ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యూరోపియన్ యూనియన్ హై రెప్రజెంటేటివ్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలిసి ఫెడరికా మొఘెరిని
ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మొఘెరిని లు పరస్పర ప్రయోజనాలు కలిగిన ప్రాంతీయ మరియు ప్రపంచ పరిణామాలపై చర్చలు జరిపారు. భారతదేశం మరియు ఇయు ల మధ్య భద్రత సహకారాన్ని, మరీ ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఈ విధమైన సహకారాన్ని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రధాన మంత్రి, మొఘరిని లు ఒప్పుకొన్నారు.
గడచిన ఇండియా-ఇయు శిఖరాగ్ర సమావేశం సందర్భంగా 2016 మార్చి నెలలో బ్రసెల్స్ లో తన పర్యటన విజయవంతం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకొన్నారు. 2017 అక్టోబరు నెలలో భారతదేశంలో జరుగనున్న ఇండియా-ఇయు శిఖరాగ్ర సమావేశం కోసం తాను ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు.