Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుల్‌వామా లో ఉగ్ర‌వాదుల దాడి పై ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌


పుల్‌వామా లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడి బాధ్యుల‌ ను శిక్షించ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ దుష్క‌ర్మ‌ కు పాల్ప‌డిన వారి తో పాటు, ఉగ్ర‌వాదుల‌ కు స‌హాయాన్ని అందిస్తున్న‌టువంటి వారు మ‌రియు దుష్ప్రేర‌ణ‌ ను అందిస్తున్న వారు ఒక పెద్ద పొర‌పాటు ను చేసిన‌ట్లు ఆయ‌న చెప్తూ, అందుకు వారు ఒక భారీ మూల్యాన్ని చెల్లించ‌వ‌ల‌సి వస్తుందంటూ హెచ్చ‌రించారు. ఈ ఘ‌ట‌న పట్ల ప్ర‌తిస్పందించ‌డాని కి భ‌ద్ర‌త ద‌ళాల‌ కు పూర్తి స్వేచ్ఛ ను ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. భార‌త‌దేశాన్ని అస్థిర ప‌ర‌చ‌గ‌ల‌న‌నే భ్ర‌మ లో పాకిస్తాన్ ఉండొద్దంటూ ఆయన సవాల్ ను విసరారు.

న్యూ ఢిల్లీ మ‌రియు వారాణ‌సీ ల మ‌ధ్య రాక‌పోక‌లు జ‌రిపే ‘వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్’ రైలు కు న్యూ ఢిల్లీ రైల్వే స్టేశ‌న్ లో నేడు ప్రారంభ సూచ‌కం గా జెండా ను చూపే ముందు అక్కడ గుమికూడిన జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ఆయన ప్ర‌సంగించారు.

ప్రధాన మంత్రి ఉపన్యాసం లో తొలుత పుల్ వామా లో ఉగ్రవాదుల దాడి కి సంబంధించిన కొన్ని భాగాలు ఈ కింది విధం గా ఉన్నాయి:-

“అన్నింటి కన్న ముందు నేను పుల్‌వామా లో జరిగిన ఉగ్ర‌వాదుల దాడి ఘ‌ట‌న లో అమ‌రులైన జ‌వానుల‌ కు ఆదరపూర్వక శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను. వారు దేశం కోసం వారి ప్రాణాల‌ ను త్యాగం చేశారు. ఈ దుఃఖభరిత ఘ‌డియ లో- ఆప్తుల‌ ను కోల్పోయిన కుటుంబాల‌ సభ్యుల యొక్క శోకం లో- నేను మరియు భారతదేశ పౌరులం అందరం పాలుపంచుకొంటున్నాం.

తీవ్ర‌ ఆక్రోశం ఉంద‌ని, జ‌రిగిన ఘ‌ట‌న ను చూసి మీ ర‌క్తం మ‌రగుతోంద‌ని నాకు తెలుసు. ఈ సమయం లో ఓ బ‌ల‌మైన ప్ర‌తి చ‌ర్య కు దిగాల‌నేట భావాలు మ‌రియు ఊహ‌ లు దేశం లో రేకెత్త‌డం స్వాభావిక‌మే.

భ‌ద్ర‌త ద‌ళాల‌ కు మేము పూర్తి స్వేచ్ఛ ను ఇచ్చాం. మ‌న భ‌ద్ర‌త ద‌ళాల యొక్క సాహ‌సం పట్ల, ప‌రాక్ర‌మం ప‌ట్ల మ‌న‌ కు పూర్తి న‌మ్మ‌కం ఉంది. నాలో పూర్తి భరోసా ఉంది.. ఏమనంటే దేశ భ‌క్తి భావన ముప్పిరిగొన్న ప్రజలు మ‌న ఏజెన్సీల కు స‌రి అయిన స‌మాచారాన్ని చేరవేస్తారని, దాంతో ఉగ్ర‌వాదాన్ని అణగదొక్కడానికి మ‌నం మ‌న ప్ర‌య‌త్నాల‌ ను ముమ్మ‌రం చేయ‌గ‌ల‌మ‌నీనూ.

ఉగ్ర‌వాద సంస్థ‌ లు వాటి కి స‌హాయ‌ప‌డుతున్న వర్గాలు మ‌రియు దుష్ప్రేర‌ణ ను ఇస్తున్న వ‌ర్గాలు తాము ఒక పెద్ద పొర‌పాటు ను చేశాయ‌ని నేను చెప్ప‌ద‌లచుకొన్నాను. వారు వారి చ‌ర్య‌ల కు చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకోవల‌సి వస్తుంది.

ఈ దాడి కి తెగ‌బ‌డిన వారు, ఈ దాడి వెనుక ఉన్న వారు.. వీరందరి ని తప్పక శిక్షించ‌డం జ‌రుగుతుంద‌ని దేశ ప్ర‌జ‌ల కు నేను హామీ ని ఇస్తున్నాను.

ఎవరైతే మ‌మ్మ‌ల్ని విమ‌ర్శిస్తున్న‌ారో వారి యొక్క ప్ర‌వృత్తి ని నేను ఆదరిస్తాను. వారి భావనల ను కూడా నేను అర్థం చేసుకోగలను. విమర్శించడానికి వారికి పూర్తి అధికారం ఉంది కూడాను.

కానీ, నా స్నేహితులంద‌రినీ నేను కోరేది ఏమిటంటే, ఈ తరుణం చాలా సంవేదనశీలమైనటువంటిదే కాక భావావేశ‌భరిత‌మైంది కూడాను. మ‌రి దేశ ప్ర‌జ‌లు ఉగ్ర‌వాదుల దాడి కి వ్య‌తిరేకం గా పోరాడేందుకు ఏక‌మ‌య్యారు. మ‌నం రాజ‌కీయాల కు అతీతంగా ఎదిగి ఒకే స్వ‌రం లో సంభాషించ‌వ‌ల‌సివుంది. ఉగ్ర‌వాదాని కి వ్య‌తిరేకంగా పోరాడ‌టం లో మనం ఒక దేశం- ఒక స్వ‌రం గా ఉన్నాం అనే సందేశం ప్రపంచం అంతటికీ చేరవలసివుంది. ఎందుకంటే మనం పై చేయి ని సాధించడం కోసమే ఈ పోరు ను సల్పుతున్నాం.

అంత‌ర్జాతీయ స‌ముదాయం లో ఇప్ప‌టికే ఒంట‌రిదైపోయింది మన మ‌న పొరుగు దేశం. అది ఒక భ్ర‌మ‌ లో ఉంది. పిరికిపంద చ‌ర్య‌ల తో, అధ‌మ ప‌న్నాగాల తో భార‌త‌దేశాన్ని నిరుత్సాహ ప‌ర‌చ‌గ‌ల‌న‌ని అది అనుకుంటే న‌న్నొక విష‌యాన్ని స్ప‌ష్టం గా తెలియ‌ జేయ‌నివ్వండి.. అది భార‌త‌దేశాన్ని అస్థిర ప‌ర‌చాల‌నే ప‌గ‌టి క‌ల‌లను క‌న‌డం మానివేయాలి. మ‌న ఈ పొరుగు దేశం ఏదైతే ఆర్థికం గా నిరాశాపూరిత‌మైన స్థితి లో ఉందో ఆ దేశం అటువంటి ప్ర‌య‌త్నాని కి ప‌రాజ‌యం రాసి పెట్టి ఉంద‌ని, మరి అది భ‌గ్నం అవుతుంద‌ని తెలుసుకొని తీరాలి.

అటువంటి మార్గాల‌ ను అనుస‌రించే వారంతా త‌మంత‌ట తామే నాశ‌న‌మ‌వుతార‌ని ప‌దే ప‌దే నిరూప‌ణ అయింది. మ‌నం అనుస‌రించిన ప‌థం పురోగ‌తి మ‌రియు అభివృద్ధి తో కూడుకొన్నది గా ఉంది.

130 కోట్ల మంది భార‌తీయులు అటువంటి ఏ చేష్ట‌కు గాని, లేదా దాడి కి గాని దీటైన స‌మాధానాన్ని ఇస్తారు. ఈ ఉగ్ర‌వాద దాడి ని అనేక పెద్ద దేశాలు తీవ్రంగా గ‌ర్హించాయి. ఆ దేశాలు భార‌త‌దేశం వెనుక నిల‌బ‌డ్డాయి. భార‌త‌దేశాని కి మ‌ద్ద‌తు ను కూడా వ్య‌క్తం చేశాయి. ఈ దేశాల‌న్నింటికీ నేను కృత‌జ్ఞుడి ని. ఉగ్ర‌వాదాని కి వ్య‌తిరేకం గా ప్ర‌పంచం తరఫున పోరాడటం లో చేతులు క‌ల‌పండంటూ ఆ దేశాల‌ కు నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. ఉగ్ర‌వాద భూతాన్ని ఎప్పుడు అదుపు చేయ‌గ‌ల‌మంటే, ఉగ్ర‌వాదాని కి వ్య‌తిరేకంగా పోరాడ‌డం లో దేశాల‌న్నీ ఏక‌మైన‌ప్పుడే.

మిత్రులారా,

పుల్‌వామా ఉగ్ర‌వాద దాడి జ‌రిగిన అనంత‌రం మ‌నం దుఃఖం లోను, తీవ్ర‌మైన ఆక్రోశం లోను ఉన్నాం. అయితే, మీకు ఒక విష‌యాన్ని న‌న్ను చెప్ప‌నివ్వండి.. దేశ ప్ర‌జ‌లు ఇటువంటి దాడుల‌ కు బ‌లం గా ఎదురు దాడి చేస్తారు. భార‌త‌దేశం బెద‌రిపోదు. మ‌న సాహ‌సిక జ‌వాను లు వారి ప్రాణాల‌ ను త్యాగం చేశారు. అమ‌ర‌ వీరులు రెండు స్వ‌ప్నాల కోసం జీవిస్తారు. అవేమిటంటే, సుర‌క్ష, ఇంకా, స‌మృద్ధి.. దేశ ప్ర‌జ‌ల‌ ను క్షేమంగా ఉంచ‌డ‌మే సుర‌క్ష‌. దేశ ప్ర‌జ‌ల సంప‌న్న‌తే స‌మృద్ధి.. నేను మ‌న మృత వీరుల‌ కు ప్ర‌ణామాన్ని ఆచ‌రిస్తున్నాను. వారి ఆశీర్వాదాల‌ ను కోరుకొంటూ మ‌రి మీకు ఒక భ‌రోసా ను అందిస్తున్నాను. అంది ఏమిటంటే, వారి యొక్క క‌ల‌ల‌ ను నెర‌వేర్చ‌డం కోసం ఏ క‌ల‌ల కోస‌మైతే వారు త‌మ ప్రాణాల‌ ను త్యాగం చేశారో వాటి ని నెర‌వేర్చ‌డాని కి శ‌క్తి వంచ‌న లేకుండా ప‌ని చేస్తాము. అమ‌ర వీరుల‌ కు మా యొక్క వంద‌నాన్ని ఆచ‌రించేందుకు గుర్తు గా అభివృద్ధి మార్గం లో వేగ గ‌తి ని అందుకోవ‌డం కోసం మ‌నం క‌ఠోరం గా పాటుప‌డ‌దాం.

‘వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్’ రైలు కు రూపు రేఖ‌లను తీర్చ‌డం, మరి అలాగే ఆ రైలు ను న‌డ‌పడం వెనుక ఉన్న‌ ప్ర‌తి ఒక్క ఇంజినీరు కు, ప్ర‌తి శ్రామికుని కి ఇవే నా ప్రశంస లు. చెన్నై లో త‌యార‌యిన‌టువంటి ఈ రైలు ఈ రోజు న న్యూ ఢిల్లీ నుండి వారాణ‌సీ కి త‌న తొలి ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఇది ‘ఏక్ భార‌త్‌- శ్రేష్ఠ భార‌త్’కు మ‌రియు ‘వందే భార‌త్’కు బ‌లాన్ని ఇస్తోంది.