భారతదేశంలో స్థిరమైన, తక్కువ కర్బనంతో ఉష్ణ ఆధారిత విద్యుత్తును అభివృద్ధి చేయడం కోసం భారతదేశం, జపాన్ ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు) కు కేంద్ర మంత్రిమండలి ఈ రోజు ex-post-facto ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
స్థిరమైన, తక్కువ కార్బన్ తో థర్మల్ విద్యుత్తు అభివృద్ధి ప్రక్రియకు అవరోధంగా నిలుస్తున్న పలు సమస్యలకు భారతదేశం ఒక పరిష్కారం కనుగొనడంలో ఈ ఎమ్ ఒ యు సహాయకారి కానున్నది. ముందస్తు ప్రాథమిక అధ్యయనం ద్వారానూ, శక్తిని సమర్ధంగా పునర్ నవీకరించడం, ఆధునికీకరించడం అలాగే కొత్తగా విద్యుత్తును అభివృద్ధి చేయడం మొదలైన ప్రక్రియలలో కొనసాగుతున్న సహకారం ద్వారానూ – ఈ సమస్యలను గుర్తించడం జరిగింది. అంతే కాక పునర్ నవీకరణ, ఆధునికీకరణ (R&M) కార్యరూపం దాల్చడానికి, అమలు లోకి రావడానికి మద్దతు నిచ్చే కార్యకలాపాల ద్వారానూ – థర్మల్ విద్యుత్తు ప్లాంట్లకు అల్ట్రా సూపర్ క్రిటికల్ (USC) మరియు ఇతర పర్యావరణ సంబంధ సాంకేతిక పరిజ్ఞానాల లాంటి క్లీన్ కోల్ టెక్నాలజీ (CCT) అండదండలను అందించడానికి కూడా ఈ సమస్యలను గుర్తించడం జరిగింది. ఇవన్నీ మొత్తంమీద భారతదేశంలో విద్యుత్తు రంగ సర్వతోముఖాభివృద్ధితో పాటు సంబంధిత విధానాల అమలుకూ సహకరించగలవు.
దిగువన పేర్కొన్న కార్యకలాపాలు ఈ ప్రతిపాదన పరిధిలోకి వస్తాయి.. :
అ) భారతీయ విద్యుత్తు రంగంలోని వర్తమాన, భవిష్యత్తు విధాన సరళి తాలూకు అప్ డేట్. ఇందులో భారతదేశంలో నూతన విద్యుత్తు అభివృద్ధి కోసం పునర్ నవీకరణ ( R&M) నుండి లైఫ్ ఎక్స్ టెన్షన్ (LE) వరకు అంశాలు కలసి ఉంటాయి. ఇంకా.. ఇప్పటికే గుర్తించిన అవరోధాలను పరిశీలించి, వాటిలో కేంద్రీయ విద్యుత్తు ప్రాధికార సంస్థ (CEA), జపాన్ కోల్ ఎనర్జీ సెంటర్ (JCOAL)ల పరస్పర సమన్వయం ద్వారా పరిష్కరించగలిగిన సమస్యలు ఏమేమిటన్నవి కనుగొనడం.
ఆ) ప్రస్తుతం నడుస్తున్న, త్వరలో రానున్న ఫెసిలిటీలకు సంబంధించిన పరిష్కరించవలసి ఉన్న సమస్యలను గుర్తించడం, ఇంకా.. ఈ రెండు విధాలైన ఫెసిలిటీలలోను ఏదైనా ఒక దానిని పనిచేయించడం మరియు నిర్వహించడం.
ఇ) మిగిలిన జీవన కాల అంచనా (Residual Life Assessment -RLA), ఇంకా షరతులతో కూడిన అంచనా (Conditional Assessment-CA) ల అధ్యయనంతో సహా పూర్తి స్థాయి నిర్ధారణను అమలుచేయడం మరియు అందుబాటులో ఉన్న ఇతర సమర్ధవంతమైన చర్యలను అమలు చేయడం. ఇది ముందస్తు ప్రాథమిక అధ్యయనం, సహకారం కింద ఉన్న నిర్ణయించుకున్న విద్యుత్తు కేంద్రాలకే పరిమితం కాకూడదు. ఈ నిర్ణయించుకున్న విద్యుత్తు కేంద్రాలూ, యూనిట్ల సంఖ్య మొదలైన విషయాలను – CEA, JCOAL సంస్థలు – పరస్పర సంప్రదించుకోవడం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.
ఈ) ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పత్రాలు లేదా/మరియు అందుబాటులో ఉన్న ఇతర ద్వైపాక్షిక ఆర్ధిక పథకాల ద్వారా నిధులను సమకూర్చుకోడానికి – థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సాంకేతికతల ఆధారంగా విద్యుత్తు అభివృద్ధి విషయంలో ఔచిత్యం మరియు అవకాశాలపై పరిశీలన. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విత్త సంబంధ సాధనాల ద్వారా నిధులను అందించడం, లేదా ఇతర ద్వైపాక్షిక విత్తీయ పథకాల గురించి పరిశీలించడం.
ఉ) థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సాంకేతికత ఆధారంగా విద్యుత్తు అభివృద్దికి వ్యక్తిగత కేసుల ఆర్ధిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని – భవిష్యత్తులో ఎంతమేరకు ద్వైపాక్షికంగా/బహుముఖంగా బొగ్గు నిక్షేపాలను సేకరించడానికి గల అవకాశాలను పరిశీలించడం.
f) ద్వైపాక్షిక జ్ఞానం, సాంకేతిక విజ్ఞానం బదిలీ కోసం భారతదేశంలో నిర్వహించే వార్షిక వర్క్ షాపులను – జపాన్ లో నిర్వహించే CCT బదిలీ కార్యక్రమాలను అమలుచేయడం.
g) ప్రాజెక్టును మెరుగుపరిచే లక్ష్యంతో ప్రాజెక్ట్ అమలుచేసే సమయంలో ఎదురైన, లేదా భవిష్యత్తులో ఎదురౌతాయని భావించిన సమస్యలపై చర్చించడం కోసం – ఇరుపక్షాల ప్రతినిధులతో ఒక వార్షిక సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం. ఇరు పక్షాలు అంగీకారం మేరకు సంబంధిత సంస్థలు లేదా భాగస్వాములు ఎవరైనా కూడా – ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకావచ్చు