Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌తదేశం, యూరోపియ‌న్ యూనియ‌న్ ల మ‌ధ్య శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన సంబంధ‌ స‌హ‌కార ఒప్పందం పున‌ర్ న‌వీక‌ర‌ణ‌


భార‌తదేశం, యూరోపియ‌న్ యూనియ‌న్ ల మ‌ధ్య శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన సంబంధ‌ స‌హ‌కార ఒప్పందాన్ని పునర్ నవీకరించుకొన్న సంగతిని కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకు వ‌చ్చారు. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ఒప్పందం 2015 మే 17వ తేదీ మొదలుకొని 2020 వరకు మ‌రో 5 సంవ‌త్స‌రాల కాలానికి అమ‌లులో ఉంటుంది. సామాజిక‌, ఆర్థిక అభివృద్ధి కి చోదక శక్తులు అనదగిన ప‌రిశోధ‌న‌, న‌వ కల్పన లలో ఇదివరకటి మాదిరిగానే కలసికట్టుగా కృషి చేయాల‌న్న ఇరు పక్షాల సంకల్పాన్ని ఈ ఒప్పందపు పునర్ నవీకరణ పరిపుష్టం చేస్తున్నది.

యూరోపియ‌న్ యూనియ‌న్‌ సభ్యత్వ దేశాలకు, భార‌త దేశానికి చెందిన పరిశోధక సంస్థలకు ఉమ్మడి ఆసక్తి ఉన్న శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాలకు చెందిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలలో స‌హ‌కారాన్ని ప‌టిష్ఠ‌ం చేసుకోవడమనేది ఈ ఒప్పందపు ఉద్దేశం. ఇందుకు నిధులను, వనరులను సంయుక్తంగా పెట్టుబడి పెట్టడం, ఇచ్చి పుచ్చుకోవ‌డం, వాటిని సమానత్వ ప్రాతిపదికన వినియోగించుకోవడం చేయాల్సివుంటుంది. సహకారాన్ని అందించుకోవలసిన కార్యక్రమాలలో .. సంయుక్త పరిశోధన, అభివృద్ధి పథకాలకు మద్దతును అందజేసుకోవడం; శాస్త్రజ్ఞుల‌ను, నిపుణులను మార్పిడి చేసుకోవడం; ఒకరికి చెందిన ఆధునిక పరిశోధన సదుపాయాలను మరొకరు వినియోగించుకోవడం; గోష్ఠులను, సమ్మేళనాలను, కార్యశాలలను సంయుక్తంగా నిర్వహించడం, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ పాలసీ మరియు ప్రోగ్రామ్, రిసర్చ్ అండ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ స్ తాలూకు సమాచారాన్ని ఒకరికి మరొకరు అందజేసుకోవడం.. వంటివి చోటు చేసుకొంటాయి.

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన విభాగం, యూరోపియ‌న్ క‌మిష‌న్‌కు చెందిన డైరెక్టరేట్ జనరల్ రిసర్చ్ అండ్ ఇన్నొవేషన్ ఈ స‌హ‌కార కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌ బాధ్యతను స్వీకరిస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీపై ఏర్పాటయ్యే సంయుక్త సార‌థ్య సంఘం సమావేశాలను క్రమం తప్పక జరుపుతూ ఈ ఒప్పందం అమ‌లును ప‌ర్య‌వేక్షిస్తాయి.

పూర్వ రంగం:

2001 న‌వంబ‌ర్ లో తొలుత ఈ ఒప్పందంపై లాంఛ‌నంగా సంత‌కాలు చేశారు. 2015 నవంబరు వరకు ఇది అమలులో ఉన్నది. బ్రసెల్స్ (బెల్జియమ్) లోని మిషన్ ఆఫ్ ఇండియా, యూరోపియన్ యూనియన్ కు, బ్ర‌సెల్స్ లోనే ఉన్న జనరల్ సెక్రటేరియట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కు మ‌ధ్య 2016 మార్చి నెలలో డిప్లొమేటిక్ లెటర్స్ ఆదాన ప్రదానం ద్వారా ఈ ఒప్పందాన్ని రెన్యూ చేయడం జరిగింది.