Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రామేశ్వ‌రంలో ప్ర‌ధాన మంత్రి

రామేశ్వ‌రంలో  ప్ర‌ధాన మంత్రి

రామేశ్వ‌రంలో  ప్ర‌ధాన మంత్రి

రామేశ్వ‌రంలో  ప్ర‌ధాన మంత్రి


· డాక్ట‌ర్ ఎ.పి.జె. అబ్దుల్ క‌లామ్ స్మార‌కం ప్రారంభోత్స‌వం

· జెండా ఊపి ‘‘క‌లామ్ సందేశ్ వాహిని’’ని ప్రారంభించారు

· రామేశ్వ‌రం నుండి అయోధ్య‌కు రైలును మ‌రియు ఇత‌ర అభివృద్ధి ప‌థ‌కాల‌ను కూడా ప్రారంభించారు

· బ‌హిరంగ స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు రామేశ్వ‌రంలో డాక్ట‌ర్ ఎ.పి.జె. అబ్దుల్ క‌లామ్ స్మార‌కాన్ని ప్రారంభించారు. అలాగే, డాక్ట‌ర్ క‌లామ్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి, ‘క‌లామ్ స్థ‌ల్’ లో పుష్పాంజ‌లిని ఘ‌టించారు. డాక్ట‌ర్ క‌లామ్ కుటుంబ స‌భ్యుల‌తో ప్ర‌ధాన మంత్రి కొద్ది సేపు ముచ్చ‌టించారు.

‘‘క‌లామ్ సందేశ్ వాహిని’’ అనే పేరుతో రూపొందించిన ఒక ఎగ్జిబిష‌న్ బ‌స్సు ను జెండా ఊపి, ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. ఈ బ‌స్సు దేశ‌ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల గుండా ప్ర‌యాణించి, పూర్వ రాష్ట్రప‌తి జ‌యంతి రోజైన అక్టోబ‌రు 15వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ కు చేరుకొంటుంది.

పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజ‌రైన ఒక బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి పాల్గొని, ‘‘నీలి విప్ల‌వ ప‌థకం’’లో భాగంగా ఎంపికయిన కొంత మంది లాంగ్ లైన్ ట్రాల‌ర్ల ల‌బ్దిదారులకు మంజూరు లేఖ‌ల‌ను పంపిణీ చేశారు.

‘శ్ర‌ద్ధ సేతు’ అని పేరు పెట్టిన ఒక కొత్త ఎక్స్ ప్రెస్ రైలుకు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రధాన మంత్రి జెండా ఊపి ఆ రైలును ప్రారంభించారు. ‘‘గ్రీన్ రామేశ్వ‌రం ప్రాజెక్టు’’ సారాంశంతో కూడిన ఒక పుస్త‌కాన్ని శ్రీ మోదీ విడుద‌ల చేశారు. ఎన్ హెచ్ 87లో భాగంగా ముకుందరాయర్ చత్తిరమ్ మరియు అరిచల్ మునయ్ ల మ‌ధ్య సాగే 9.5 కిలో మీట‌ర్ల లింక్ రోడ్డును దేశ ప్ర‌జ‌లకు అంకితమిచ్చేందుకుగాను అందుకు సంబంధించిన ఒక ఫ‌ల‌కాన్ని కూడా ఆయన ఆవిష్క‌రించారు.

స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, రామేశ్వ‌రం యావ‌త్ దేశానికి ఒక ఆధ్యాత్మిక పథ ప్రదర్శకంగా నిలిచింద‌ని, ఇప్పుడు ఇక డాక్ట‌ర్ క‌లామ్ తో స‌న్నిహిత అనుబంధం క‌లిగిన ప్ర‌దేశంగా కూడా ప్ర‌సిద్ధి చెందుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. రామేశ్వ‌రం యొక్క స‌ర‌ళ‌త్వం, గంభీరత, మ‌రియు ప్ర‌శాంత‌త‌ డాక్ట‌ర్ క‌లామ్ లో మూర్తీభ‌వించాయ‌ని ఆయ‌న అన్నారు.

డాక్ట‌ర్ క‌లామ్ స్మార‌క చిహ్నం ఆయ‌న యొక్క జీవితాన్ని, ఆయ‌న జీవించిన‌ప్ప‌టి కాలాన్ని విశేషమైనటువంటి రీతిలో ప్ర‌తిబింబిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

త‌మిళ నాడు పూర్వ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ జె. జ‌య‌ల‌లిత‌ కు ప్రధాన మంత్రి ఘ‌న నివాళులు అర్పిస్తూ, ఆమె మ‌న‌మంతా స్మ‌రించుకొనే నాయ‌కురాలు అన్నారు. ఇప్పుడు ఆమె ఉండి ఉంటే, ఎంతో సంతోషించేవార‌ు, త‌న త‌ర‌ఫు నుండి శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేసే వారు అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఓడ రేవులు మ‌రియు లాజిస్టిక్స్ రంగాలలో చోటు చేసుకొనే ప‌రివ‌ర్త‌న భార‌త‌దేశం వృద్ధికి ఎంత‌గానో తోడ్ప‌డ‌గ‌ల‌ద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ‘స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్’ కు సంబంధించినంత వ‌ర‌కు రాష్ట్రాల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ నెల‌కొంద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

భార‌త‌దేశ యువ‌తీయువ‌కుల‌కు డాక్ట‌ర్ క‌లామ్ ఒక ప్రేర‌ణ‌గా నిలిచార‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. నేటి యువ‌త పురోగ‌తి ప‌థంలో స‌రికొత్త మైలురాళ్ళ‌ను అందుకోవాల‌ని, ఉద్యోగాలు ఇచ్చే వారుగా త‌యార‌వ్వాల‌ని అభిల‌షిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.