Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ప్రధాన మంత్రి తరఫున ఇచ్చేపురస్కారాల ను సివిల్ సర్వీసెస్ డే నాడు ప్రదానం చేసిన ప్రధాన మంత్రి

ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ప్రధాన మంత్రి తరఫున ఇచ్చేపురస్కారాల ను సివిల్ సర్వీసెస్ డే నాడు ప్రదానం చేసిన ప్రధాన మంత్రి


సివిల్ సర్వీసెస్ డే ను పురస్కరించుకొని ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ఇచ్చేటటువంటి ప్రధాన మంత్రి తరఫు పురస్కారాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి శ్రీ పి.కె. మిశ్రా, కేబినెట్ సెక్రట్రి శ్రీ రాజీవ్ గాబా తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘కర్మ యోగులుఅందరికీ సివిల్ సర్వీస్ డే శుభాకాంక్షలు పలికారు. పాలన ను మెరుగు పరచడం కోసం, మరి అలాగే జ్ఞానాన్ని వెల్లడి చేయడం కోసం ఒక సూచన ను చేస్తూ ఆయన తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టారు. అవార్డు విజేత ల అనుభవాల ను ప్రతి వారం లో ఒకసారి వర్చువల్ మాధ్యమం ద్వారా శేర్ చేసే ప్రక్రియ ను అన్ని శిక్షణ అకాడమీ లు ఆరంభించాలి అంటూ ఆయన సలహా ను ఇచ్చారు. రెండోది, అవార్డుల ను గెలుచుకున్న ప్రాజెక్టుల లో నుంచి ఒక పథకాన్ని కొన్ని జిల్లాల లో అమలు చేయడం కోసం ఎంపిక చేసుకోవచ్చు, ఆ పని ని చేయడం ద్వారా గడించిన అనుభవాన్ని రాబోయే సంవత్సరం లో సివిల్ సర్వీస్ డే నాడు చర్చించవచ్చు అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఒక 20-22 సంవత్సరాల నుంచి మొదట ముఖ్యమంత్రి గా, ఆ తరువాత ప్రధాన మంత్రి గా తాను ప్రభుత్వ ఉద్యోగుల తో సంభాషిస్తూ వస్తున్న సంగతి ని గుర్తు కు తెచ్చారు. అది తమ రెండు పక్షాల కు ఒకరి నుంచి మరొకరు నేర్చుకొనేందుకు అవకాశాన్ని ఇచ్చింది అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం లో జరుపుకొంటున్న కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్సంవత్సరం లో జరుగుతోందంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించారు. ఇదివరకటి జిల్లా పాలకుల ను ఈ ప్రత్యేక సంవత్సరం లో జిల్లా కు ఆహ్వానించాలని ప్రస్తుత పరిపాలకుల కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది జిల్లా లో కొత్త శక్తి ని నింపుతుంది, గత కాలం లో సంపాదించిన అనుభవం అనేది జిల్లా పాలన దృష్ట్యా ఆహ్వానించదగినటువంటి చైతన్యాన్ని అందిస్తుంది అని ఆయన అన్నారు. అదే విధం గా రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఈ ప్రతిష్టాత్మక సంవత్సరం లో స్వాతంత్య్ర భారతదేశం ప్రస్థానం లో గణనీయం గా తోడ్పాటు ను అందించిన పాలక యంత్రాంగం ప్రముఖుల నుంచి ప్రయోజనాన్ని పొందేందుకు గాను రాష్ట్రానికి చెందినటువంటి పూర్వ చీఫ్ సెక్రట్రిల ను, కేబినెట్ సెక్రట్రిల ను రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానించవచ్చును అని ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్జరుపుకొంటున్న సంవత్సరం లో సివిల్ సర్వీసు ను గౌరవించుకొనేందుకు ఇది ఒక సముచితమైన మార్గం కాగలదు అని ఆయన అన్నారు.

అమృత్ కాలంఅంటే అది ఓ ఉత్సవాన్ని మాత్రమే జరుపుకోవడమో లేక గతాన్ని ప్రశంసించడమో కాదని, 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరాని కి ప్రయాణించడం అనేది ఒక వాడుక గా మిగిలిపోకూడదు అని ప్రధాన మంత్రి అన్నారు. “India @100 ఒక నియమిత చర్య కారాదు. ఈ 25 ఏళ్ళ కాలాన్ని ఒక యూనిటు గా భావించి, మరి మనం ఇక్కడి నుంచే ఒక దృష్టి కోణాన్నంటూ ఏర్పరచుకోవాలి. ఈ ఉత్సవం ఒక చెప్పకోదగిన ఘట్టం అవ్వాలి. ప్రతి ఒక్క జిల్లా ఇదే విధమైన ఉత్సాహం తో ముందుకు సాగాలి. ప్రయాసల లో ఎటువంటి వెనుకబాటుతనం ఉండరాదు. ఇది 1947వ సంవత్సరం లో ఇదే రోజు న, సర్ దార్ పటేల్ గారు చూపిన దారులకు మరియు చేసిన ప్రతిజ్ఞ లకు మనల ను మనం పునరంకితం చేసుకోవలసిన అటువంటి కాలం అని ప్రధాన మంత్రి అన్నారు.

మన ప్రజాస్వామ్య వ్యవస్థ లో మూడు లక్ష్యాల కు మనం కంకణం బద్ధులం కావలసి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఒకటో లక్ష్యం ఏమిటి అంటే అది దేశం లోని సామాన్య ప్రజల జీవనం లో ఒక మార్పు కావాలి, వారి జీవనం సులభతరం కావాలి, మరి ఈ సుగమత తాలూకు అనుభవాన్ని వారు సైతం గ్రహించ గలగాలి అనేదే. ప్రభుత్వం తో వారి యొక్క కార్యకలాపాల ను జరుపుకోవడం లో సామాన్య ప్రజానీకం సంఘర్షణ కు లోనవకూడదు. ప్రయోజనాలు మరియు సేవలు అనేవి ఎటువంటి ఇబ్బంది లేకుండానే అందాలి అని ఆయన వివరించారు. ‘‘సామాన్య మానవుడి స్వప్నాల ను అవి నెరవేరే స్థాయి కి చేర్చడం అనేది వ్యవస్థ యొక్క బాధ్యత. ఈ సంకల్పాన్ని సిద్ధి దశ కు తీసుకు పోవాలి. మరి అదే మన అందరి గమ్యం కావాలి. కలగనడం మొదలుకొని సంకల్పాన్ని తీసుకోవడం నుంచి సిద్ధి దశ కు సాగిపోయేటటువంటి ఈ యొక్క యాత్ర లో ప్రతి మజిలీ లోను వారి చేతుల ను పట్టుకుని నడిపించడాని కి మనం వారి పక్కనే నిలబడాలి’’ అని ఆయన అన్నారు. రెండో విషయం ఏమిటి అంటే భారతదేశం యొక్క మారుతున్న ముఖచిత్రాన్ని మరియు పెరుగుతున్న స్థాయి ని గమనిస్తే మనం చేసేది ఏది అయినప్పటికీ ఆ కార్యం ప్రపంచ స్థాయి లో జరగాలి అనేదే. ప్రపంచం స్థాయి లో చోటు చేసుకొంటున్న కార్యకలాపాల ను మనం అనుసరించ లేకపోయామంటే గనక మన ప్రాథమ్యాలు, మనం శ్రద్ధ వహించవలసిన రంగం ఏవి అనేది నిర్ధారించుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది. ఈ విషయాన్ని మనస్సు లో పెట్టుకొని మనం మన పథకాల ను, మన పాలన నమూనాల ను అభివృద్ధి పరచుకోవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. మన వ్యవస్థ లు మరియు నమూనా లు నియమిత వేగం తో మార్పు చేర్పుల కు అనువు గా ఉండాలి. గత శతాబ్ది తాలూకు వ్యవస్థల తో నేటి కాలం లోని సవాళ్ళ ను మనం ఎదుర్కోలేం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇక మూడో విషయం గా ‘‘వ్యవస్థ లో మనం ఎక్కడ ఉన్నప్పటి కీ కూడా దేశం యొక్క ఏకత మరియు అఖండత అనేవి మన ప్రధానమైనటువంటి బాధ్యత గా ఉండాలి. దీనిలో ఎటువంటి రాజీ కి తావు ఉండనేకూడదు. స్థానికం గా తీసుకొనే నిర్ణయాలు అయినా సరే వాటిని ఇదే గీటురాయి పైన గీచి గమనించుకోవాలి. మనం తీసుకొనే ప్రతి ఒక్క నిర్ణయం దేశం యొక్క ఐకమత్యాని కి, దేశం యొక్క సమగ్రత కు బలాన్ని ఇవ్వగలిగింది గా ఉండాలి. దేశ ప్రజల కు అగ్ర తాంబూలం’ (నేశన్ ఫస్ట్) అనేది మన నిర్ణయాల కు సదా మూలం గా ఉండాలి అని ఆయన అన్నారు.

భారతదేశం యొక్క ఘనమైన సంస్కృతి అనేది రాచరిక వ్యవస్థ లు మరియు రాచరిక సింహాసనాలు వంటి వాటితో తయారు కాలేదు. వేల కొద్దీ సంవత్సరాల పాటు మనం అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయం ఏది అంటే అది సామాన్య మానవుని యొక్క బలాన్ని వెంట తీసుకొని ముందుకు పోవడం అనేదే. ఇది దేశాని కి ఉన్నటువంటి మార్పు ను స్వీకరించే భావన ను మరియు మన ప్రాచీన జ్ఞానాన్ని కాపాడుకొంటూనే ఆధునికత ను అక్కున చేర్చుకోవడాన్ని సూచిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం యొక్క సామర్ధ్యాన్ని పెంచి పోషించడం, సమాజం యొక్క శక్తి ని వెలికి తీయడం, మరి అలాగే సమాజం యొక్క సామర్త్యాన్ని సమర్ధించడం.. ఇవే ప్రభుత్వ వ్యవస్థ యొక్క కర్తవ్యాలు అని ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ లోను, వ్యవసాయం లోను తెర మీద కు వస్తున్నటువంటి నూతన ఆవిష్కరణల తాలూకు ఉదాహరణల ను గురించి ఆయన ప్రస్తావిస్తూ, రూపశిల్పుల పాత్ర ను మరియు సమర్ధకుల భూమిక ను పోషించండి అంటూ పరిపాలకుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఒక టైపిస్టు కు మరియు ఒక సితార్ వాదకుని కి మధ్య ఉన్న తేడా ను గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, పరిశీలించగల జీవనాన్ని గడపవలసిన అవసరం, కలల ను కంటూ ఉత్సాహం తొణికిసలాడుతూ ప్రయోజనం తో కూడిన జీవనాన్ని సాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘నేను ప్రతి ఒక్క క్షణం లో జీవించాలి అని కోరుకొంటున్నాను. ఎందుకంటే, అలా చేయడం ద్వారా ఇతరులు సైతం చక్కగా జీవించడాని కి వారికి నేను సేవ చేస్తాను, వారికి నేను సాయం చేస్తాను’’ అని ఆయన అన్నారు. పలువురు నడచిన దారినే మనమూ నడవడం కాకుండా నిర్ణీత పరిధి కి మించిన ఆలోచనల ను చేయాలి అంటూ అధికారుల కు శ్రీ నరేంద్ర మోదీ ఉద్భోదించారు. పాలన లో సంస్కరణ మన సహజ వైఖరి కావాలి అంటూ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. పాలన పరమైన సంస్కరణ లు అనేవి ప్రయోగాత్మకం గా ఉండాలి. అంతేకాకుండా, అవి కాలం యొక్క మరియు దేశం యొక్క అవసరాల ను బట్టి ఉండాలి అని ఆయన చెప్పారు. పాతబడిపోయిన చట్టాల ను తగ్గించడం, పాటించవలసిన నియమాల సంఖ్య ను కుదించడం.. ఇవి తన అతి ముఖ్యమైన పనుల లో ఒక పని అయిందని ఆయన తెలిపారు. మనం ఒత్తిడి కి లోనైనప్పుడు మాత్రమే మార్పు నకు లోను అవకూడదు, మనం ఫలానా మార్పు జరుగుతుంది అనే సూచన అందడాని కంటే ముందుగానే మెరుగుదల కోసం ప్రయత్నించాలి అని ప్రధాన మంత్రి అన్నారు. కొరత బాధించిన కాలం లో చోటుచేసుకొన్న నిబంధనల వల్ల మరియు మనస్తత్వం వల్ల మనం పాలింపబడకూడదు. మనం సమృద్ధి తాలూకు ధోరణి ని కలిగివుండాలి. అదే మాదిరి గా మనం సవాళ్ళ కు ప్రతిస్పందించడం ఒక్కటే కాకుండా ఆ సవాళ్ళ ను ముందుగానే అంచనా కట్టాలి అని ఆయన అన్నారు. ‘‘గడచిన 8 సంవత్సరాల కాలం లో దేశం లో ఎన్నో పెద్ద పెద్ద ఘటన లు జరిగాయి. ఈ ప్రచార ఉద్యమాల లో అనేకం ఎటువంటివి అంటే వాటి వల్ల నడవడిక పరమైనటువంటి మార్పు చోటు చేసుకొంది’’ అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. నేను రాజ నీతి తాలూకు స్వభావం కలిగిన వాడి ని కాను, నేను జన నీతి యొక్క లక్షణం కలిగినవాడిని అని ఆయన అన్నారు.

అధికారులు వారి జీవనం లో కీలక సంస్కరణల ను అవలంబించాలి అని అభ్యర్థిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఉదాహరణ గా చెప్పాలి అంటే, అది పరిశుభ్రత కావచ్చు, జిఇఎమ్ ను ఉపయోగించడం కావచ్చు లేదా వారి జీవనం లో యుపిఐ కి స్థానం ఉన్నదా లేక లేదా అనేది గమనించుకోవాలి అంటూ ఆయన ప్రస్తావించారు.

సామాన్య పౌరుల సంక్షేమం కోసం జిల్లా లు/కార్యాచరణ విభాగాలు మరియు కేంద్రీయ / రాష్ట్రాల సంస్థలు అమలు పరచినటువంటి అసాధారణమైన కార్యాల ను మరియు కొత్త కొత్త కార్యక్రమాల ను గుర్తించాలి అనే ఉద్దేశ్యం తో ప్రజా పాలన లో ప్రావీణ్యాని కి గాను ప్రధాన మంత్రి తరఫున ప్రకటించేటటువంటి పురస్కారాల ను ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తించిన ప్రాథమ్య కార్యక్రమాలు మరియు నూతన ఆవిష్కరణల ను ప్రభావవంతమైన రీతి లో అమలు పరచినందుకు కూడా ఈ పురస్కారాల ను ప్రదానం చేయడం జరుగుతున్నది.

ఈ కింద ప్రస్తావించినటువంటి అయిదు గుర్తించిన ప్రాథమ్య కార్యక్రమాల లో చేసిన మార్గదర్శక ప్రాయమైన కార్యాల కు గాను సివిల్ సర్వీసెస్ డే 2022 సందర్భం లో పురస్కారాల ను ప్రదానం చేయడం జరుగుతున్నది: (1) పోషణ్ అభియాన్ లో ‘‘జన్ భాగీదారీ’’ లేదా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, (2) ఖేలో ఇండియా పథకం యొక్క మాధ్యమం ద్వారా క్రీడలు మరియు వెల్ నెస్ లో శ్రేష్ఠత్వాన్ని ప్రోత్సహించడం, (3) పిఎమ్ స్వనిధి యోజన లో డిజిటల్ పేమెంట్స్ మరియు సుపరిపాలన, (4) ఒక జిల్లా, ఒక ఉత్పత్తి పథకం యొక్క మాధ్యమం ద్వారా సమగ్ర అభివృద్ధి, (5) మానవ ప్రమేయానికి తావు లేకుండానే సేవల ను ఆరంభం నుంచి అంతం వరకు నిరంతరాయంగా ప్రజల కు అందించడం.

ఈ సంవత్సరం లో గుర్తించిన అయిదు ప్రాథమ్య కార్యక్రమాలు మరియు ప్రజా పాలన/సేవ ల అందజేత మొదలైన రంగాల లో నూతన ఆవిష్కరణల కు గాను మొత్తం 16 పురస్కారాల ను ఇవ్వడం జరుగుతున్నది.

 

**********

DS