Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘కృషి ఉన్నతి మేళా’లో ప్రధాన మంత్రి – 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సంకల్పించుకొందాం

‘కృషి ఉన్నతి మేళా’లో ప్రధాన మంత్రి – 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సంకల్పించుకొందాం

‘కృషి ఉన్నతి మేళా’లో ప్రధాన మంత్రి – 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సంకల్పించుకొందాం


భారతీయ వ్యవసాయ రంగానికి పునరుత్తేజం సంతరించేందుకు తన ఆలోచనలను రైతులతో పంచుకున్న ప్రధాన మంత్రి

2022 సంవత్సరంకల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కంకణం కట్టుకొందామంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం సహా రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకా సంబంధిత ఇతర వర్గాలన్నింటికి ఈ రోజు పిలుపునిచ్చారు.

భారతీయ వ్యవసాయ రంగంపై తనకు ఉన్న ఆలోచనలను ఆయన ఈ రోజు ఇక్కడ జరిగిన ‘కృషి ఉన్నతి మేళా’ లో రైతులతో పంచుకున్నారు. ఈ కార్యసాధన సవాళ్లతో కూడుకొన్నదే కావచ్చు కానీ, ఈ లక్ష్యాన్నిచేరుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదన్నారు.

భారతదేశ భవిష్యత్తును తిరగరాయగల శక్తి కలిగిన ఒక వేదికగా ‘కృషి ఉన్నతి మేళా’ కార్యక్రమం నిలువగలదని ప్రధాన మంత్రి అభివర్ణించారు. వ్యవసాయ రంగ పురోగతిలోనే, భారతీయ వ్యవసాయదారుల, గ్రామాల సంపద స‌మృద్ధం కావ‌డంలోనే భారతదేశ భవిష్యత్తు ఇమిడి ఉన్నదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర సాధారణ బడ్జెటును గురించి ప్రస్తవిస్తూ, ఈ రంగాలపై బడ్జెటు గణనీయ ప్రభావాన్ని ప్రసరించగలదని తెలిపారు.

భారత వ్యవసాయ రంగంలో తదుపరి విప్లవాన్ని సాంకేతిక విజ్ఞానం, ఆధునికీకరణలపైనే నిర్మించవలసి ఉందంటూ, దీనిని సాధించే సత్తా భారతదేశ తూర్పు ప్రాంతానికి ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకొనే దిశగా భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

రైతుల రాబడిని పెంచడంలో ఇన్ పుట్ వ్యయాలను తగ్గించుకోవడం అనేది మొట్టమొదటి అంశం ఎలా అయిందీ ప్రధాన మంత్రి వివరించారు. ‘సాయిల్ హెల్త్ కార్డు’ పథకం, ”ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన”లు ఇన్ పుట్ వ్యయాలను తగ్గించడంలో ముఖ్యమైన మెట్లు అని ఆయన తెలిపారు.

వివిధ పద్ధతుల్లో వ్యవసాయ కార్యకలాపాలను వివిధీకరించుకోవడం ద్వారా వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రధాన మంత్రి కోరారు. పంటల పెంపకంతో పాటే పొలాల గట్ల వెంబడి కలప మొక్కలను వేసే ప్రత్యామ్నాయాన్ని రైతులు ఎంచుకోవాలని సూచించారు. పశు పాలన పనులపైన కూడా దృష్టి సారించ‌వ‌చ్చ‌ని అభిప్రాయపడ్డారు. సాగుబడిలో వివిధీకరణ అనేది వ్యవసాయంతో ముడిపడిన నష్టభయాలను తగ్గిస్తుందని ఆయన చెప్పారు.

‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ తాలూకు ప్రయోజనాలను గురించి వివరించిన శ్రీ నరేంద్ర మోదీ, విస్తృత‌ స్థాయి సంప్రదింపుల అనంతరం ఈ పథకం రూపుదిద్దుకొందన్నారు. కనీస ప్రీమియం- గరిష్ఠ భద్రత ఈ పథకం విశిష్టతలు అని ఆయన వెల్లడించారు.

అంత క్రితం, ప్రదర్శన స్థలంలో ఏర్పాటు చేసిన మంటపాలను ప్రధాన మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా వివిధ సంస్థలు, వ్యవసాయ పారిశ్రామికులు అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను, సాంకేతిక మెలకువలను గురించి, ఇంకా ఆధునిక వ్యవసాయ పనిముట్లను, పాలను అధికంగా ఇచ్చే పశువులను గురించి అక్కడి వారు ప్రధాన మంత్రికి అవగాహన కలిగించారు.

ప్రధాన మంత్రి 2014-15 సంవత్సర ‘కృషి కర్మణ్’ అవార్డులను రాష్ట్రాలకు, వ్యవసాయదారులకు ప్రదానం చేశారు. రైతుల కోసం ‘కిసాన్ సువిధ’ పేరుతో తీసుకువచ్చిన ఒక మొబైల్ అప్లికేషన్ ను ఆయన విడుదల చేశారు. ఈ యాప్‌ వ్యవసాయదారులకు వాతావరణ స్థితిగతులు, బజారు ధరలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాల వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.

***