Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చాన్స్ ల‌ర్ మ‌ర్కెల్ తో టెలిఫోన్ లో మాట్లాడి, ఆమెను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


శ్రేష్ఠురాలు డాక్ట‌ర్ ఎంజెలా మ‌ర్కెల్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో సంభాషించారు. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ చాన్స్ ల‌ర్ ప‌ద‌వి కి వ‌రుస‌గా నాలుగు సార్లు ఎన్నికై ఆ పదవీబాధ్యతలను స్వీక‌రించిన ఆమె కు శ్రీ నరేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

చాన్స్ ల‌ర్ డాక్ట‌ర్ మ‌ర్కెల్ జ‌ర్మ‌నీ కి అందిస్తున్న‌టువంటి దృఢ‌మైన నాయ‌క‌త్వాన్ని మ‌రియు ఆమె నేతృత్వ కాలంలో యూరోపియ‌న్ వ్య‌వ‌హారాల‌లో జ‌ర్మ‌నీ పోషించిన కేంద్ర‌క భూమిక‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు.

భార‌త‌దేశం- జ‌ర్మ‌నీ ద్వైపాక్షిక సంబంధాల‌ను గాఢ‌త‌రంగా మలచేందుకు మ‌రియు బలోపేతం చేసేందుకు చాన్స్ ల‌ర్ డాక్ట‌ర్ మ‌ర్కెల్ తో క‌ల‌సి ప‌ని చేయ‌డానికి తాను సిద్ధ‌ంగా ఉంటానంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త‌న వ‌చ‌నబ‌ద్ధ‌త‌ను ఈ సందర్భంగా పున‌రుద్ఘాటించారు.

2018 మార్చి నెల 22వ తేదీ నుండి 26వ తేదీ మ‌ధ్య కాలంలో భార‌త‌దేశంలో ఆధికారికంగా ప‌ర్య‌టించ‌నున్న అధ్య‌క్షులు శ్రీ ఫ్రాంక్-వాల్టర్ స్టాయిన్ మాయర్ తో స‌మావేశం కావ‌డం కోసం తాను వేచి ఉన్న‌ట్లు కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు.

***