Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వైద్య చికిత్స ఉత్పాదనల క్రమబద్ధీకరణ రంగం లో సహకారం అంశం లో భారతదేశాని కి మరియు డొమినికన్ రిపబ్లిక్కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద  పత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


వైద్య చికిత్స ఉత్పాదనల నియంత్రణ రంగం లో సహకారం అనే అంశం లో భారతదేశం గణతంత్రాని కి చెందిన ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేశన్ (సిడిఎస్‌సిఒ) మరియు డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన పబ్లిక్ హెల్థ్ ఎండ్ సోశల్ అసిస్టెంట్ మంత్రిత్వ శాఖకు, ఇంకా డైరెక్టరేట్ జనరల్ ఫార్ మెడిసిన్, ఫూడ్స్ ఎండ్ సేనిటరి ప్రోడక్ట్‌స్ కు మధ్య సంతకాలు జరిగిన ఎమ్ఒయు యొక్క వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది. ఈ ఎమ్ఒయు పై 2023 అక్టోబరు 4వ తేదీ న సంతకాలు జరిగాయి.

 

ఈ ఎమ్ఒయు ఆయా పక్షాల న్యాయాధికారాల పరిధి లో వైద్య చికిత్స ఉత్పాదన లు, తత్సంబంధి పరిపాలన పరమైన మరియు నియంత్రణ పరమైన రంగాల లో సహకారాన్ని మరియు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడాన్ని ప్రోత్సహించనుంది. అంతర్జాతీయ బజారుల లో చెలామణి అవుతున్న నాసిరకం మరియు నకిలీ మందుల సంబంధి సమస్యల ను పరిష్కరించడం కోసం నియంత్రణ యంత్రాంగాల నడుమ సంభాషణల కు మార్గాన్ని ఈ ఎమ్ఒయు సుగమం చేస్తుంది.

 

నియంత్రణ సంబంధి అభ్యాసాల మేళనం ద్వారా భారతదేశం నుండి మందుల ఎగుమతి వృద్ధి చెందడం లో తోడ్పాటు లభించే ఆస్కారం ఉంది; తత్ఫలితం గా విద్యావంతులైన వృత్తి నిపుణుల కు ఔషధ నిర్మాణ సంబంధి రంగం లో చక్కని ఉద్యోగ అవకాశాలు లభించగలవు.

 

ఈ ఎమ్ఒయు వైద్య ఉత్పాదనల ఎగుమతి కి బాట ను పరచగలదు. దాని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జన కు మెరుగు పడుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కారం దిశ లో పడే ఒక అడుగు అని చెప్పాలి.

 

***