Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప్రగతి’ ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సమావేశం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐసిటి ఆధారితమైన మల్టి-మోడల్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా జరిగిన ఇరవై ఒకటో ముఖాముఖి సమావేశానికి ఈ రోజు అధ్యక్షత వహించారు.

 ఈశాన్య రాష్ట్రాలలో వరదలు మరియు ఇతర ప్రకృతి విపత్తుల వల్ల తలెత్తిన స్థితిని సమీక్షించడం ద్వారా ప్రధాన మంత్రి  ఈ సమావేశాన్ని మొదలుపెట్టారు.  రాష్ట్రాలకు కేంద్రం నుండి సాధ్యమైన అన్ని విధాలుగానూ సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వ్యాపారులంతా జిఎస్ టి రెఝీమ్ లో శీఘ్రంగా నమోదు అయ్యే దిశగా చొరవ తీసుకోవాలని ప్రధాన కార్యదర్శులందరికీ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.  ఈ పని ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తి కావాలని ఆయన నొక్కిచెప్పారు.

 సిపిడబ్ల్యుడి మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా చోటుచేసుకొన్న పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు.  ఈ విషయంలో సానుకూలమైనటువంటి ధోరణిలో ప్రతిస్పందించవలసిందిగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఆయన ఆదేశించారు.  ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ (GeM) వేదిక మీదకు వచ్చే విధంగా విక్రేతలందరినీ ప్రోత్సహించాలని సిపిడబ్ల్యుడి కి ఆయన సూచించారు.

 ప్రధాన మంత్రి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లతో సహా పలు రాష్ట్రాలలో విస్తరించిన  రైల్వేలు, రహదారులు మరియు పెట్రోలియమ్ రంగాలలో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కీలకమైన అవస్థాపన పథకాలలో పురోగతిని సమీక్షించారు.  ఈ రోజు సమీక్షించిన పథకాలలో చెన్నై బీచ్-కొరుక్కుపేట్ మూడో లైను మరియు చెన్నై బీచ్-అత్తిప్పాట్టు నాలుగో లైను; హౌడా-అమ్ తా-చంపాదంగ నూతన బ్రాడ్ గేజ్ లైను; వారాణసీ బైపాస్ నాలుగు దోవలుగా విస్తరించే పథకం; ఎన్ హెచ్-58 లోని ముజఫర్ నగర్-హరిద్వార్ సెక్షన్ ను నాలుగు దోవలుగా విస్తరించే పథకం కలిసివున్నాయి.  ఈ రోజు సమీక్ష జరిపిన పథకాలలో అనేక పథకాలు దశాబ్దాల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఉండటాన్ని (ఒక పని అయితే ఏకంగా నాలుగు దశాబ్దాలకు పైగా పెండింగు పడింది) గమనించిన ప్రధాన మంత్రి జాప్యాలను, ఆ జాప్యాల ఫలితంగా వ్యయాలు ఎగబాకడాన్ని నివారించడం కోసం వీలయిన అన్ని చర్యలను తీసుకోవలసిందిగా ప్రధాన కార్యదర్శులను కోరారు.  అటువంటి అవస్థాపన పథకాలు వేగవంతంగా అమలయ్యేటట్లు చూడాలని ఆయన స్పష్టం చేశారు.

 ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ) యొక్క పురోగతిని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు.   కొత్త నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని సంబంధిత విభాగాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.