Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా మృతిపై ప్రధాని సంతాపం


   రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్నాథ్ పహాడియా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా తుదిశ్వాస విడిచారన్న వార్త నన్ను తీవ్ర విచారానికి గురిచేసింది. సామాజిక సాధికారతను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం సుదీర్ఘ రాజకీయ, పరిపాలన జీవితంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి, అనుయాయులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను… ఓం శాంతి’’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

***