Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇథియోపియా గణతంత్రం యొక్క ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

ఇథియోపియా గణతంత్రం యొక్క ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి


ఇథియోపియా గణతంత్రం యొక్క ప్రధాని డాక్టర్ శ్రీ అబీయ్ అహమద్ అలీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. బ్రిక్స్ పదిహోనో శిఖర సమ్మేళనం సందర్భం లో ఈ భేటీ జరిగింది.

 

ఉభయ నేతలు కీలక రంగాల ను గురించి నిర్మాణాత్మకమైనటువంటి చర్చల ను జరిపారు. ఆ రంగాల లో భాగస్వామ్యం & అభివృద్ధి సామర్థ్యాల పెంపుదల, వ్యాపారం మరియు పెట్టుబడి, రక్షణ రంగ సహకారం, ఐసిటి, వ్యవసాయం, యువతీ యువకుల కు నైపుణ్యాల ను అందించడం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటివి భాగం గా ఉన్నాయి. వారు ముఖ్యమైన ప్రాంతీయ అంశాల ను మరియు ప్రపంచ అంశాల ను కూడా చర్చించుకున్నారు.

 

బ్రిక్స్ లో ఇథియోపియా సభ్యత్వం పట్ల ప్రధాని అబీయ్ అహమద్ కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌథ్ సమిట్’ లో ప్రధాన మంత్రి శ్రీ అబీయ్ అహమద్ పాలుపంచుకోవడాన్ని ఆయన ప్రశంసించారు.

 

బ్రిక్స్ పరివారం లో ఇథియోపియా చేరేటట్లుగా భారతదేశం సమర్థన ను ఇచ్చినందుకు గాను ప్రధాన మంత్రి కి ప్రధాని శ్రీ అబీయ్ అహమద్ ధన్యవాదాలను తెలియ జేశారు. చంద్రయాన్ మిశన్ విజయవంతం అయినందుకు ప్రధాన మంత్రి కి ఆయన తన అభినందనల ను వ్యక్తం చేశారు. చంద్రయాన్ మిశన్ సాఫల్యం ఇథియోపియా కు మరియు గ్లోబల్ సౌథ్ సభ్యత్వ దేశాల కు ఒక గర్వకారణమైనటువంటి ఘట్టం, అంతేకాకుండా, ప్రేరణాత్మకమైనటువంటి ఘట్టం అని శ్రీ అబీయ్ అహమద్ అభివర్ణించారు.

 

***