Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని సంతాపం


మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్-గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ హ్యాండిల్లో చేసిన పోస్టు:

‘‘మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదం బాధ కలిగించింది. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి . స్థానిక యంత్రాంగం బాధితులకు అవసరమైన సాయం అందజేస్తుంది.
మరణించినవారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్ – గ్రేషియా అందుతుంది. గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సాయం లభిస్తుంది: పీఎం @narendramodi’’