Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని స్మరించుకొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకొన్నారు.

శ్రీ ప్రణబ్ ముఖర్జీని ఒక సాటిలేని రాజనీతిజ్ఞునిగా శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఒక పరిపాలనాదక్షుడని ప్రశంసిస్తూ, దేశాభివృద్ధికి ఆయన అందించిన సేవలను శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,  ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘శ్రీ ప్రణబ్ ముఖర్జీని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకొంటున్నాను. ప్రణబ్ బాబుది అద్వితీయ సార్వజనిక వ్యక్తిత్వం. ఆయన సాటిలేని రాజనీతిజ్ఞుడు, ఒక అద్భుత పాలనాదక్షుడు, విజ్ఞాన ఖని. భారతదేశ అభివృద్ధిలో ఆయన అందించిన సేవలు చాలా ముఖ్యమైనవి. విభిన్న రంగాల్లో ఏకాభిప్రాయాన్ని సాధించే అద్వితీయ సామర్థ్యం ఆయనలో దండిగా ఉండేది. పాలనలో ఆయనకున్న అపార అనుభవం, భారతీయ సంస్కృతన్నా, సంప్రదాయాలన్నా ఆయనకున్న విస్తృతమైన అవగాహనల వల్లే ఇది సాధ్యమైంది. మన దేశం విషయంలో ఆయనకున్న దార్శనికతను సాకారం చేయడానికి మేం మా కృషిని కొనసాగిస్తాం.’’
 

 

 

***

MJPS/RT