Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) లలో 3 శాతం అదనపు వాయిదా (ఇన్ స్టాల్ మెంట్) చెల్లింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) ల అదనపు వాయిదా (ఇన్ స్టాల్ మెంట్) ను జులై 1 నుంచి చెల్లించడానికి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఇది మూల వేతనం లేదా పింఛన్ లో ఇప్పుడు వర్తిస్తున్న 50 శాతం రేటు కన్నా మూడు శాతం అధికం. ధరలలో పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని, ఆ భారాన్ని తొలగించడానికి ఈ చర్యను తీసుకొన్నారు.

ఈ పెంపు ఏడో కేంద్ర వేతన సంఘం సిఫారసుల ఆధారంగా ఆమోదించిన  ఫార్ములా కు అనుగుణంగా ఉంది. తాజా నిర్ణయం ఫలితంగా డీఏ, డీఆర్ లలో పెరుగుదల మూలంగా ఖజానాపై సంవత్సరానికి పడే భారం రూ. 9,448.35 కోట్లు.

ఈ నిర్ణయంతో దాదాపుగా 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 64.89  లక్షల మంది పెన్షనర్ లకు ప్రయోజనం కలుగుతుంది.

 

 

***