Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పన్నుల కు సంబంధించి ‘‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ద ఆనెస్ట్’’ పేరిట ఏర్పాటు చేసిన ఒక నూతన వ్యవస్థ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


 

పన్నుల కు సంబంధించి ‘‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ద ఆనెస్ట్’’ పేరిట ఏర్పాటు చేసిన ఒక నూతన వ్యవస్థ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ప్రారంభించారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేశం లో వ్యవస్థాగత సంస్కరణ ల ప్రక్రియ ప్రస్తుతం క్రొత్త శిఖరాల కు చేరుకొందన్నారు.  21 వ శతాబ్దం లో పన్నుల వ్యవస్థ యొక్క అవసరాల ను నెరవేర్చడం కోసమని పన్నుల కు సంబంధించినటువంటి ఒక క్రొత్త ప్లాట్ ఫార్మ్ ను ‘‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ద ఆనెస్ట్’’ పేరిట ప్రవేశపెట్టడం జరిగింది అని ఆయన అన్నారు.  ఫేస్ లెస్ అసెస్ మెంట్, ఫేస్ లెస్ అపీల్, ఇంకా ట్యాక్స్ చార్టర్ వంటి ప్రధాన సంస్కరణ లు దీనిలో భాగం గా ఉన్నాయి అని ఆయన వివరించారు. 

పన్ను చెల్లింపుదారుల నియమావళి మరియు ఫేస్ లెస్ అసెస్ మెంట్ లు ఈ రోజు నుండి అమలు లోకి వచ్చాయని, ఫేస్ లెస్ అపీల్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ యొక్క జయంతి సెప్టెంబర్ 25 వ తేదీ నాటి నుండి దేశం అంతటా అందుబాటు లోకి రానుందని ప్రధాన మంత్రి  ప్రకటించారు.  నూతన ప్లాట్ ఫార్మ్ ఫేస్ లెస్ గా ఉంటుందని, అంతేకాకుండా పన్ను చెల్లింపుదారుల యొక్క విశ్వాసాన్ని ఇనుమడింపచేయడం మరియు వారిని భయం లేని వారు గా తీర్చిదిద్దడం కూడా ఈ ప్లాట్ ఫార్మ్ యొక్క లక్ష్యం అని ఆయన చెప్పారు.

‘‘బ్యాంకింగ్ సేవల కు దూరం గా ఉండిపోయిన వారికి బ్యాంకింగ్ సేవ లు, పదిలం గా ఉండనటువంటి వారికి ఇక మీదట భద్రత మరియు నిధులు అందని వర్గాల కు నిధుల ను అందించడం’’, ఇంకా ‘‘నిజాయతీపరుల ను గౌరవించడం’’ పై గడచిన ఆరు సంవత్సరాలు గా ప్రభుత్వం శ్రద్ధ వహించిందని ప్రధాన మంత్రి అన్నారు.

జాతి నిర్మాణం లో నిజాయతీ గా పన్నుల ను చెల్లిస్తున్న వారు పోషిస్తున్నటువంటి పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.  అటువంటి వారి యొక్క జీవితాల ను సరళతరం గా మార్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా అని ఆయన అన్నారు.  ‘‘ఎప్పుడయితే నిజాయతీపరుడైన పన్ను చెల్లింపుదారు జీవనం సరళతరం అవుతుందో అతడు ముందంజ వేసి, అభివృద్ధి చెందుతాడు; అదే జరిగిననాడు దేశం సైతం అభివృద్ధి చెందుతుంది, ఇంకా దేశం ముందు కు దూకుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 

కనీస స్థాయి ప్రభుత్వం తో గరిష్ఠ స్థాయి పాలన ను అందించాలన్న ప్రభుత్వ సంకల్పం లో ఈ రోజు న ప్రారంభించిన నూతన సదుపాయాలు ఒక భాగం అని ప్రధాన మంత్రి అన్నారు. 
ప్రతి ఒక్క నియమాన్ని, ప్రతి ఒక్క చట్టాన్ని, ఇంకా ప్రతి ఒక్క విధానాన్ని అధికార ప్రధానమైంది గా ఉండే కంటే ప్రజల ప్రయోజనాలు కేంద్రితం గా, ప్రజల పట్ల స్నేహశీలమైనవి గా ఉండేందుకే పెద్ద పీట ను వేస్తూ రూపొందించడం జరుగుతోంది అని ఆయన అన్నారు.   నూతనమైన పరిపాలన నమూనా ను ఉపయోగించడం సత్ఫలితాల ను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

అన్ని పనుల ను అమలుపరచాలనే కర్తవ్య నిర్వహణ కు అగ్రతాంబూలం ఇచ్చేటటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పరచడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఇది బలప్రయోగం వల్లనో లేక శిక్ష తాలూకు భయం నుండో వచ్చిన ఫలితం కాదని, అనుసరిస్తున్నటువంటి ఒక సమగ్రమైన దృష్టికోణాన్ని అర్ధం చేసుకోవడం వల్ల సిద్ధించిన ఫలితం అని ఆయన అన్నారు.  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణ లు అరకొర గా కాక సంపూర్ణ దర్శనం తో కూడుకొన్న ఫలితాల ను అందించాలి అనే పరమార్ధం కలిగినవి అని ఆయన చెప్పారు. 

ఇదివరకటి పన్నుల స్వరూపాన్ని స్వాతంత్య్రాని కి పూర్వపు కాలాల్లో ఆవిష్కరించిన దాని నుండి రూపొందించిన కారణం గా దేశం యొక్క పన్నుల స్వరూపం లో మౌలికమైనటువంటి సంస్కరణ లు అవసరం అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు.  స్వాతంత్య్రం అనంతర కాలాల్లో సైతం చేసినటువంటి పలు మార్పు లు పన్నుల స్వరూపం యొక్క ప్రాథమిక స్వభావాన్ని మార్చలేదని ఆయన అన్నారు. 

మునుపటి వ్యవస్థ యొక్క సంక్లిష్టత దానిని అనువర్తనాన్ని కష్టతరం గా మార్చివేసిందని ప్రధాన మంత్రి చెప్పారు.

సరళమైనటువంటి చట్టాలు మరియు నిర్వహణ క్రమాలు ఏర్పడితే వాటి ని అనుసరించడం సులువు అవుతుందని ఆయన అన్నారు.  అటువంటి ఒక ఉదాహరణే జిఎస్ టి అని, అది డజన్ ల కొద్దీ పన్నుల స్థానాన్ని తీసుకొందని ఆయన పేర్కొన్నారు. 

తాజా చట్టాలు పన్ను వ్యవస్థ లో చట్టాని కి సంబంధించిన భారాన్ని తగ్గించాయని, ప్రస్తుతం ఉన్నత న్యాయ స్థానం లో దాఖలు చేసే వ్యాజ్యాల పరిమితి ని ఒక కోటి రూపాయల వరకు మరియు సర్వోన్నత న్యాయ స్థానం లో దాఖలు చేసే వ్యాజ్యాల పరిమితి ని 2 కోట్ల రూపాయల వరకు గా నిర్ధారించడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.  ‘వివాద్ సే విశ్వాస్’ పథకం వంటి కార్యక్రమాలు చాలా వరకు వ్యాజ్యాలు న్యాయస్థానం వెలుపలే పరిష్కారం కావడానికి బాట ను వేస్తాయి అని ఆయన వివరించారు. 

ప్రస్తుతం అమలుపరుస్తున్న సంస్కరణల లో ఒక భాగం గా పన్ను శ్లాబుల ను కూడా సువ్యవస్థీకరించడం జరిగిందని, 5 లక్షల రూపాయల వరకు గల ఆదాయం పైన సున్నా పన్ను ఉందని, మిగిలిన శ్లాబుల లోనూ పన్ను రేటు ను తగ్గించడమైందని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రపంచం లో అతి తక్కువ కార్పొరేట్ పన్ను గల దేశాల లో భారతదేశం ఒకటి గా ఉందని ఆయన చెప్పారు.

ప్రస్తుత సంస్కరణ ల ధ్యేయమల్లా పన్నుల వ్యవస్థ ను సీమ్ లెస్, పెయిన్ లెస్, ఇంకా ఫేస్ లెస్ గా తీర్చిదిద్దడమే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  సీమ్ లెస్ సిస్టమ్ పన్ను చెల్లింపుదారు ను (అతడి ని గాని లేదా ఆమె ను గాని) మరిన్ని చిక్కుముడుల లో ఇరికించేందుకు బదులు  అతడి యొక్క /ఆమె యొక్క సమస్యల ను పరిష్కరించేందుకు ప్రాముఖ్యాన్ని ఇస్తుంది; పెయిన్ లెస్ అంటే సాంకేతిక విజ్ఞ‌ానం మొదలుకొని నియమాల వరకు ప్రతిదీ సీదాసాదా గా ఉండడమే; ఇక, ఫేస్ లెస్ వ్యవస్థ అనేది పరిశీలన కు, నోటీసు కు, సర్వేక్షణ కు, పన్ను లెక్కించడానికి సంబంధించిన అన్ని అంశాల లో పన్ను చెల్లింపుదారు కు మరియు ఆదాయపు పన్ను అధికారి కి మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధం ఉండకపోవడం అని ఆయన విపులీకరించారు.

పన్ను చెల్లింపుదారు ల నియమావళి ని ప్రవేశపెట్టడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇది ఒక ప్రధానమైన చర్య అని, దీనిలో  నిష్పక్షపాతమైనటువంటి, మర్యాదపూర్వకమైనటువంటి మరియు హేతుబద్ధమైనటువంటి నడవడిక తాలూకు హామీ ఇకమీదట పన్ను చెల్లింపుదారు కు లభిస్తుందన్నారు.  పన్ను చెల్లింపుదారు యొక్క గౌరవాన్ని,  సచేతనత్వాన్ని నిలబెట్టడం పట్ల ఈ చార్టర్ శ్రద్ధ వహిస్తుందని, అంతేకాకుండా అది ఒక నమ్మకం అనే అంశం పై ఆధారపడిందని, అలాగే పన్ను చెల్లించే వ్యక్తి ని ఒక ప్రాతిపదిక లేకుండా కేవలం సందేహించడం చేయకూడదని చెప్తుందని ప్రధాన మంత్రి అన్నారు.  

గడచిన ఆరు సంవత్సరాల లో కేసు ల పరిశీలన కనీసం నాలుగింతలు తగ్గిపోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  2012-13 లో ఇది 0.94 శాతం గా ఉండగా 2018-19 కల్లా 0.26 శాతాని కి చేరుకొందని, రిటర్నీల పట్ల ప్రభుత్వం ఉంచుతున్న ఆశాభావాని కి ఇదే ఒక నిదర్శనమని ఆయన అన్నారు.  గత 6 సంవత్సరాల లో పన్ను పరిపాలన లో రూపుదిద్దుకొంటున్న ఒక పాలన పరమైనటువంటి నూతన నమూనా ను భారతదేశం గమనించిందని ఆయన చెప్పారు.   ఈ ప్రయాసలన్నిటి నడుమ న, గడచిన 6-7 సంవత్సరాల లో ఆదాయపు పన్ను రిటర్న్ ల ను దాఖలు చేసే వారి సంఖ్య దాదాపు గా 2.5 కోట్ల మేర అధికం అయిందని ఆయన తెలిపారు.

అయినప్పటికీ కూడా ను 130 కోట్ల మంది నివసిస్తున్న దేశం లో 1.5 కోట్ల మంది మాత్రమే పన్నుల ను చెల్లిస్తున్నారన్న సంగతి ని  తిరస్కరించ లేము అని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రజలు వారంతట వారు గా అంతర్దర్శనం చేసుకోవాలని మరియు బకాయి పడ్డ పన్నుల ను చెల్లించడం కోసం వారు ముందుకు రావాలంటూ శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు.

ఇలా చేయడం ఒక స్వయంసమృద్ధియుత భారతదేశాన్ని ఆవిష్కరించడం లో సహాయకారి అవుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. 

**