ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలకు చెందిన 8 మంది సభ్యుల ప్రతినిధి వర్గం ఈ రోజు భేటీ అయింది. ఈ ప్రతినిధి వర్గానికి కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ పెలోసి నాయకత్వం వహించారు.
ప్రధాన మంత్రి ఈ ప్రతినిధి వర్గాన్ని భారతదేశానికి ఆహ్వానించారు. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ల మధ్య భాగస్వామ్యం మరింత బలపడడంలో అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలు గట్టి మద్దతును అందిస్తున్నందుకు ఆయన అభినందనలు తెలియజేశారు.
ద్వైపాక్షిక భాగస్వామ్యం గురించి, పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఇతర అంశాలను గురించి ప్రధాన మంత్రి తన అభిప్రాయాలను ప్రతినిధి వర్గ సభ్యులకు తెలియజేసి, వారి అభిప్రాయాలను తాను తెలుసుకున్నారు. అమెరికా కాంగ్రెస్ తో అనుబంధం మరింత విస్తరించాలని ఆయన కోరారు.