Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యాయ కోవిదుడు శ్రీ ఫాలీ నారిమన్ యొక్క కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


న్యాయవేత్త శ్రీ ఫాలి నారిమన్ ఈ రోజు న కన్నుమూశారన్న సంగతి తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘శ్రీ ఫాలి నారిమన్ గారు చట్ట రంగం లో అత్యంత విశిష్ట వ్యక్తుల లో మరియు మేధావుల లో ఒకరు గా ఉండే వారు. ఆయన తన జీవనాన్ని న్యాయాన్ని సామాన్య పౌరుల కు అందుబాటు లోకి తీసుకు పోవడం కోసం సమర్పణం చేసివేశారు. ఆయన మనల ను వీడి పోయినందుకు నేను బాధ పడుతున్నాను. ఆయన కుటుంబానికి మరియు ఆయన ను అభిమానించే వారి కి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఆయన ఆత్మ కు ఆ ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించు గాక.’’ అని పేర్కొన్నారు.