Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దిల్లీకంటోన్మెంట్ లో గల ఆర్మీ హాస్పిటల్ (ఆర్&ఆర్) యొక్క ఇఎన్ టి విభాగం గడచిన 18 నెలల్లో 50 మంది రోగుల కు రెండు చెవుల లోనుఏక కాలం లో ధ్వని యంత్రాల ను అమర్చిన ఖ్యాతి ని సాధించడాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి


 

దిల్లీ కంటోన్మెంట్ లో గల ఆర్మీ హాస్పిటల్ (ఆర్&ఆర్) లో చెవి, ముక్కు, గొంతుక విభాగం (ఇఎన్ టి) గడచిన 18 మాసాల లో ఏకకాలం లో 50 మంది రోగుల కు కాక్లియర్ ఇంప్లాంట్స్ ను ఏక కాలం లో అమర్చిన ఖ్యాతి ని దక్కించుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

సామాజిక మాధ్యం ఎక్స్ లో పత్రికా సమాచార కార్యాలయం నమోదు చేసిన ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ –

‘‘చెవి లో ధ్వని యంత్రం అమర్చడం (కాక్లియర్ ఇంప్లాంట్) లో ఒక ఘనమైన బెంచ్ మార్కు ను ఏర్పరచినందుకు అభినందన లు. ఈ తరహా సమర్పణ భావం మరియు ప్రావీణ్యం ఎంతో మంది కి ఉజ్జ్వలమైన మరియు ఆరోగ్యప్రదమైన భవిష్యత్తు ను ప్రసాదిస్తుంది. ఈ కార్యసాధన మన వైద్యచికిత్స వృత్తినిపుణుల నిబద్ధత ను గురించి వేనోళ్ళ చాటిచెబుతోంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS