పదిహేనో ఆర్థిక సంఘం యొక్క పదవీకాలాన్ని 2019వ సంవత్సరం నవంబర్ 30వ తేదీ వరకు విస్తరించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీని తో ఈ సంఘాని కి- నూతన వాస్తవాల ను మరియు సంస్కరణల ను దృష్టి లో పెట్టుకొని ఆర్థిక సంబంధమైనటువంటి వివిధ పోల్చదగ్గ అంచనాల ను పరిశీలించేందుకు మరియు 2020-2025 కాలాని కి గాను తన సిఫారసుల ను ఖరారు చేసేందుకు- వీలు చిక్కుతుంది.