ్యాన్ సెప్టెంబర్ మాసంలో భారత్ ను సందర్శించారని శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.