ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ డెయరి ఫెడరేశన్ వరల్డ్ డెయరి సమిట్ (ఐడిఎఫ్ డబ్లుడిఎస్) 2022 ను ఈ రోజు న గ్రేటర్ నోయెడా లోని ఇండియా ఎక్స్ పో సెంటర్ ఎండ్ మార్ట్ లో ప్రారంభించారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రపంచం అంతటా పాడి రంగాని కి చెందిన ప్రముఖులంతా ఈ రోజు న భారతదేశం లో గుమికూడటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలోచనల ను వెల్లడి చేసుకోవడానికి ప్రపంచ పాడి శిఖర సమ్మేళనం ఒక గొప్ప మాధ్యమం గా మారనుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘పాడి రంగం లోని అవకాశాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని ఇవ్వడం ఒక్కటే కాకుండా, ప్రపంచం అంతటా కోట్ల కొద్దీ వ్యక్తుల కు ఒక ప్రధానమైనటువంటి జీవనోపాధి వనరు గా కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.
‘పశు ధనం’ మరియు పాల తో ముడిపడ్డ వ్యాపారం అనేవి భారతదేశ సాంస్కృతిక ముఖచిత్రం లో కేంద్ర స్థానం లో ఉన్నాయని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇది భారతదేశం యొక్క పాడి రంగాని కి విశేష గుణాల ను ఎన్నిటినో ప్రసాదించింది అని ఆయన అన్నారు. ప్రపంచం లో అభివృద్ధి చెందిన ఇతర దేశాల కు భిన్నం గా భారతదేశం లోని పాడి రంగాని కి చిన్న రైతు లు చోదక శక్తి గా ఉన్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశం లో పాడి రంగం ‘‘అధికోత్పత్తి’’ కంటే కూడా ‘‘సామాన్య ప్రజానీకం ద్వారా ఉత్పత్తి’’ అనే వర్ణన ను కలిగివుంది అని ఆయన అన్నారు. ఒకటి, రెండు లేదా మూడు పశువుల ను మాత్రమే కలిగివున్నటువంటి ఈ చిన్న రైతు ల ప్రయాస ల ప్రాతిపదిక న భారతదేశం పాల ఉత్పత్తి లో అతి పెద్ద దేశం గా నిలచింది, మరి ఈ రంగం 8 కోట్ల కు పైచిలుకు కుటుంబాల కు బ్రతుకుతెరువు ను అందిస్తోందని ఆయన తెలియజేశారు.
భారతదేశం లో పాడి వ్యవస్థ కు ఉన్నటువంటి రెండో అద్వితీయమైన లక్షణాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, భారతదేశం లో పాడి సహకార సంఘాల యొక్క నెట్ వర్క్ ఎంత భారీది అంటే అటువంటి ఒక ఉదాహరణ ను యావత్తు ప్రపంచం లో మరెక్కడా చూడజాలరు అని పునరుద్ఘాటించారు. ఈ పాడి సహకార సంఘాలు దేశం లో రెండు లక్షల కు పైగా పల్లెల లో, దాదాపు గా రెండు కోట్ల మంది రైతుల వద్ద నుండి రోజు కు రెండు సార్లు వంతు న పాల ను సేకరించి వినియోగదారుల కు అందిస్తున్నాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ యావత్తు ప్రక్రియ లో ఎటువంటి మధ్యవర్తి ఉండరు, వినియోగదారుల వద్ద నుండి అందిన డబ్బులో 70 శాతాని కి పైగా డబ్బు నేరు గా రైతుల జేబుల లోకి వెళ్తోంది అని సభికుల దృష్టి కి ప్రధాన మంత్రి తీసుకు వచ్చారు. ‘‘యావత్తు ప్రపంచం లో మరే దేశాని కి ఇటువంటి నిష్పత్తి లేదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పాడి రంగం లో చెల్లింపుల కు సంబంధించి డిజిటల్ సిస్టమ్ యొక్క ప్రభావశీలత ను గురించి సైతం ఆయన నొక్కి చెప్తూ, ఇది ఇతర దేశాల కు అనేక పాఠాల ను నేర్పగలుగుతుంది అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి అభిప్రాయం లో, ఈ రంగాని కి ఉన్నటువంటి మరొక విశిష్టత ఏమిటి అంటే, అది ప్రతికూల పరిస్థితుల కు ఎదురొడ్డి నిలవగలిగిన స్వదేశీ జాతులు ఉండడం అనేదే. గుజరాత్ లోని కచ్ఛ్ ప్రాంతాని కి చెందిన బన్నీ గేదె ల జాతి ని ఒక ఉదాహరణ గా ఆయన ప్రస్తావించారు. ముర్రా, మెహసాణా, జాఫ్రాబాదీ, నీలి రవి, మరియు పంఢర్ పురి వంటి ఇతర గేదె జాతుల ను గురించి, అలాగే గీర్, సాహివాల్, రాఠీ, కాంక్ రేజ్, థార్ పర్ కర్ మరియు హరియాణా గోవు జాతుల ను గురించి కూడా ను ఆయన ప్రస్తావించారు.
పాడి రంగం లో మరొక విశిష్టమైన అంశం గా నారీ శక్తి ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. భారతదేశం లో పాడి రంగం లో నిమగ్నమై ఉన్న శ్రమికుల లో 70 శాతం మహిళ లు ఉన్నారు అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘మహిళ లు భారతదేశం పాడి రంగం లో నిజమైన నేత లు, ఇది ఒక్కటే కాదు, భారతదేశం లోని డెయరి కోఆపరేటివ్స్ లో మూడో వంతు కు పైచిలుకు సభ్యులు గా ఉన్నది కూడా మహిళ లే’’ అని ఆయన వివరించారు. ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన పాడి రంగం వరి మరియు గోధుమల సంయుక్త విలువ కంటే కూడా అధికం గా ఉంది అని ఆయన అన్నారు. దీనికి అంతటికీ భారతదేశం లోని నారీ శక్తి చోదకం గా ఉంది అని ఆయన అన్నారు.
భారతదేశం లో పాడిరంగం లో అవకాశాల ను అధికం చేయడం కోసం ప్రభుత్వం 2014వ సంవత్సరం నాటి నుండి పట్టువిడువక కృషి చేసింది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. దీనితో పాల ఉత్పత్తి లో పెరుగుదల చోటు చేసుకొంది. ఫలితం గా రైతుల ఆదాయం లో వృద్ధి కి అవకాశం లభించింది అని ఆయన వివరించారు. ‘‘భారతదేశం 2014వ సంవత్సరం లో 146 మిలియన్ టన్నుల పాల ను ఉత్పత్తి చేసింది. ఇది ప్రస్తుతం 210 మిలియన్ టన్నుల కు పెరిగింది. అంటే పెరుగుదల దాదాపు 44 శాతం మేరకు ఉందన్న మాట’’ అని ప్రధాన మంత్రి వివరించారు. ప్రపంచం స్థాయి లో 2 శాతం ఉత్పత్తి వృద్ధి తో పోల్చి చూసినప్పుడు భారతదేశం 6 శాతాని కి పైచిలుకు పాల ఉత్పత్తి తాలూకు వృద్ధి రేటు ను నమోదు చేస్తున్నది అని కూడా ఆయన పేర్కొన్నారు.
పాడి రంగం తాలూకు సవాళ్ళ ను పరిష్కరిస్తూనే, ఉత్పత్తి ని పెంచడం పై శ్రద్ధ ను తీసుకొనేటటువంటి ఒక సమతుల్యమైన డెయరి ఇకోసిస్టమ్ ను అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఇకోసిస్టమ్ లో రైతుల కు అదనపు ఆదాయం, పేదల సశక్తీకరణ, స్వచ్ఛత, రసాయనిక పదార్థాల కు ఆస్కారం ఉండనటువంటి సాగు పద్ధతులు, స్వచ్ఛ శక్తి, మరియు పశు సంరక్షణ అనేవి ఒకదానితో మరొకటి పెనవేసుకొన్నాయి అని ఆయన వివరించారు. పల్లెల లో పశుపోషణ మరియు పాడి.. ఈ రెండిటి ని పచ్చదనం తో కూడినటువంటి మరియు స్థిరత్వం కలిగినటువంటి వృద్ధి అనే ఒక శక్తివంతమైన మాధ్యమం గా ఏర్పడేలా ప్రోత్సహించడం జరుగుతోంది అని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రీయ గోకుల్ మిశన్, గోబర్ ధన్ యోజనవంటి పథకాలు, పాడి రంగం లో డిజటలీకరణ, ఇంకా పశువుల కు టీకామందు ను వేయించడం లతో పాటు ఒకసారి వాడిన ప్లాస్టిక్ ను మళ్ళీ మళ్ళీ వినియోగించకుండా నిషేధాన్ని విధించడం వంటి వి ఈ దిశ లో తీసుకొన్న చర్యలు అని ఆయన అన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క వినియోగాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించి, భారతదేశం పాడి పశువుల అతి పెద్ద సమాచార నిధి ని రూపొందిస్తున్నది. అలాగే ప్రతి ఒక్క పాడి పశువు ను టేగింగ్ చేయడం జరుగుతోంది అని వెల్లడించారు. ‘‘పశువుల కు బయోమీట్రిక్ గుర్తింపు ను మేం అమలు పరుస్తున్నాం. ఈ కార్యక్రమాని కి పశు ఆధార్ అనే పేరు ను పెట్టాం’’ అని ఆయన అన్నారు.
ఎఫ్ పిఎ స్, మహిళల స్వయంసహాయ సమూహాలు మరియు స్టార్ట్-అప్స్ వంటి వర్ధిల్లుతున్న నవపారిశ్రామికత్వ స్వరూపాల గురించి కూడా ను శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రకటించారు. ఈ రంగం లో ఇటీవలి కాలాల్లో ఒక వేయి కి పైగా స్టార్ట్-అప్స్ ఉనికి లోకి వచ్చాయి అని ఆయన అన్నారు. గోబర్ ధన్ యోజన లో పడిన ముందడుగుల ను గురించి కూడా ఆయన మాట్లాడారు. డెయరి ప్లాంటు లు పేడ నుండి సొంతం గా విద్యుత్తు ను ఉత్పత్తి చేసుకొనే స్థితి కి చేరుకోవాలి అన్నదే లక్ష్యం గా ఉంది అని ఆయన వివరించారు. ఆ విధం గా తయారయ్యేటటువంటి ఎరువు సైతం రైతుల కు సహాయకారి గా నిలుస్తుందని ఆయన చెప్పారు.
సాగు తో ప్రధాన మంత్రి ఒక పోలిక ను చెప్తూ, పశుపోషణకైనా సాగు కు అయినా వైవిధ్యం అవసరం, ఒకే విధమైన పద్ధతి ని పాటించడం అనేది ఏకైక పరిష్కారం కాకపోవచ్చు అన్నారు. ప్రస్తుతం భారతదేశం ఇటు దేశవాళీ జాతుల కు, అటు సంకర జాతుల కు సమానమైనటువంటి ప్రాధాన్యాన్ని కట్టబెడుతోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇది జలవాయు పరివర్తన కారణం గా వాటిల్లే నష్టం తాలూకు భయాన్ని కూడా తగ్గించగలుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.
రైతు ల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్న మరొక ప్రధాన సమస్య ను గురించి కూడా ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించారు. అది ఏమిటి అంటే పశువుల కు సోకే వ్యాధులు అనేదే. పశువు జబ్బు బారిన పడింది అంటే అది రైతు యొక్క జీవనాన్ని ప్రభావితం చేస్తుంది, అతడి ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అది పశువు యొక్క సామర్థ్యం పైన, పాలు తదితర ఉత్పాదన ల నాణ్యత పైన కూడా ప్రభావాన్ని చూపుతుంది’’ అని ఆయన వివరించారు. పశువులన్నిటి కి టీకామందు ను వేయించే దిశ లో భారతదేశం కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘మేం 2025వ సంవత్సరానికల్లా అన్ని పశువుల కు గాలికుంటు వ్యాధికి వ్యతిరేకంగాను, ఇంకా బ్రుస్ లాసిస్ కు వ్యతిరేకం గాను పనిచేసేటటువంటి టీకామందు ను వేయించాలని సంకల్పించాం. ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఈ వ్యాధులన్నిటి బారి నుండి విముక్తి ని సాధించాలని మేం లక్ష్యం గా పెట్టుకొన్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఇటీవలి కాలం లో లంపి అనే వ్యాధి కారణం గా భారతదేశం లోని అనేక రాష్ట్రాల లో పశుగణాని కి నష్టం ఏర్పడినట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు గాను వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల తో కలసి కేంద్ర ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నాలు చేస్తోంది అంటూ ఆయన అందరి కి బరోసా ను కల్పించారు. ‘‘మా శాస్త్రవేత్త లు లంపీ స్కిన్ డిజీజ్ కు దేశవాళీ టీకామందు ను కూడా తయారు చేశారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వ్యాధి వ్యాప్తి ని అదుపు చేయడం కోసం పశువుల సంచారం పై దృష్టి ని సారించేందుకు ప్రయాస లు సాగుతున్నాయి అని కూడా ప్రధాన మంత్రి చెప్పారు. అది పశువుల కు టీకామందు ను వేయించడం కావచ్చు, లేదా మరేదైనా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు.. భారతదేశం పాడి రంగం లో తన భాగస్వామ్య దేశాల నుండి మంచి పద్ధతుల ను నేర్చుకొనేందుకు శ్రమించడం తో పాటు గా తన వంతు తోడ్పాటు ను జత చేయడం కోసం ఎల్లవేళ ల కుతూహలాన్ని కనబరుస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశం తన ఆహార భద్రత ప్రమాణాల విషయం లో వేగం గా ప్రతిస్పందించింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించే కంటే ముందుగా, పశుగణం రంగం లో అన్ని కార్యకలాపాల ను గమనించడం కోసం ఒక డిజిటల్ సిస్టమ్ ను రూపొదించే పని లో భారతదేశం పడింది అని పునరుద్ఘాటించారు. డిజిటల్ సిస్టమ్ ఈ రంగాన్ని మెరుగు పరచడానికి అవసరమైన సమాచారాన్ని కచ్చితత్వం తో అందించగలుగుతుందని ఆయన చెప్పారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాలెన్నిటి గురించో ప్రపంచవ్యాప్తం గా జరుగుతున్న కృషి ని ఈ శిఖర సమ్మేళనం చాటిచెప్పనుంది. ఈ రంగం లో ప్రావీణ్యాని కి సంబంధించిన సమాచారాన్ని పరస్పరం వెల్లడి చేసుకొనేందుకు మార్గాల ను సూచించండి అంటూ సమ్మేళనాని కి తరలి వచ్చిన ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘భారతదేశం లో పాడి రంగాన్ని సశక్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల లో పాలుపంచుకోవలసింది గా పాడి పరిశ్రమ యొక్క ప్రపంచ నేతల కు నేను ఇదే ఆహ్వానం పలుకుతున్నాను, అంతేకాకుండా ఇంటర్ నేశనల్ డెయరి ఫెడరేశన్ ను వారి యొక్క ఉత్కృష్టమైన కృషి కి మరియు తోడ్పాటు కు గాను నేను అభినందిస్తున్నాను కూడా’’ అని పేర్కొంటూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి శాఖ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా, మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి శాఖ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్; వ్యవసాయం మరియు ఫూడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజీవ్ కుమార్ బాల్ యాన్, పార్లమెంటు సభ్యులు శ్రీ సురేంద్ర సింహ్ నాగర్ మరియు డాక్టర్ మహేశ్ శర్మ, ఇంటర్ నేశనల్ డెయరి ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ పి. బ్రజాలే మరియు ఇంటర్ నేశనల్ డెయరి ఫెడరేశన్ డైరెక్టర్ జనరల్ కరోలిన్ ఏమండ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం లో 75 లక్షల మంది రైతు లు సాంకేతిక విజ్ఞాన మాధ్యమం ద్వారా జతకలిశారు.
పూర్వరంగం
నాలుగు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 12వ తేదీ మొదలుకొని సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరుగనున్న ఐడిఎఫ్ డబ్లుడిఎస్ 2022 లో ‘పోషణ మరియు బ్రతుకుతెరువు ల కోసం పాడి పరిశ్రమ’ అనే ఇతివృత్తం పై సమాలోచనలు చేయడం కోసం ప్రపంచ దేశాల లోని మరియు భారతదేశం లోని పాడి పరిశ్రమ తో సంబంధం కలిగివున్న పారిశ్రామికవేత్త లు, నిపుణులు, రైతు లు మరియు విధాన రూపకర్త లు సహా, అన్ని పక్షాల వారు గుమికూడనున్నారు. ఈ సమ్మేళనం లో ఐడిఎఫ్ డబ్లుడిఎస్ 2022 లో 50 దేశాల కు చెందిన సుమారు 1500 మంది పాలుపంచుకొంటారన్న సూచన లు ఉన్నాయి. కడపటి శిఖర సమ్మేళనాన్ని ఇంచుమించు అర్థ శతాబ్ది కిందట, 1974వ సంవత్సరం లో, నిర్వహించడమైంది.
భారతదేశం లో పాడి పరిశ్రమ కు ఒక రకమైనటువంటి విశిష్టత ఉంది. అది ఏమిటి అంటే, ఈ పరిశ్రమ ఒక సహకార నమూనా పై ఆధారపడింది. ఈ పరిశ్రమ చిన్న పాడి రైతుల కు, సన్నకారు, పాడి రైతుల కు, ప్రత్యేకించి మహిళల కు సాధికారిత ను కల్పిస్తున్నది. ప్రధాన మంత్రి దృష్టి కోణం నుండి ప్రేరణ ను పొంది, ప్రభుత్వం పాడి రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం అనేక విధాలైన చర్యల ను తీసుకొంది. తత్ఫలితం గా గడచిన ఎనిమిది సంవత్సరాల లో పాల ఉత్పత్తి లో 44 శాతాని కి కన్నా ఎక్కువ వృద్ధి గా నమోదు అయింది. ప్రపంచ పాల పరిశ్రమ లో ఇంచుమించు 23 శాతాని కి సమానం అయినటువంటి వాటా ను కలిగివున్న భారతదేశ పాడి పరిశ్రమ యొక్క సాఫల్య గాథ ను ఐడిఎఫ్ డబ్లుడిఎస్ 2022 లో కళ్ళకు కట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లో దాదాపు 210 మిలియన్ టన్నుల పాలు భారతదేశం లో ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాక దీని తో 8 కోట్ల పై చిలుకు పాడి రైతుల కు సాధికారిత ప్రాప్తిస్తున్నది. ప్రపంచం లోని అత్యుత్తమమైనటువంటి పద్ధతుల ను గురించి భారతదేశం పాడి రైతులు తెలుసుకోవడం లో ఈ శిఖర సమ్మేళనం సహాయకారి కాగలదు.
Speaking at inauguration of International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida. https://t.co/yGqQ2HNMU4
— Narendra Modi (@narendramodi) September 12, 2022
डेयरी सेक्टर का सामर्थ्य ना सिर्फ ग्रामीण अर्थव्यवस्था को गति देता है बल्कि ये दुनिया भर में करोड़ों लोगों की आजीविका का भी प्रमुख साधन है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
विश्व के अन्य विकसित देशों से अलग, भारत में डेयरी सेक्टर की असली ताकत छोटे किसान हैं।
भारत के डेयरी सेक्टर की पहचान “mass production” से ज्यादा “production by masses” की है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
आज भारत में Dairy Cooperative का एक ऐसा विशाल नेटवर्क है जिसकी मिसाल पूरी दुनिया में मिलना मुश्किल है।
ये डेयरी कॉपरेटिव्स देश के दो लाख से ज्यादा गांवों में, करीब-करीब दो करोड़ किसानों से दिन में दो बार दूध जमा करती हैं और उसे ग्राहकों तक पहुंचाती हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
इस पूरी प्रकिया में बीच में कोई मिडिल मैन नहीं होता, और ग्राहकों से जो पैसा मिलता है, उसका 70 प्रतिशत से ज्यादा किसानों की जेब में ही जाता है।
पूरे विश्व में इतना ज्यादा Ratio किसी और देश में नहीं है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
भारत के डेयरी सेक्टर में Women Power 70% workforce का प्रतिनिधित्व करती है।
भारत के डेयरी सेक्टर की असली कर्णधार Women हैं, महिलाएं हैं।
इतना ही नहीं, भारत के डेयरी कॉपरेटिव्स में भी एक तिहाई से ज्यादा सदस्य महिलाएं ही हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
2014 के बाद से हमारी सरकार ने भारत के डेयरी सेक्टर के सामर्थ्य को बढ़ाने के लिए निरंतर काम किया है।
आज इसका परिणाम Milk Production से लेकर किसानों की बढ़ी आय में भी नजर आ रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
2014 में भारत में 146 मिलियन टन दूध का उत्पादन होता था।
अब ये बढ़कर 210 मिलियन टन तक पहुंच गया है। यानि करीब-करीब 44 प्रतिशत की वृद्धि: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
भारत, डेयरी पशुओं का सबसे बड़ा डेटाबेस तैयार कर रहा है। डेयरी सेक्टर से जुड़े हर पशु की टैगिंग हो रही है।
आधुनिक टेक्नोल़ॉजी की मदद से हम पशुओं की बायोमीट्रिक पहचान कर रहे हैं। हमने इसे नाम दिया है- पशु आधार: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
खेती में मोनोकल्चर ही समाधान नहीं है, बल्कि विविधता बहुत आवश्यकता है।
ये पशुपालन पर भी लागू होता है।
इसलिए आज भारत में देसी नस्लों और हाइब्रिड नस्लों, दोनों पर ध्यान दिया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
भारत में हम पशुओं के यूनिवर्सल वैक्सीनेशन पर भी बल दे रहे हैं।
हमने संकल्प लिया है कि 2025 तक हम शत प्रतिशत पशुओं को फुट एंड माउथ डिजीज़ और ब्रुसलॉसिस की वैक्सीन लगाएंगे।
हम इस दशक के अंत तक इन बीमारियों से पूरी तरह से मुक्ति का लक्ष्य लेकर चल रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
पिछले कुछ समय में भारत के अनेक राज्यों में Lumpy नाम की बीमारी से पशुधन की क्षति हुई है।
विभिन्न राज्य सरकारों के साथ मिलकर केंद्र सरकार इसे कंट्रोल करने की कोशिश कर रही है।
हमारे वैज्ञानिकों ने Lumpy Skin Disease की स्वदेशी vaccine भी तैयार कर ली है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
*****
DS/TS

The strength of India’s dairy sector are the small farmers. pic.twitter.com/1yD04xoNKA
— Narendra Modi (@narendramodi) September 12, 2022
A vibrant cooperatives sector has contributed to India’s strides in the dairy sector. pic.twitter.com/qlqKznOjqo
— Narendra Modi (@narendramodi) September 12, 2022
When the dairy sector flourishes, women empowerment is furthered. pic.twitter.com/RveQA19kny
— Narendra Modi (@narendramodi) September 12, 2022
भारत के पास गाय और भैंस की जो स्थानीय नस्लें हैं, वो कठिन से कठिन मौसम में भी Survive करने के लिए जानी जाती हैं। गुजरात की बन्नी भैंस इसका एक बेहतरीन उदाहरण है। pic.twitter.com/Rhi12A0cCW
— Narendra Modi (@narendramodi) September 12, 2022
हमारी सरकार ने देश के डेयरी सेक्टर के सामर्थ्य को बढ़ाने के लिए निरंतर काम किया है। सिंगल यूज प्लास्टिक बंद करने का जो अभियान चलाया गया है, उसमें पशुधन का कल्याण भी निहित है। pic.twitter.com/SnmJrjhoPr
— Narendra Modi (@narendramodi) September 12, 2022
विभिन्न राज्य सरकारों के साथ मिलकर केंद्र सरकार पशुधन को नुकसान पहुंचाने वाली लंपी बीमारी को कंट्रोल करने की कोशिश कर रही है। pic.twitter.com/4y5dw6i4i7
— Narendra Modi (@narendramodi) September 12, 2022
The Government of India is working with the states to control Lumpy Skin Disease among cattle. Our efforts also include developing a vaccine for it. pic.twitter.com/Vr309mARwy
— Narendra Modi (@narendramodi) September 12, 2022