ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) పథకం లో భాగం గా అసమ్, మేఘాలయ రాష్ట్రాలు మరియు జె&కె, ఇంకా లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల లబ్ధిదారుల కు ప్రయోజనాల ను విడుదల చేయడం కోసం లబ్ధిదారులు వారి యొక్క డేటా ను విధి గా ఆధార్ తో జోడింపచేసుకోవలసిన అవసరం విషయం లో 2021 మార్చి నెల 31వ తేదీ వరకు సడలింపు ను ఇచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన ఆమోదాన్ని తెలిపింది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) స్కీము ను గౌరవనీయులైన ప్రధాన మంత్రి 2019వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ న ప్రారంభించారు. దేశం అంతటా సాగు చేసుకొనేందుకు యోగ్యమైన భూమి ని కలిగివున్నటువంటి రైతు కుటుంబాలన్నిటికి ఆదాయం పరం గా తోడ్పాటు ను సమకూర్చడం అనేది ఈ యొక్క పథకం తాలూకు లక్ష్యం గా ఉన్నది; అయితే ఇందులో కొన్ని రకాలైన మినహాయింపులు ఉన్నాయి. ఈ పథకం లో భాగం గా, ప్రతి సంవత్సరం కాలం లోనూ 6,000 రూపాయల మొత్తాన్ని- ఒక్కొక్క సారీ 2,000 రూపాయల కిస్తీ చొప్పున నాలుగేసి నెలల కాలాని కి ఒక కిస్తీ రూపం లో- 3 పర్యాయాలు గా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల లోకి నేరు గా విడుదల చేయడమైంది. ఈ స్కీము 2018వ సంవత్సరం డిసెంబరు 1వ తేదీ నుండి అమలవుతున్నది. 2019వ సంవత్సరం డిసెంబరు 1వ తేదీ నుండి అసమ్, మేఘాలయ రాష్ట్రాలు మరియు జె&కె, ఇంకా లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల విషయం లో తప్ప, రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంత పాలన యంత్రాంగాలు పిఎమ్-కిసాన్ పోర్టల్ లో అప్ లోడ్ చేసిన లబ్ధిదారుల యొక్క ఆధార్ తో జోడించినటువంటి డేటా ద్వారా మాత్రమే, ప్రయోజనాల ను విడుదల చేయడం జరుగుతున్నది; అసమ్, మేఘాలయ రాష్ట్రాలు మరియు జె&కె, ఇంకా లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల లో ఆధార్ ప్రక్రియ స్వల్ప స్థాయి లో మాత్రమే ఆచరణాత్మకం అయినటువంటి కారణం గా ఆ ప్రాంతాల కు ఈ యొక్క డేటా – ఆధార్ సీడింగ్ అనే అవసరం నుండి మాత్రం 2020వ సంవత్సరం మార్చి 31 వ తేదీ వరకు మినహాయింపు ను ఇవ్వడమైంది.
అసమ్, మేఘాలయ రాష్ట్రాలు మరియు జె&కె, ఇంకా లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల లబ్ధిదారుల కు సంబంధించినంతవరకు వారి డేటా ను విధి గా ఆధార్ తో జతపరచుకోవాలన్న ఆవశ్యకత తాలూకు పనులు పూర్తి కావడానికి మరింత అధిక కాలం పట్టవచ్చునని అంచనా వేయడమైంది. మరి ఈ రాష్ట్రాల / కేంద్ర పాలిత ప్రాంతాల లబ్ధిదారులు తప్పనిసరి గా వారి డేటా యొక్క ఆధార్ సీడింగ్ అవసరం నుండి మినహాయింపు అనే దాని ని పొడిగించనట్లయితే గనక, సదరు స్కీము తాలూకు ప్రయోజనాల ను 2020 ఏప్రిల్ 1వ తేదీ తరువాతి నుండి అందుకొనే స్థితి లో ఉండలేకపోవచ్చు.
ఈ రాష్ట్రాల లో / కేంద్ర పాలిత ప్రాంతాల లో కనీసం ఒక్క కిస్తీ అయినా చెల్లింపు జరిగినటువంటి లబ్ధిదారు రైతు ల మొత్తం సంఖ్య 2020వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ నాటి కి అసమ్ లో 27,09,586 మంది లబ్ధిదారులు గాను, మేఘాలయ లో 98,915 మంది లబ్ధిదారులు గాను, ఇక జె&కె, ఇంకా లద్దాఖ్ లు రెంటి ని కలుపుకొని 10,01,668 లబ్ధిదారులు గాను నమోదైంది.
**