ఇరవై ఏడో జాతీయ యువజన ఉత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని నాసిక్ లో ఈ రోజు న ప్రారంభించారు. స్వామి వివేకానంద మరియు రాజమాత జీజాబాయి ల చిత్ర పటాని కి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ని ఘటించారు. ‘వికసిత్ భారత్@2047: యువా కే లియే, యువా కే ద్వారా’ అనే ఇతివృత్తం తో సాగిన ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని, మరి రాష్ట్ర బృందం యొక్క మార్చ్ పాస్ట్ ను కూడా ఆయన వీక్షించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రిథమిక్ జిమ్నాస్టిక్స్, మల్లఖంబ్, యోగాసన మరియు జాతీయ యువజనోత్సవ గీతాలాపన చోటు చేసుకొన్నాయి.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న భారతదేశం లో యువ శక్తి యొక్క ఘట్టం ఆవిష్కారం అవుతూ ఉంది, దీనిని దాస్య కాలం లో దేశాన్ని ఒక క్రొత్త శక్తి తో నింపివేసిన మహనీయుడు స్వామి వివేకానంద కు అంకితం ఇవ్వడమైంది అన్నారు. స్వామి వివేకానంద యొక్క జయంతి నాడు జాతీయ యువజన దినాన్ని జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. ఈ సందర్భం లో యువతీ యువకుల కు శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. భారతదేశం లో మహిళా శక్తి కి ప్రతీక గా ఉన్న రాజమాత జీజాబాయి జయంతి కూడా ఇదే రోజు న వస్తున్నది అని ఆయన అన్నారు. ఈ సందర్భం లో మహారాష్ట్ర కు తాను విచ్చేయడం పట్ల ఆయన తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.
అంత మంది గొప్ప గొప్ప వ్యక్తుల ను కన్న మహారాష్ట్ర గడ్డ మీద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను కురిపించారు. ఈ నేల రాజమాత జీజాబాయి ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ ఒక్కరికే కాకుండా, దేవీ అహిల్యాబాయి హోల్కర్ గారు మరియు రమాబాయి అంబేడ్ కర్ గారు ల వంటి మహా మహిళా నేతల ను అందించిందని; అదే మాదిరిగా లోక్ మాన్య శ్రీ తిలక్, వీర్ శ్రీ సావర్‌కర్, శ్రీ అనంత్ కాన్హేరే, దాదాసాహెబ్ శ్రీ పోట్‌నీస్ మరియు శ్రీయుతులు చాపేకర్ సోదరులు తదితరుల వంటి వారి కి నిలయం అయిందని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘శ్రీ రామచంద్ర ప్రభువు నాసిక్ లోని పంచవటి లో చాలా కాలం పాటు ఉన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ మహానుభావుల కు ఆలవాలం అయినటువంటి మహారాష్ట్ర కు ఆయన ప్రణమిల్లారు. ఈ సంవత్సరం లో 22 వ తేదీ కంటే ముందుగా భారతదేశం లో ఆరాధన స్థలాల అన్నింటిలో స్వచ్ఛత ఉద్యమాన్ని నిర్వహించాలని, ఆ ప్రదేశాల ను శుభ్రపరచాలి అంటూ తాను ఇచ్చిన పిలుపు ను ఆయన పునరుద్ఘాటిస్తూ, నాసిక్ లో గల శ్రీ కాలారామ్ దేవాలయం లో జరిగిన పూజ మరియు దైవదర్శనం కార్యక్రమాల లో పాలుపంచుకోవడాన్ని గురించి ప్రస్తావించారు. త్వరలో ప్రారంభం కానున్న శ్రీ రామ ఆలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఘట్టాని కంటే ముందే అన్ని ఆలయాల లో, తీర్థ స్థలాల లో మరియు యాత్రా స్థలాల లో స్వచ్ఛత కార్యక్రమాలు చోటు చేసుకోవాలి అని ఆయన పునరుద్ఘాటించారు.
యువ శక్తి కి అగ్రతాంబూలాన్ని అందించే సంప్రదాయాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావిస్తూ, శ్రీ అరవిందులు మరియు స్వామి వివేకానంద ల పలుకుల ను ఉదాహరించారు. ప్రపంచం లో అగ్రగామి అయిదు ఆర్థిక వ్యవస్థ ల సరసన భారతదేశం నిలబడింది అంటే అందుకు ఖ్యాతి యువశక్తి కి దక్కుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం అగ్రగామి మూడు స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్స్ సరసన నిలవడం లో, పేటెంట్ ల పరం గా రికార్డు సంఖ్య నమోదు చేయడం లో, మరి ప్రధానమైన తయారీ కేంద్రాల లో ఒకటి గా మారడం లో దేశ యువశక్తి సత్తా భూమిక ఉన్నది అని కూడా ఆయన అన్నారు.
‘అమృత కాలం’ లో వర్తమాన ఘడియ లు భారతదేశం యువజనుల కు ఒక అద్వితీయమైన ఘట్టం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శ్రీయుతులు ఎమ్. విశ్వేశ్వరయ్య, మేజర్ ధ్యాన్ చంద్, భగత్ సింహ్, చంద్రశేఖర్ ఆజాద్, బటుకేశ్వర్ దత్, మహాత్మ ఫులే, సావిత్రి బాయి ఫులే ల మార్గదర్శక ప్రాయం అయినటువంటి తోడ్పాటుల ను ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, ‘అమృత కాలం’ లో యువత భుజస్కందాల పైన ఇదే మాదిరి బాధ్యత లు ఉన్నాయి అనే సంగతి ని గుర్తు కు తెచ్చారు. దేశాన్ని సరిక్రొత్త శిఖరాల కు తీసుకు పోవడం కోసం పాటుపడవలసింది గా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విశిష్టమైన అవకాశం అందివచ్చిన సందర్భం లో ‘‘మీ యొక్క తరం భారతదేశం చరిత్ర లో అత్యంత అదృష్టవంతమైన తరం అని నేను అనుకొంటున్నాను. భారతదేశం యువత ఈ లక్ష్యాన్ని సాధించగలదు అనే సంగతి ని నేను ఎరుగుదును’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఎమ్‌వై-భారత్ పోర్టల్ (MY-Bharat portal) తో యువజనులు జత పడుతున్న వేగం పట్ల ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 75 రోజులు ముగిసీ ముగియక మునుపే ఒక కోటి పది లక్షల మంది యువజనులు తమ పేరుల ను ఈ పోర్టల్ లో నమోదు చేసుకొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారం లో పది సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొంటూ ఉన్న తరుణం లో, భారతదేశ యువజనుల కు వారి దారిలో ఉన్న అడ్డంకుల ను తొలగించివేశాయని ప్రస్తావిస్తూ అనేకమైన అవకాశాల ను అందించింది అని ప్రధాన మంత్రి అన్నారు. విద్య, బోధన, ఉద్యోగ కల్పన, నవపారిశ్రామికత్వం, ఉనికి లోకి వస్తున్న స్టార్ట్-అప్స్, నైపుణ్యాలు, ఇంకా క్రీడల రంగాల లో ఒక అధునాతనమైనటువంటి మరియు హుషారైనటువంటి ఇకోసిస్టమ్ ను అభివృద్ధి పరచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నూతన విద్య విధానం అమలు ను గురించి, ఆధునిక నైపుణ్య శిక్షణ ప్రధానమైన వ్యవస్థ ను అభివృద్ధి పరచడాన్ని గురించి, చేతివృత్తులు మరియు చేతివృత్తి కళాకారుల కోసం పిఎమ్-విశ్వకర్మ యోజన ను ప్రవేశపెట్టడాన్ని గురించి, పిఎమ్ కౌశల్ వికాస్ యోజన ద్వారా కోట్ల కొద్దీ యువత కు అదనపు శిక్షణ కై సదుపాయాల ను ఇవ్వడాన్ని గురించి, దేశం లో సరిక్రొత్త ఐఐటి లను మరియు ఎన్ఐటి లను స్థాపించడాన్ని గురించి ఆయన మాట్లాడారు. ‘‘భారతదేశాన్ని ఒక క్రొత్త నైపుణ్య శక్తి గా ప్రపంచం చూస్తున్నది’’ అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచాని కి యువజనులు వారి నైపుణ్యాల ను చాటి చెప్పాలని కోరుకొంటున్నారని, వారి కి శిక్షణ సదుపాయాల ను ప్రభుత్వం అందించ దలుస్తోంది అని ఆయన చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ, యుకె, ఆస్ట్రేలియా, ఇటలీ, ఆస్ట్రియా మొదలైన దేశాల తో ప్రభుత్వం కుదుర్చుకొన్న మొబిలిటీ ఎగ్రీమెంటు లతో దేశం లో యువతీ యువకుల కు చాలా ప్రయోజనాలు లభిస్తాయి అని ఆయన తెలిపారు.
‘‘ప్రస్తుతం యువతీ యువకుల కోసం అవకాశాల తాలూకు ఒక క్రొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడం జరుగుతున్నది. దీని కోసం ప్రభుత్వం తన సర్వశక్తుల తో పని చేస్తోంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. డ్రోన్, ఏనిమేశన్, గేమింగ్, కామిక్స్ రంగం, విజువల్ ఎఫెక్ట్ స్, పరమాణు రంగం, అంతరిక్ష రంగం, మరియు మేపింగ్ రంగం వంటి పలు రంగాల లో అనువైన వాతావరణాన్ని కల్పించడం జరుగుతోంది అని ఆయన వివరించారు. వర్తమాన ప్రభుత్వ హయాం లో ఇది వరకు ఎరుగనంత వేగం తో ప్రగతి దిశ గా సాగడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, రాజ మార్గాలు, ఆధునిక రైళ్ళు, ప్రపంచ శ్రేణి విమానాశ్రయాలు, టీకా మందు ధ్రువ పత్రాలు వంటి డిజిటల్ సర్వీసుల లో వృద్ధి మరియు తక్కువ ఖర్చు తో డేటా వినియోగం సదుపాయం అనేవి దేశం లో యువతీ యువకుల కు సరిక్రొత్త మార్గాల ను అందుబాటు లోకి తీసుకు వస్తున్నాయి అన్నారు.
‘‘ప్రస్తుతం దేశం లో మనఃస్థితి మరియు సరళి పరం గా చూస్తే యవ్వనం తొణికిసలాడుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. నేటి తరం యువత వెనుకపట్టున ఉండిపోవడం కాకుండా నాయకత్వాన్ని వహిస్తున్నది అని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల భారతదేశం సాంకేతిక విజ్ఞానం లో ఒక నేత గా మారింది. ఉదాహరణ కు తీసుకొంటే చంద్రయాన్-3 మరియు ఆదిత్య ఎల్-1 సాహస యాత్ర లు సఫలం అయ్యాయి అని ఆయన అన్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ తయారీ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ను గురించి కూడా ఆయన చెప్పారు. స్వాతంత్య్ర దినం నాడు నిర్వహించే సంప్రదాయబద్ధమైన శతఘ్ని వందనం లో మేడ్ ఇన్ ఇండియా ఫిరంగి గర్జిస్తే దేశం లో ఒక క్రొత్త చైతన్యం మేలుకొంటుంది అని ఆయన అన్నారు. తేజస్ పోరాట విమానం గగనతలం లో దర్జాగా విన్యాసాలు చేస్తూ ఉంటే ఛాతీ ఉప్పొంగుతుంది అని ఆయన అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించిన ఇతర అంశాల లో యుపిఐ లేదా డిజిటల్ పేమెంట్స్ ను చిన్న చిన్న దుకాణాలు మొదలుకొని, అతి పెద్దవి అయినటువంటి శాపింగ్ మాల్స్ లో విరివిగా వాడడం ఒక అంశం గా ఉండింది. ‘‘అమృత కాలం యొక్క రాక భారతదేశాని కి ఎక్కడ లేని గర్వాన్ని సంతరించింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశాన్ని ఒక ‘వికసిత్ భారత్’ గా రూపొందించడం కోసం ఈ యొక్క అమృత కాలాన్ని యువత ఉపయోగించుకోవాలి అని ఆయన కోరారు.
యువతీ యువకులు వారి కలల కు సరిక్రొత్త రెక్కల ను తొడగడాని కి ఇదే అనువైన కాలం అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘మనం ఇప్పుడు సవాళ్ళ ను అధిగమించినంత మాత్రాననే సరిపోదు. మనం మన కోసం క్రొత్త సవాళ్ళ ను నిర్దేశించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఒక అయిదు ట్రిలియన్ డాలర్ విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థ ను నెలకొల్పడం, మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా మారడం, తయారీ కేంద్రాల లో ఒక కేంద్రం గా రూపుదాల్చడం, జలవాయు పరివర్తన ను అడ్డుకోవడం కోసం, మరి అలాగే ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం పని చేయడం వంటి నూతన లక్ష్యాల ను గురించి ఆయన వివరించారు.
యువతరం పట్ల తనకు ఉన్నటువంటి విశ్వాసాని కి ఆధారం ఏది అని అంటే, అది ‘‘దేశం లో దాస్యం తాలూకు ఒత్తిడి ఏ మాత్రం లేని అటువంటి యువజనులు మీరు. అభివృద్ధి తో పాటు, వారసత్వం పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నారు వీరు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. యోగ కు మరియు ఆయుర్వేదాని కి ఉన్న విలువ ను ప్రపంచం గుర్తిస్తోంది. మరి భారతదేశం లో యువత యోగ కు మరియు ఆయుర్వేద కు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతోంది అని ఆయన అన్నారు.
యువతీ యువకులు వారి అమ్మమ్మ మరియు తాతయ్య లనో, నానమ్మ మరియు తాతయ్య లనో అడిగారంటే గనక వారు వారి కాలాల్లో సజ్జ రొట్టె, కోదో– కుట్ కీ, రాగులు , ఇంకా ఇతర చిరుధాన్యాల తో తయారు చేసిన రొట్టె మున్నగు వంటకాలు.. మేం ఇవే తినే వాళ్లం.. అని చెబుతారని ప్రధాన మంత్రి అన్నారు. అయితే బానిస మనస్తత్వం వల్ల ఈ విధమైన ఆహార పదార్థాల ను పేదరికం తో ముడిపెట్టడమనేది చోటు చేసుకొన్నది. దీని తో ఈ ఆహార పదార్థాలు భారతదేశం లో వంట ఇళ్ళ లో నుండి మాయమయ్యాయి అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ అన్న మరియు ముతక ధాన్యాల కు ప్రభుత్వం సూపర్ ఫూడ్స్ అనే ఓ క్రొత్త గుర్తింపు ను ఇచ్చింది. తద్ద్వారా ఈ చిరుధాన్యాలు మళ్ళీ భారతదేశం కుటుంబాల లోకి తరలివచ్చాయి అని ఆయన అన్నారు. ‘‘ఇప్పుడిక మీరు ఈ తృణ ధాన్యాల కు బ్రాండ్ అంబాసిడర్ లు గా మారాలి. మీ ఆరోగ్యం కూడా ఆహార ధాన్యాల తో మెరుగుపడుతుంది; మరి దేశం లో చిన్న రైతుల కు మేలు కలుగుతుంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.
రాజకీయాల మాధ్యం ద్వారా దేశ ప్రజల కు సేవ చేయవలసింది గా యువత కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ నేత లు ఇప్పుడు భారతదేశం పట్ల ఆశావాదం తో ఉన్న సంగతి ని ఆయన ప్రస్తావించారు. ‘‘ఈ ఆశ కు ఒక కారణం అంటూ ఉంది, అదే ఆకాంక్ష – భారతదేశం ప్రజాస్వామ్యాని కి జనని అనే గొప్ప ఆశ . ప్రజాస్వామ్యం లో యువత ఎంత మిక్కిలి గా పాలుపంచుకొంటే, అంత ఉత్తమం గా దేశ భవిష్యత్తు రూపొందుతుంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వారి యొక్క ప్రాతినిధ్యం వంశ వాద రాజకీయాల ను సన్నగిల జేస్తుంది అని ఆయన సూచించారు. వోటు ను వేయడం ద్వారా వారు వారి యొక్క అభిమతాన్ని వెల్లడి చేయవలసింది గా కూడా ఆయన కోరారు. జీవనం లో వోటు హక్కు ను మొట్టమొదటి సారిగా వినియోగించుకొననున్న వోటర్ లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ‘‘వారు మన ప్రజాస్వామ్యాని కి క్రొత్త శక్తి ని ఇవ్వగలుగుతారు’’ అని ఆయన అన్నారు.
‘‘అమృత కాలం లో రాబోయే 25 సంవత్సరాల కాలం మీకు కర్తవ్య భరితం అయినటువంటి కాలం అని చెప్పాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మీరు మీ యొక్క కర్తవ్యాల కు అన్నిటి కంటే అగ్రస్థానాన్ని ఇచ్చారంటే ఈ సమాజం, ఈ దేశం ముందంజ వేయ గలుగుతాయి’’ అని ఆయన అన్నారు. ఎర్రకోట మీది నుండి తాను చేసిన మనవి ని ప్రధాన మంత్రి మరొక్క మారు గుర్తు చేస్తూ, యువత స్థానిక ఉత్పాదన ల వినియోగాన్ని ప్రోత్సహించాలి, ఒక్క మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల నే వినియోగించాలి, ఎటువంటి మత్తుపదార్థాల కు అయినా సరే దూరం గా ఉండాలి. వ్యవసనాల బారి న పడకూడదు, మాతృమూర్తులు, సోదరీమణులు మరియు పుత్రిక ల ప్రసక్తి తెచ్చి దుర్భాష లు ఆడడాన్ని విడనాడాలి మరి ఆ తరహా దురాచారాల కు స్వస్తి పలకాలి అని ప్రధాన మంత్రి ఉద్బోధించారు.
భారతదేశం లో యువతీ యువకులు ప్రతి ఒక్క బాధ్యత ను పూర్తి నిష్ఠ తోను మరియు దక్షత తోను నెరవేర్చుతారన్న నమ్మకాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘ఒక బలమైనటువంటి, సమర్థమైనటువంటి మరియు సాధికారమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనే కల ను పండించడాని కి మనం వెలిగించే జ్యోతి అమర జ్యోతి వలె మారి, ఈ ప్రపంచాన్నే ప్రకాశయుక్తం చేయ గలుగుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమం లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర యొక్క ఉప ముఖ్యమంత్రులు శ్రీయుతులు దేవేంద్ర ఫడ్‌ణవీస్, అజిత్ పవార్, క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ మరియు ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ నిశిథ్ ప్రామాణిక్ లతో పాటు ఇతరులు పాలుపంచుకొన్నారు.
పూర్వరంగం
దేశ అభివృద్ధి ప్రస్థానం లో యువత కు ఒక కీలకమైన స్థానాన్ని కట్టబెట్టాలి అన్నది ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస గా ఉంటోంది. ఈ ప్రయాస లో మరొక భాగమా అన్నట్లు గా, ప్రధాన మంత్రి ఇరవై ఏడో జాతీయ యువజనోత్సవాన్ని (ఎన్‌వైఎఫ్) నాసిక్ లో ప్రారంభించారు.
జాతీయ యువజనోత్సవాన్ని ప్రతి సంవత్సరం లో జనవరి 12 వ తేదీ మొదలుకొని 16 వ తేదీ వరకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. జనవరి 12 వ తేదీ న స్వామి శ్రీ వివేకానంద యొక్క జయంతి. ఈసారి ఈ ఉత్సవాని కి ఆతిథేయి రాష్ట్రం గా మహారాష్ట్ర ఉంది. ఈ సంవత్సరం నిర్వహించే ఉత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే అది – ‘వికసిత్ భారత్ @ 2024: యువా కే లియే యువా కె ద్వారా’ (Viksit Bharat@ 2047: युवा के लिए, युवा के द्वारा) అనేదే.
భారతదేశం లో వివిధ ప్రాంతాల కు చెందిన యువజనులు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ భావన తో వారి అనుభవాల ను వ్యక్తం చేయడం కోసం మరియు కలిసికట్టు గా దేశం యొక్క పునాది ని బలపరచడం కోసం తగిన వేదిక ను అందించడం ఎన్‌వైఎఫ్ యొక్క సంకల్పం. దేశం అంతటి నుండి దాదాపు గా 7,500 మంది యువ ప్రతినిధులు నాసిక్ లో నిర్వహించే ఈ ఉత్సవం లో పాలుపంచుకొంటున్నారు. ఈ ఉత్సవం లో భాగం గా సాంస్కృతిక ప్రదర్శనల ను, దేశవాళీ ఆటల ను, ప్రసంగం మరియు విషయగత ఆధారిత సమర్పణ, యువ కళాకారుల శిబిరం, పోస్టర్ లను తయారు చేయడం, కథా రచన, యువజన సమ్మేళనం, ఆహార పదార్థాల మహోత్సవం నిర్వహణ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
India’s Yuva Shakti is our greatest strength. Addressing the National Youth Festival in Nashik. https://t.co/dkjydw7Sec
— Narendra Modi (@narendramodi) January 12, 2024
आज मुझे कालाराम मंदिर में दर्शन करने का, मंदिर परिसर में सफाई करने का सौभाग्य मिला है।
मैं देशवासियों से फिर अपना आग्रह दोहराउंगा कि राम मंदिर में प्राण प्रतिष्ठा के पावन अवसर के निमित्त, देश के सभी मंदिरों में स्वच्छता अभियान चलाएं, अपना श्रमदान करें: PM @narendramodi pic.twitter.com/B6ItrbRLsT
— PMO India (@PMOIndia) January 12, 2024
श्री ऑरोबिन्दो, स्वामी विवेकानंद का मार्गदर्शन आज 2024 में, भारत के युवा के लिए बहुत बड़ी प्रेरणा है। pic.twitter.com/tm6ih2ESjx
— PMO India (@PMOIndia) January 12, 2024
भारत के युवाओं के लिए समय का सुनहरा मौका अभी है, अमृतकाल का ये कालखंड है।
आज आपके पास मौका है इतिहास बनाने का, इतिहास में अपना नाम दर्ज कराने का। pic.twitter.com/LMTOgBcnnF
— PMO India (@PMOIndia) January 12, 2024
10 वर्षों में हमने पूरा प्रयास किया है कि युवाओं को खुला आसमान दें, युवाओं के सामने आने वाली हर रुकावट को दूर करें: PM @narendramodi pic.twitter.com/HUJM5qE0Cg
— PMO India (@PMOIndia) January 12, 2024
आज देश का मिजाज भी युवा है, और देश का अंदाज़ भी युवा है। pic.twitter.com/nqyVEQYD8f
— PMO India (@PMOIndia) January 12, 2024
इस कालखंड में देश में वो युवा पीढ़ी तैयार हो रही है, जो गुलामी के दबाव और प्रभाव से पूरी तरह मुक्त है। pic.twitter.com/mxcaSRyKFg
— PMO India (@PMOIndia) January 12, 2024
लोकतंत्र में युवाओं की भागीदारी जितनी अधिक होगी, राष्ट्र का भविष्य उतना ही बेहतर होगा: PM @narendramodi pic.twitter.com/l1FEugO8Vk
— PMO India (@PMOIndia) January 12, 2024
***
DS/TS
India's Yuva Shakti is our greatest strength. Addressing the National Youth Festival in Nashik. https://t.co/dkjydw7Sec
— Narendra Modi (@narendramodi) January 12, 2024
आज मुझे कालाराम मंदिर में दर्शन करने का, मंदिर परिसर में सफाई करने का सौभाग्य मिला है।
— PMO India (@PMOIndia) January 12, 2024
मैं देशवासियों से फिर अपना आग्रह दोहराउंगा कि राम मंदिर में प्राण प्रतिष्ठा के पावन अवसर के निमित्त, देश के सभी मंदिरों में स्वच्छता अभियान चलाएं, अपना श्रमदान करें: PM @narendramodi pic.twitter.com/B6ItrbRLsT
श्री ऑरोबिन्दो, स्वामी विवेकानंद का मार्गदर्शन आज 2024 में, भारत के युवा के लिए बहुत बड़ी प्रेरणा है। pic.twitter.com/tm6ih2ESjx
— PMO India (@PMOIndia) January 12, 2024
10 वर्षों में हमने पूरा प्रयास किया है कि युवाओं को खुला आसमान दें, युवाओं के सामने आने वाली हर रुकावट को दूर करें: PM @narendramodi pic.twitter.com/HUJM5qE0Cg
— PMO India (@PMOIndia) January 12, 2024
आज देश का मिजाज भी युवा है, और देश का अंदाज़ भी युवा है। pic.twitter.com/nqyVEQYD8f
— PMO India (@PMOIndia) January 12, 2024
इस कालखंड में देश में वो युवा पीढ़ी तैयार हो रही है, जो गुलामी के दबाव और प्रभाव से पूरी तरह मुक्त है। pic.twitter.com/mxcaSRyKFg
— PMO India (@PMOIndia) January 12, 2024
लोकतंत्र में युवाओं की भागीदारी जितनी अधिक होगी, राष्ट्र का भविष्य उतना ही बेहतर होगा: PM @narendramodi pic.twitter.com/l1FEugO8Vk
— PMO India (@PMOIndia) January 12, 2024
भारत के ऋषियों-मुनियों और संतों से लेकर सामान्य मानवी तक, सभी ने इसलिए हमारी युवाशक्ति को सर्वोपरि रखा है… pic.twitter.com/z2F3JzQIbW
— Narendra Modi (@narendramodi) January 12, 2024
‘मेरा युवा भारत’ प्लेटफॉर्म से आज देशभर के युवा जिस तेजी से जुड़ रहे हैं, वह बहुत उत्साहित करने वाला है। pic.twitter.com/4CmsjQwUFR
— Narendra Modi (@narendramodi) January 12, 2024
युवाओं के लिए नए-नए अवसरों का आकाश खोलने के लिए हमारी सरकार हर क्षेत्र में पूरी शक्ति से काम करती आ रही है। pic.twitter.com/EJdNX6xoYU
— Narendra Modi (@narendramodi) January 12, 2024
अमृतकाल का आरंभ गौरव से भरा हुआ है। हमारे युवा साथियों को इसे और आगे लेकर जाना है, भारत को विकसित राष्ट्र बनाना है। pic.twitter.com/UZCRfoih3C
— Narendra Modi (@narendramodi) January 12, 2024
विकास भी और विरासत भी, इस मंत्र को साथ लेकर चल रही आज की युवा पीढ़ी पर मेरे विश्वास की ये ठोस वजह है… pic.twitter.com/UMFpVJR5xN
— Narendra Modi (@narendramodi) January 12, 2024
परिवारवाद की राजनीति से देश को बचाने के लिए युवाओं, खासकर First Time Voters से मेरी एक अपील… pic.twitter.com/tLrkhadXlO
— Narendra Modi (@narendramodi) January 12, 2024