Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వేతర సంస్థగా ఉన్న ఐఎఎల్ఎ స్థాయిని అంతర్ ప్రభుత్వ సంస్థగా మార్చడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రభుత్వేతర సంస్థ (ఎన్ జి ఒ) గా ఉన్న ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మరీన్ ఏడ్స్ టు నావిగేశన్ అండ్ లైట్ హౌస్ అథారిటీస్ (ఐఎఎల్ఎ) స్థాయిని అంతర్ ప్రభుత్వ సంస్థ (ఐజిఒ) గా మార్చడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ చర్య ‘‘నౌకలు మరింత సురక్షితంగా, తక్కువ వ్యయంతో, సమర్ధంగా రాకపోకలు జరపడానికి’’ వీలు కల్పిస్తుంది. ఇది ఇంటర్ నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎమ్ఒ) మరియు ఇంటర్ నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ (ఐహెచ్ఒ)లతో సమాన స్థాయిని ఐఎఎల్ఎ కు కట్టబెడుతుంది.

పూర్వరంగం :

ఐఎఎల్ఎ ను 1957 లో ఫ్రెంచ్ చట్టం ప్రకారం స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ లోని సెంట్ జెర్మైనెన్ లయే లో ఉంది. 83 సభ్యత్వ దేశాలతో కూడిన ఒక జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది. జనరల్ అసెంబ్లీ యొక్క కౌన్సిల్ దీనికి కార్యనిర్వాహక మండలిగా వ్యవహరిస్తున్నది. ఐఎఎల్ ఎ కౌన్సిల్ లో 24 సభ్యత్వ దేశాలకు సభ్యత్వం ఉంది. భారతదేశం కూడా ఈ కౌన్సిల్ లో ఒక సభ్యురాలు. భారత ప్రభుత్వ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధీనం లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ మరియు లైట్ షిప్స్ (డిజిఎల్ఎల్) ఈ కౌన్సిల్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. లైట్ హౌస్ చట్టం, 1927 ప్రకారం అండమాన్ & నికోబార్ మరియు లక్షద్వీప్ దీవుల సమూహంతో సహా భారతదేశపు కోస్తా తీరం వెంబడి సాధారణ జలాలలో నావిగేషన్ కోసం ఏడ్స్ ను డిజిఎల్ఎల్ నెలకొల్పడంతో పాటు వాటిని నిర్వహిస్తున్నది కూడాను.

స్పెయిన్ లోని లా కోరునా లో 2014 మే నెలలో జరిగిన ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మరీన్ ఏడ్స్ టు నావిగేశన్ అండ్ లైట్ హౌస్ అథారిటీస్ (ఐఎఎల్ఎ) జనరల్ అసెంబ్లీ యొక్క Xll వ సమావేశంలో- ఎన్ జిఒ స్థాయి నుండి ఐజిఒ గా ఐఎఎల్ఎ మారడం 21వ శతాబ్దంలో ఐఎఎల్ఎ యొక్క లక్ష్యాల సాధనకు మరింత ఉత్తమంగా ఉపకరించగలదన్న గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ- ఒక తీర్మానాన్ని ఆమోదించడమైంది.