ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈశాన్య ప్రాంత పారిశ్రామికాభివృద్ధి పథకం-2017 కి (నీడ్స్) ఆమోదముద్ర వేసింది. 2020 మార్చి నాటికి దీనిపై మూడు వేలకోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడతారు. గతంలో అమలు జరుగుతున్న రెండు స్కీమ్ ల కింద ఉన్న ప్రోత్సాహకాలను మరింత మెరుగైన పెట్టుబడితో అమలుపరిచే పథకం ఇది.
వివరాలు…
ఈశాన్య రాష్ర్టాల్లో ఉపాధికల్పనను ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ ద్వారా ఎంఎస్ఎంఇ రంగానికి ప్రభుత్వం ప్రధానంగా ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఉపాధికల్పన కింద ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది.
భారత ప్రభుత్వ నిర్వహణలోని ఇతర స్కీమ్ ల అనుబంధ విభాగాల ద్వారా అందుతున్ ఒకటి లేదా అంతకు ఎక్కువ ప్రయోజనాలన్నింటినీ అర్హత గల సంస్థలు ఈ స్కీమ్ లోని అనుబంధ విభాగాల ద్వారా పొందగలుగుతాయి.
సిక్కిం సహా ఈశాన్య రాష్ర్టాలన్నింటిలోని కొత్త పారిశ్రామిక యూనిట్లకు ఈ స్కీమ్ కింద ఈ దిగువ ప్రోత్సాహకాలు అందుతాయి.
కేంద్ర వడ్డీ ప్రోత్సాహం (సిఐఐ) |
యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన రోజు నుంచి ఐదు సంవత్సరాల పాటు అర్హత గత బ్యాంకులు లేదా ఆర్థిక సహాయ సంస్థలు అందించిన వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్‌పై 3 శాతం వడ్డీరాయితీ. |
కేంద్ర సమగ్ర బీమా ప్రోత్సాహకం (సిసిఐఐ) |
యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించిన రోజు నుంచి ఐదేళ్ల పాటు అమలులోఉండేలా భవనాలు, యంత్రపరికరాలు, ప్లాంట్ పై చెల్లించిన బీమా ప్రీమియం నూరు శాతం వాపసు |
వస్తుసేవల పన్ను (జిఎస్ టి) వాపసు |
యూనిట్ వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు కంపెనీ చెల్లించిన సిజిఎస్ టి, ఐజిఎస్ టిలో కేంద్ర ప్రభుత్వ వాటా వాపసు. |
ఆదాయపు పన్ను (ఐటి) వాపసు |
ప్లాంట్ వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించిన సంవత్సరం నుంచి అమలులోకి వచ్చేలా ఐదు సంవత్సరాల పాటు ఆదాయపు పన్నులో కేంద్ర ప్రభుత్వ వాటా వాపసు. |
రవాణా ప్రోత్సాహకం (టిఐ) |
– రైళ్ల ద్వారా వస్తు రవాణాపై రైల్వే/ రైల్వే పిఎస్‌యు అందించే సబ్సిడీ సహా 20 శాతం రవాణా వ్యయాల – ఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా రవాణా చేసే వస్తువులపై 20 శాతం రవాణా వ్యయం – చెడిపోయే స్వభావం గల వస్తువులను వాయుమార్గంలో రవాణా చేసేందుకు (ఐఏటిఏ నిర్వచించిన మేరకు) విమానాశ్రయం సమీపంలో ఉన్న ప్రదేశం నుంచి దేశంలోని ఏ గమ్యంలోని విమానాశ్రయానికైనా రవాణా వ్యయంలో 33 శాతం |
ఉపాధి ప్రోత్సాహకం (ఇఐ) |
ప్రధానమంత్రి రోజ్ గార్ ప్రోత్సాహయోజన (పిఎంఆర్ పివై) కింద ఉద్యోగుల పింఛను స్కీమ్ కి (ఇపిఎస్) ప్రభుత్వ వాటా 8.33 శాతానికి అదనంగా ఉద్యోగుల భవిష్య నిధికి (ఇపిఎఫ్) యజమాని చెల్లిస్తున్న వాటాలో కూడా 3.67 శాతం ప్రభుత్వమే భరిస్తుంది. |
రుణసదుపాయం అందుబాటులో ఉండడం కోసం కేంద్ర మూలధన పెట్టుబడి ప్రోత్సాహకం (సిసిఐఐఎసి) | ఐదు కోట్ల రూపాయల గరిష్ఠ పరిమితికి లోబడి ప్లాంట్, యంత్రపరికరాలపై పెట్టే పెట్టుబడిలో 30 శాతం రాయితీ |
---|
Boosting industrial growth in the Northeast. https://t.co/cMn85koLym
— Narendra Modi (@narendramodi) March 21, 2018
via NMApp