ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ 54 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్ ప్రీతి పవార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ 19 ఏళ్ల యువతి ప్రతిభను చూసి గర్విస్తున్నానని, తానెంచుకున్న క్రీడలో అంకితభావం, నిలకడ, మొక్కవోని దీక్షకు ఆమె సాధించిన ఈ విజయం సంకేతమని ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ప్రతిభావంతురాలైన మన బాక్సర్ మహిళల బాక్సింగ్ 54 కిలోల విభాగంలో భారతదేశానికి కాంస్యం పతకం తెచ్చిపెట్టింది. ఆమె ప్రతిభా ప్రదర్శన నన్ను గర్వపడేలా చేసింది. ఈ క్రీడలో ఆమె అంకితభావం, నిలకడ, మొక్కవోని దీక్షకు ఈ విజయం ఒక నిదర్శనం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A talented Pugilist whose hard work has earned a Bronze Medal in the Women's 54 kg for India at the Asian Games.
— Narendra Modi (@narendramodi) October 3, 2023
Proud of Preeti Pawar for her fantastic performance, a testament to her consistency, dedication and never-say-die attitude. pic.twitter.com/q8tY8S6LvL