Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నర్మద సేవా యాత్ర ముగింపు సూచకంగా మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నర్మద సేవా యాత్ర ముగింపు సూచకంగా మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో రేపు జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్నారు.

‘‘నర్మద సేవా యాత్ర ముగింపు సూచకంగా మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో రేపు మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో పాలుపంచుకోబోతుండడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

నర్మద పరిరక్షణకు ఉద్దేశించిన శ్రేష్ఠమైన ప్రజా ఉద్యమమే నర్మద సేవా యాత్ర. అంతేకాదు, ఇది పర్యావరణాన్ని కాపాడుకోవాలనే విశాలమైనటువంటి సందేశాన్ని కూడా అందిస్తోంది.

నేను రేపు మధ్య ప్రదేశ్ లో నర్మద సేవా అభియాన్ ను ప్రారంభించబోతున్నాను. ఈ కార్యక్రమం మధ్య ప్రదేశ్ పర్యావరణంపైన పెద్ద ప్రభావాన్ని ప్రసరింపచేయడం ఖాయం.

మీరు మీ మొబైల్ ఫోన్ లలో https://t.co/TYuxNNJfIf కు లాగాన్ అయ్యి రేపటి నర్మద సేవా యాత్ర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

****