Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గీతా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు


ఈ రోజు గీతా జయంతి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పవిత్ర గ్రంథానికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నదీ ప్రధానంగా చాటిచెబుతున్న ఒక చిన్న వీడియోను కూడా శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పంచుకొన్నారు.

ప్రధాని ఒక సందేశాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘గీతా జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు.  భారతీయ సంస్కృతి, అధ్యాత్మ, పరంపరల విషయంలో మార్గదర్శకంగా నిలుస్తున్న దివ్య గ్రంథ ప్రబోధం మనకు అందింది ఈ రోజునే అని మనం భావిస్తూ జరుపుకొంటున్న ఈ పవిత్ర ఉత్సవం ప్రతిఒక్కరికీ కర్మయోగ మార్గాన్ని చూపించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.  జై శ్రీ కృష్ణ’’.