గ్లోబల్ క్లైమేట్ సమిట్ ను నిర్వహిస్తున్నందుకు ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ కు ఇవే నా ధన్యవాదాలు.
గడచిన సంవత్సరం లో చాంపియన్ ఆఫ్ ద అర్థ్ అవార్డు ను అందుకొన్న తరువాత, ఐక్య రాజ్య సమితి ని ఉద్దేశించి ప్రసంగించేందుకు నాకు దక్కిన ఒకటో అవకాశం ఇది. నేను న్యూ యార్క్ ను సందర్శిస్తున్న సందర్భం లో నా ఒకటో సమావేశం శీతోష్ణస్థితి అంశం గురించి కావడం నాకు సంతోషాన్ని ఇస్తోంది.
ఎక్స్లెన్సీస్,
జల వాయు పరివర్తన తో పోరాడడం కోసం వివిధ దేశాలు వేరు వేరు ప్రయత్నాల ను కొనసాగిస్తున్నాయి.
జల వాయు పరివర్తన వంటి ఒక గంభీరమైన సవాలు ను మనం అధిగమించాలి అంటే గనుక, అటువంటప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్న కృషి చాలదన్న సంగతి ని మనం ఒప్పుకొనే తీరాలి.
ఈ రోజు న కావలసింది ఏమిటంటే, అది ఒక సమగ్రమైనటువంటి విధానం. ఆ విధానం లో విద్య మొదలుకొని విలువల వరకు, జీవనశైలి మొదలుకొని అభివృద్ధియుతమైన తత్త్వం వరకు ప్రతిదీ మిళితమై ఉండాలి. మనకు కావలసిందల్లా ప్రవర్తన పరమైనటువంటి మార్పు ను తీసుకు రాగలిగే ఓ ప్రపంచ వ్యాప్త ప్రజా ఉద్యమం.
ప్రకృతి ని గౌరవించడం, వనరుల ను ఆలోచనాపూర్వకం గా వినియోగించుకోవడం, మన అవసరాల ను తగ్గించుకోవడం, అలాగే మనకు ఉన్న సాధనాల తో మనుగడ సాగించడం.. ఇవి అన్నీ కూడాను ప్రస్తుతం మేము నడుంకట్టిన ప్రయత్నాల తో పాటు మా సంప్రదాయాల తాలూకు ముఖ్యమైన అంశాలు అయి వున్నాయి. అవసరం మాత్రమే తప్ప పేరాశ కూడదు అనేది మాకు మార్గదర్శక సూత్రం గా ఉన్నది.
మరి ఈ కారణం గా భారతదేశం ప్రస్తుతం ఈ సమస్య యొక్క గంభీరత ను గురించి మాట్లాడటం ఒక్కటే కాకుండా ఒక ఆచరణ సాధ్యం అయినటువంటి దృక్పథాన్ని, ఇంకా ఒక మార్గసూచీ ని ఆవిష్కరిస్తోంది. ఒక టన్ను ప్రబోధాల కన్న ఒక ఔన్సు అభ్యాసం మరింత అధిక విలువ తో కూడుకొని ఉంటుంది అని మేము విశ్వసిస్తాము.
భారతదేశం లో మేము శిలాజ జనితం కానటువంటి ఇంధనం యొక్క వాటా ను పెంచుకోబోతున్నాము. అలాగే 2022వ సంవత్సరం కల్లా మేము మా యొక్క నవీకరణ యోగ్య శక్తి సామర్ధ్యాన్ని 175 గీగా వాట్ కు మరియు తదనంతరం క్రమేపీ 450 జిడబ్ల్యు కు పెంచుకోవాలని పథక రచన చేస్తున్నాము.
భారతదేశం లో మేము మా రవాణా రంగాన్ని ఇ-మొబిలిటీ ద్వారా హరితభరితం గా మలచుకొనే ప్రణాళిక లు సిద్ధం చేశాము.
డీజిల్ లో, పెట్రోలు లో బయో ఫ్యూయల్ మిశ్రణ నిష్పత్తి ని గణనీయ స్థాయి లో పెంచుకోవాలని కూడా భారతదేశం కృషి చేస్తోంది.
మేము 150 మిలియన్ కుటుంబాల కు శుద్ధ వంట గ్యాసు ను సమకూర్చాము.
జల సంరక్షణ, వాన నీటి నిలవ, ఇంకా జల వనరుల అభివృద్ధి కోసం జల్ జీవన్ అభియాన్ ను మేము ప్రారంభించాము. దీని కోసం రానున్న కొన్ని సంవత్సరాల కాలం లో భారతదేశం రమారమి 50 బిలియన్ డాలర్ లను వెచ్చించబోతోంది.
అంతర్జాతీయ స్థాయి లో దాదాపు గా 80 దేశాలు మా ఇంటర్నేశనల్ సోలర్ అలయన్స్ ప్రచార ఉద్యమం లో చేరాయి. భారతదేశం మరియు స్వీడన్ ఇతర భాగస్వామ్య దేశాల తో కలసి ఇండస్ట్రీ ట్రాన్సిశన్ ట్రాక్ కు లోపల నాయకత్వ బృందాన్ని ప్రారంభించనున్నాయి. ఈ కార్యక్రమం టెక్నాలజీ ఇనవేశన్ రంగం లో సహకరించుకోవడం కోసం ప్రభుత్వాలకు, ప్రైవేటు రంగాని కి ఒక వేదిక ను అందిస్తుంది. ఇది పరిశ్రమ రంగం కోసం తక్కువ కర్బన మార్గాల ను అభివృద్ధిచేయడం లో సహాయకారి కాగలదు.
మా మౌలిక సదుపాయాల ను విపత్తుల కు తట్టుకొని నిలచే విధం గా రూపుదిద్దడం కోసం, భారతదేశం ఒక కొవలిశన్ ఫర్ డిజాసర్ట్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రారంభించనుంది. ఈ కూటమి లో చేరవలసిందంటూ నేను సభ్యత్వ దేశాల ను ఆహ్వానిస్తున్నాను.
ఈ సంవత్సరం లో భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం అయిన ఆగస్టు 15వ తేదీ న, మేము ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగాని కి స్వస్తి పలకడం కోసం ఒక ప్రజా ఆందోళన కు పిలుపునిచ్చాము. ఇది ప్లాస్టిక్ ను ఒకసారి వాడడం లోని హానికర ప్రభావాల ను గురించి ప్రపంచ స్థాయి జాగృతి ని తీసుకురాగలుగుతుందని నేను ఆశపడుతున్నాను.
ఎక్స్లెన్సీస్,
భారతదేశం సమకూర్చిన ఒక మిలియన్ డాలర్ ల తో ఐక్య రాజ్య సమితి భవనం పై కప్పు మీద సౌర ఫలకాల ను రేపటి రోజు న మనం ప్రారంభించుకోబోతున్నామని ప్రకటిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.
మాటలు చెప్పేందుకు కాలం చెల్లింది; ప్రపంచానికి ప్రస్తుతం కావలసిందల్లా చేత లు.
మీకు అందరికీ ధన్యవాదాలు. అనేకానేక ధన్యవాదాలు.
అస్వీకరణ: ప్రధాన మంత్రి హిందీ భాష లో ఉపన్యసించారు. ఇది ఆ ప్రసంగాని కి ఓ స్థూల అనువాదం.
Earlier today, PM @narendramodi spoke at the @UN Summit on Climate Action. pic.twitter.com/dYVBFqZtqf
— PMO India (@PMOIndia) September 23, 2019
पिछले वर्ष "चैम्पियन ऑफ द अर्थ" अवार्ड मिलने के बाद यह U.N. में मेरा पहला संबोधन है।
— PMO India (@PMOIndia) September 23, 2019
और ये भी सुखद संयोग है कि न्यूयॉर्क दौरे में मेरी पहली सभा क्लाइमेट के विषय पर है: PM @narendramodi
Climate change को लेकर दुनिया भर में अनेक प्रयास हो रहे हैं।
— PMO India (@PMOIndia) September 23, 2019
लेकिन, हमें यह बात स्वीकारनी होगी, कि इस गंभीर चुनौती का मुकाबला करने के लिए उतना नहीं किया जा रहा, जितना होना चाहिए: PM @narendramodi
Addressing a Summit on Climate Change at the @UN. https://t.co/PswS5nEv1Y
— Narendra Modi (@narendramodi) September 23, 2019