మహావీర్ జయంతి శుభ సందర్భం లో భగవాన్ మహావీరుని 2550 వ నిర్వాణ మహోత్సవ్ ను ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. భగవాన్ మహావీరుని ప్రతిమ కు శ్రీ నరేంద్ర మోదీ అక్షంతల ను మరియు పూల ను సమర్పించారు. ‘‘వర్తమానమే వర్థమాన్’’ అనే పేరు తో పాఠశాల విద్యార్థులు భగవాన్ మహావీరుని స్వామి ని గురించిన ఒక నృత్య నాటిక ను ప్రదర్శించ గా, ఆ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి చూశారు. ఇదే సందర్భం లో ఒక స్మారక తపాలా బిళ్ళ ను మరియు నాణేన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.
భగవాన్ మహావీరుని యొక్క 2550 వ నిర్వాణ్ మహోత్సవ్ కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, దేశం స్వాతంత్య్రం తాలూకు సువర్ణ శతాబ్ది ని ఆవిష్కరించే దిశ లో కృషి చేస్తున్న అమృత్ కాల్ తాలూకు ప్రారంభిక దశ మొదలు కావడం వంటి అనేక సంతోషదాయకం అయిన యాదృచ్ఛిక ఘటనల ను గురించి ప్రస్తావించారు. రాజ్యాంగాని కి 75 వ సంవత్సరం మరియు దేశ భావి గతి ని నిర్ణయించే టటువంటి ప్రజాస్వామ్య ఉత్సవాన్ని గురించి కూడా ఆయన తన ప్రసంగం లో ప్రస్తావించారు.
అమృత్ కాలం అనే ఆలోచన ఒక సంకల్పం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రేరణ అని, అది మనకు అమరత్వం కి మరియు అనంత కాలం వరకు జీవించేందుకు అనుమతి ని ఇస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మనం 2500 సంవత్సరాలు అయిన తరువాత సైతం భగవాన్ మహావీరుని నిర్వాణ దివస్ ను జరుపుకొంటున్నాం; మరి దేశం రాబోయే వేల సంవత్సరాల పాటు భగవాన్ మహావీరుని యొక్క ఆదర్శాల ను ఒక ఉత్సవం మాదిరి గా తప్పక జరుపుకొంటూనే ఉంటుంది అని నేను నమ్ముతున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రాబోయే వందల సంవత్సరాల ను గురించి న ఆలోచనల ను చేయడం అనేది భారతదేశం యొక్క శక్తి గా ఉంది, మరి భారతదేశాని కి ఉన్న దూరదృష్టి ఈ దేశాన్ని ఈ ధరణి మీద అన్నింటి కంటే దీర్ఘ కాలం వరకు మనుగడ సాగించేటటువంటి ఒక నాగరకత గా తీర్చిదిద్ది, ఇవాళ మానవాళికి ఒక భద్రమైన ప్రదేశం గా మార్చివేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఒక్కరి గురించి గాక, అందరి ని గురించి ఆలోచించేటటువంటి, మరి ప్రతి ఒక్కరి అస్తిత్వాన్ని నమ్మేది భారతదేశం. భారతదేశం సంప్రదాయాల ను గురించి మాత్రమే కాకుండా, విధానాల ను గురించి కూడా మాట్లాడుతుంది. శరీరం లో ప్రపంచం ఉన్నది, ప్రపంచం లో బ్రహ్మం ఉన్నది, జీవి లో శివతత్త్వం ఉన్నది అని చెప్పేది భారతదేశమే’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఒకచోట ఆగిపోతే ఆలోచనలు బేధాభిప్రాయాలు గా మారవచ్చును. ఏమైనా. చర్చించడం అనేది జరిగినప్పుడు సరిక్రొత్త ఆలోచన లు మొగ్గ తొడగడం తో పాటు గా చర్చ వినాశాని కి ఒక కారణం కూడా ఏర్పడవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన 75 సంవత్సరాల మథనం నుండి ఈ అమృత కాలం లో అమృతం వెలికి రావాలి అని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రపంచం లో అనేక యుద్ధాలు చెలరేగుతూ ఉన్నటువంటి కాలం లో మన తీర్థంకరుల బోధనలు మరింత మహత్వపూర్ణం గా మారిపోయాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘అనేకాంతవాదం మరియు స్యాద్ వాదం వంటి తత్త్వాల ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొంటూ అవి మనకు మనకు ఒక విషయానికి అనేక పార్శ్వాల ను గమనించాలని, అన్యుల దృష్టికోణాన్ని కూడా చూసి మరి వాటి ని స్వీకరించే ఉదారత్వాన్ని అలవరచుకోవడాన్ని బోధిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రస్తుతం లో సంఘర్షణల లో చిక్కుకొనిపోయి ఉన్నటువంటి ప్రపంచం భారతదేశం నుండి శాంతి ని కోరుకొంటోంది అని ప్రధాన మంత్రి అన్నారు. న్యూ ఇండియా యొక్క ఈ నూతన భూమిక యొక్క ఖ్యాతి మన పెరుగుతున్న సామర్థ్యాని కి మరియు విదేశీ విధానానికి ఇవ్వడం జరుగుతోందన్నారు. అయితే దీనిలో మన సాంస్కృతిక ముద్ర యొక్క తోడ్పాటు ఎంతగానో ఉందన్నారు. ‘ప్రస్తుతం మనం సత్యం మరియు అహింస ల సిద్ధాంతాల ను ప్రపంచ వేదికల లో పూర్తి విశ్వాసం తో వినిపిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. ‘‘ప్రపంచం లో ఎదురవుతున్న సమస్యల కు ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాల లో ఒక పరిష్కారం ఉంది అని ప్రపంచాని కి మనం చాటుతున్నాం. ఈ కారణం గానే భారతదేశం చీలిక లు వాలికలు అయిన ఒక ప్రపంచం లో ఓ ‘విశ్వ బంధు’ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొంటోంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జలవాయు పరివర్తన తో తలపడడం కోసం మిశన్ లైఫ్, మరి అలాగే వన్ అర్థ్, వన్ ఫేమిలీ ఎండ్ వన్ ఫ్యూచర్ అనే దార్శనికత, ఇంకా వన్ వరల్డ్, వన్ సన్, వన్ గ్రిడ్ వంటి మార్గసూచీ అనే కార్యక్రమాల ను గురించి ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. భారతదేశం ప్రస్తుతం ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ వంటి భవిష్యత్తు కాలాని కి తగినటువంటి ఒక ప్రపంచ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోతోంది అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలు ప్రపంచం లో ఆశ ను చిగురింప చేయడం ఒక్కటే కాకుండా మన సంస్కృతి పట్ల, మన సంప్రదాయాల పట్ల ప్రపంచం యొక్క దృక్పథం లో మార్పు ను తీసుకు వచ్చాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
జైన ధర్మం యొక్క అర్థాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అది ‘జిన్’ యొక్క పథం, మరో మాట లో చెప్పాలి అంటే గెలిచిన వారు అనుసరించినటువంటి మార్గం అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ఎన్నడూ మరొక దేశాన్ని జయించాలి అనే లక్ష్యం తో దాడి జరపనే లేదు, దీని కంటే తన ను తాను సంస్కరించుకొని తన లోటు పాటు ల మీద విజయాన్ని సాధించడానికి పాటు పడింది అని చెప్పాలి అని ఆయన నొక్కి పలికారు. మహా సాధువులు మరియు మునులు భారతదేశాని కి చీకటి కాలాల్లో దారిని చూపించారు, దీనితో గొప్ప గొప్ప నాగరకత లు నష్టపోయినప్పటికీ దేశాని కి తనదైనటువంటి దారి ని వెదకడంలో సాయం లభించింది అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘భారతదేశం దృష్టి లో ఆధునికత అంటే దాని దేహం, ఆధ్యాత్మికత్వం ఏమో దాని కి ఆత్మ గా ఉంది. ఒకవేళ ఆధునికత్వం లో నుండి ఆధ్యాత్మికత ను తీసివేశామా అంటే అరాజకవాదం తలెత్తుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భగవాన్ మహావీరుని బోధనల ను ఆచరించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఈ మూల్యాల ను పునర్జీవింప చేయడం అనేది ఇవాళ్టి కాలం కోరుకొంటున్న అంశమని ఆయన అన్నారు.
భారతదేశం లో 25 కోట్ల మంది కి పైగా ప్రజలు పేదరికం వలయం లో నుండి బయటకు వచ్చారు అంటే భ్రష్టాచారం, ఇంకా నిరాశ ల తో కూడిన కాలం నుండి భారతదేశం వెలుపల కు వస్తోంది అన్న మాట అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ క్షణం యొక్క ప్రయోజనాన్ని అందుకోండంటూ పౌరుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేస్తూ అందరు ‘అస్తేయం మరియు అహింస’ల దారి లో నడవాలంటూ సూచించారు. దేశం యొక్క భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని పనిచేస్తూ ఉండాలన్నదే తన నిబద్ధత అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సాధువులు ప్రేరణాత్మకమైన మాటల ను పలికినందుకు గాను వారి కి ధన్యవాదాల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.
ఈ కార్యక్రమం లో జైన సముదాయాని కి చెందిన సాధువులు మరియు ఇతర ప్రముఖ వ్యక్తుల తో పాటు చట్టం- న్యాయం ల శాఖ కేంద్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) మరియు పార్లమెంటరీ వ్యవహారాలు & సంస్కృతి శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ పాల్గొన్నారు.
పూర్వరంగం
అహింస, సత్యం, అస్తేయం (దొంగతనం జోలికి వెళ్లక పోవడం), బ్రహ్మచర్యం, ఇంకా అపరిగ్రహ (అనాసక్తి) ల వంటి జైన సిద్ధాంతాల మాధ్యం ద్వారా శాంతిపూర్ణ సహ అస్తిత్వం మరియు సార్వజనిక సోదర భావం ల బాట ను 24 వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ ప్రకాశవంతం చేసి వేశారు.
జైన్ మహావీర్ స్వామి జీ సహా ప్రతి ఒక్క తీర్థంకరుని యొక్క అయిదు కల్యాణక్ (ప్రముఖ కార్యక్రమం)ల ను జైనులు జరుపుకొంటూ ఉంటారు: వాటిలో చ్యవన్ / గర్భ కల్యాణక్ (గర్భాదానం) ; జన్మ కల్యాణక్; దీక్ష కల్యాణక్, కేవల్ జ్ఞాన కల్యాణక్ లతో పాటు నిర్వాణ కల్యాణక్ అనే కార్యక్రమాలు భాగం గా ఉంటాయి. 2024 వ సంవత్సరం లో ఏప్రిల్ 21 వ తేదీ న భగవాన్ శ్రీ మహావీర్ స్వామి యొక్క జన్మ కల్యాణ తిథి కాగా ఈ సందర్భం లో జైన సముదాయం తో ప్రభుత్వం కలసి భారత్ మండపమ్ లో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఉత్సవాన్ని నిర్వహించింది. జైన సముదాయం యొక్క సాధువులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొని, వారి యొక్క ఆశీర్వాదాల ను సభికుల కు అందజేశారు.