Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిక్స్ 15వ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

బ్రిక్స్ 15వ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 23న దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహాన్నెస్‌బర్గ్‌ లో ప్రారంభమైన ‘బ్రిక్స్‌’ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, ఆఫ్రికాసహా దక్షిణార్థ గోళ దేశాలతో భాగస్వామ్యం తదితర అంశాలపై కూటమి దేశాల అధినేతలు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ‘బ్రిక్స్’ కార్యాచరణ జాబితాలోని అంశాల అమలులో ఇప్పటిదాకా పురోగతిని వారు సమీక్షించారు.

ప్రధానమంత్రి తన ప్రసంగంలో భాగంగా- మరింత బలమైన ‘బ్రిక్స్‌’ కోసం ముందడుగు వేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కూటమికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ మేరకు:

బి – అవరో్ధాలను అధిగమించడం (బ్రేకింగ్‌ బారియర్స్‌)

ఆర్‌- ఆర్థిక వ్యవస్థలకు పునరుత్తేజం (రీవైటలైజింగ్‌ ఎకానమీస్‌)

ఐ – ఆవిష్కరణ స్ఫూర్తి (ఇన్‌స్పైరింగ్‌ ఇన్నొవేషన్‌)

సి – అవకాశాల సృష్టి (క్రియేటింగ్‌ ఆపర్చునిటీస్‌)

ఎస్‌- భవిష్యత్తుకు రూపం (షేపింగ్‌ ది ఫ్యూచర్‌)

అదేవిధంగా వివిధ చర్యలకు సంబంధించి కింది అంశాలను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు:

  • ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సంస్కరణలకు నిర్దిష్ట గడువు విధింపు
  • బహుపాక్షిక ఆర్థిక సంస్థలలో సంస్కరణలు
  • ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)కు సంస్కరణలు
  • బ్రిక్స్‌ విస్తరణపై ఏకాభిప్రాయ సాధన
  • బ్రిక్స్‌ ద్వారా ప్రపంచానికి విభజిత దృక్కోణం కాకుండా ఐక్యత సందేశం పంపడం
  • బ్రిక్స్‌ అంతరిక్ష పరిశోధన సమాఖ్య ఏర్పాటుకు ప్రతిపాదన
  • భారత డిజిటల్‌ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు- ‘ఇండియన్‌ శ్టాక్స్’ను బ్రిక్స్‌ భాగస్వాములతో పంచుకోవడానికి సంసిద్ధత.
  • నైపుణ్యాల గుర్తింపు.. శిక్షణ.. బ్రిక్స్‌ దేశాల మధ్య నిపుణ మానవ వనరుల ఆదానప్రదానాలకు ప్రతిపాదన
  • ‘అంతర్జాతీయ పులిజాతి సంరక్షణ కూటమి’ ఒప్పందం కింద వాటి సంరక్షణకు బ్రిక్స్‌ సంయుక్త కృషిపై ప్రతిపాదన
  • బ్రిక్స్‌ దేశాల మధ్య సంప్రదాయ వైద్యవిధానాల భాండాగారం ఏర్పాటుకు ప్రతిపాదన
  • జి-20లో ఆఫ్రికా సమాఖ్యకు శాశ్వత సభ్యత్వంపై బ్రిక్స్‌ మద్దతుకు పిలుపు

 

*****