Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మరాఠీ, పాలీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం


మరాఠీపాలీప్రాకృతఅస్సామీబెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందిభారతదేశం లోతైనప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రాచీన భాషలు సంరక్షణగా ఉండడంతో పాటు వివిధ సామజిక చారిత్రకసాంస్కృతిక విజయాల సారాన్ని ప్రతిబింబిస్తాయి

అంశాల వారీగా వివరాలునేపథ్యం:

కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాష” అనే కొత్త క్యాటగిరీని 2004 అక్టోబర్ 12వ తేదీన ప్రవేశపెట్టితమిళాన్ని ప్రాచీన భాషగా ప్రకటించిందిఆ హోదా కోసం కొన్ని ప్రమాణాలను రూపొందించింది:

ఆ భాషకు ప్రారంభ గ్రంథాల అధిక ప్రాచీనతవెయ్యి సంవత్సరాలకుపైగా నమోదిత చరిత్ర ఉండాలి.

బితరతరాలుగా భాష మాట్లాడేవారు… విలువైన వారసత్వంగా పరిగణించే పురాతన సాహిత్యం/గ్రంథాలు.

సిసాహిత్య సంప్రదాయం దానంతట అది పుట్టినదై ఉండాలిమరొక మాట్లాడే సమాజం నుంచి తెచ్చుకున్నది కారాదు.

ప్రాచీన భాష హోదా కోసం ప్రతిపాదిత భాషలను పరిశీలించడానికి 2004 నవంబర్ లో సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక భాషా నిపుణుల కమిటీ (ఎల్ఈసి)ని ఏర్పాటు చేసింది.

2005 నవంబర్ లో ఈ ప్రమాణాలను సవరించారుసంస్కృతాన్ని ప్రాచీన భాషగా ప్రకటించారు.

I.   1500-2000 సంవత్సరాల కాలం నాటిదైప్రారంభ గ్రంథాలు/నమోదిత చరిత్ర అత్యంత ప్రాచీనమైనదిగా ఉండాలి.
II.  
తరతరాలుగా మాట్లాడే వారిచే విలువైన వారసత్వంగా పరిగణించే పురాతన సాహిత్యం/గ్రంథాలు.
IV.   
ప్రాచీన భాషసాహిత్యం ఆధునికానికి భిన్నంగా ఉండటం వలన,  ప్రాచీన భాషదాని తరువాతి రూపాలు లేదా దాని శాఖల మధ్య అంతరాయం ఉండవచ్చు

 

కేంద్ర ప్రభుత్వంఇప్పటివరకు ఈ కింది భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించింది:

తమిళం   

12/10/2004

సంస్కృతం 

25/11/2005

తెలుగు  

31/10/2008

కన్నడ 

31/10/2008

మలయాళం  

08/08/2013

ఒడియా 

01/03/2014

భాష  నోటిఫికేషన్ తేదీ 

 

 

2013లో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి మరాఠీకి ప్రాచీన భాష హోదా ఇవ్వాలంటూ మంత్రిత్వ శాఖకు ఒక ప్రతిపాదన అందగాదానిని ఎల్ఈసికి పంపారుఎల్ఈసి మరాఠీని ప్రాచీన భాషగా సిఫార్సు చేసింది. 2017లో మరాఠీకి ప్రాచీన భాష హోదా కల్పించిన సందర్బంలోఅంతర్మంత్రిత్వ శాఖల సంప్రదింపులప్పుడు క్యాబినెట్ కోసం ఒక ముసాయిదా పత్రాన్ని రూపొందిస్తూప్రమాణాలను సవరించి కఠినతరం చేయాలని హోంమంత్రిత్వ శాఖ సూచించిందిపీఎంఓ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఎన్ని ఇతర భాషలకు అర్హత సాధించే అవకాశం ఉందో తెలుసుకోవడానికి మంత్రిత్వ శాఖ కసరత్తు చేయవచ్చని పేర్కొంది.

ఈలోగాపాలీప్రాకృతంఅస్సామీబెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించాలంటూ బీహార్అస్సాంపశ్చిమ బెంగాల్ నుండి కూడా ప్రతిపాదనలు వచ్చాయి.

తదనుగుణంగాభాషాశాస్త్ర నిపుణుల కమిటీ (సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలోఈ ఏడాది జులై 25న జరిగిన సమావేశంలో ఈ క్రింది విధంగా ప్రమాణాలను ఏకగ్రీవంగా సవరించిందిఎల్ఈసి కోసం సాహిత్య అకాడమీని నోడల్ ఏజెన్సీగా నియమించారు.

i.   1500-2000 సంవత్సరాల కాలం నాటి ఆ భాష ప్రారంభ గ్రంథాలు/నమోదిత చరిత్ర అత్యంత                                    ప్రాచీనమైనదిగా ఉండాలి.

ii. తరతరాలుగా మాట్లాడే వారు వారసత్వంగా పరిగణించే ప్రాచీన సాహిత్యం/గ్రంథాలు ఉండాలి.

iii. జ్ఞాన గ్రంథాలుముఖ్యంగా కవిత్వంఎపిగ్రాఫికల్శాసనాల ఆధారాలతో పాటు గద్య గ్రంథాలు.

iv. ప్రాచీన భాషలుసాహిత్యం దాని ప్రస్తుత రూపానికి భిన్నంగా ఉండవచ్చు లేదా దాని శాఖల తరువాతి రూపాలతో అంతరాయం ఉండవచ్చు.

సవరించిన ప్రమాణాల ప్రకారం ప్రాచీన భాషగా పరిగణించడానికి ఈ కింది భాషలను కమిటీ సిఫార్సు చేసింది.

I.        మరాఠీ 

II.       పాలీ  

III.      ప్రాకృతం 

IV.      అస్సామీ 

V.       బెంగాలీ 

 అమలుకు వ్యూహంలక్ష్యాలు

ప్రాచీన భాషలను ప్రోత్సహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టిందిసంస్కృత భాష ప్రచారం కోసం 2020లో పార్లమెంటు చట్టం ద్వారా మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు స్థాపించిందిప్రాచీన తమిళ గ్రంథాలను అనువదించడానికిపరిశోధనను ప్రోత్సహించడానికివిశ్వవిద్యాలయ విద్యార్థులుతమిళ భాషా పండితులకు కోర్సులను అందించడానికి సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ఏర్పాటు చేశారుప్రాచీన భాషల అధ్యయనంపరిరక్షణను మరింత మెరుగుపరచడానికిమైసూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో ప్రాచీన కన్నడతెలుగుమలయాళంఒడియాలలో అధ్యయనాల కోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లు స్థాపించారుఈ కార్యక్రమాలతో పాటుప్రాచీన భాషా రంగంలో సాధించిన విజయాలను గుర్తించి ప్రోత్సహించడానికి అనేక జాతీయఅంతర్జాతీయ అవార్డులు స్థాపించారువిద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రాచీన భాషలకు ప్రయోజనాలను విస్తరించారువాటిలో ప్రాచీన భాష కోసం జాతీయ అవార్డులువిశ్వవిద్యాలయాలలో ప్రత్యేక పీఠాలుప్రాచీన భాష ప్రోత్సాహానికి కేంద్రాల ఏర్పాటు మొదలైనవి ఉన్నాయి

 

ఉపాధి కల్పనతో సహా ప్రధాన ప్రభావం:

భాషలను ప్రాచీన భాషలుగా గుర్తించడం వల్ల ముఖ్యంగా విద్యాపరిశోధన రంగాలలో గణనీయమైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయిఅదనంగాఈ భాషల పురాతన గ్రంథాల సంరక్షణడాక్యుమెంటేషన్డిజిటలైజేషన్ ఆర్కైవింగ్అనువాదంప్రచురణడిజిటల్ మీడియాలో ఉద్యోగాలను కల్పిస్తుంది

ఈ భాషల పరిధిలోకి వచ్చే రాష్ట్రాలుజిల్లాలు:

దీనిలో ప్రాథమికంగా భాగస్వాములైన రాష్ట్రాలు మహారాష్ట్ర (మరాఠీ), బీహార్ఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్ (పాలీప్రాకృతం), పశ్చిమ బెంగాల్ (బెంగాలీ), అస్సాం (అస్సామీ). విశాలమైన సాంస్కృతికవిద్యాపరమైన ప్రభావం జాతీయంగాఅంతర్జాతీయంగా విస్తరిస్తుంది

 

***