“కాలానికి అనుగుణంగా దేశం ఆధునిక టెక్నాలజీ అనుసరించకపోతే కాలం దాన్ని వదిలి ముందుకు సాగిపోతుంది. మూడో పారిశ్రామిక విప్లవంలో ఈ నిర్లక్ష్యం బాధిత దేశం భారత్, కాని నేడు నాలుగో పారిశ్రామిక విప్లవం ఇండస్ర్టీ 4.0లో భారతదేశమే ప్రపంచానికి మార్గదర్శకం చేస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారు. ఇందులో ముందువరుసలో నిలిచినందుకు గుజరాత్ ను ఆయన అభినందించారు.
8-10 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటూ జనన ధ్రువీకరణ, బిల్లు చెల్లింపులు, పాఠశాల ప్రవేశాలు, ఫలితాలు, బ్యాంకుల ముందు భారీ లైన్లలో నిలబడాల్సిన స్థితి ఉండేదని, ఆన్ లైన్ అనుసరించడం ద్వారా ఆ సమస్యలను భారతదేశం అధిగమించిందని ప్రధానమంత్రి తెలిపారు. జీవన ధ్రువీకరణ, రిజర్వేషన్, బ్యాంకింగ్ వంటి పలు సేవలు అందరికీ ధరల్లో అందుబాటులోకి వచ్చి వేగవంతం అయ్యాయి. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో గత 8 సంవత్సరాల కాలంలో రూ.23 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో బదిలీ అయ్యాయన్నారు. అవినీతి నిర్మూలనలో డిజిటల్ ఇండియా పాత్ర గురించి ప్రస్తావిస్తూ “టెక్నాలజీ వినియోగం ద్వారా రూ.2.23 లక్షల కోట్లు మోసగాళ్ల చేతుల్లోకి పోకుండా ఆదా అయ్యాయి” అని ప్రధానమంత్రి చెప్పారు. డిజిటల్ ఇండియా ద్వారా పరిపాలన, ఫోన్లు పౌరుల ముంగిటికి వచ్చాయని ఆయన తెలిపారు. 1.25 లక్షలకు పైబడిన కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణ స్టోర్లు ఇ–కామర్స్ ను గ్రామీణ భారతం ముంగిటికి తీసుకెళ్లాయన్నారు. అలాగే టెక్నాలజీ వినియోగం ద్వారా గ్రామీణ ఆస్తులకు సంబంధించిన పత్రాలు అందరికీ తేలిగ్గా అందుతున్నట్టు చెప్పారు.
గత ఎనిమిది సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా సృష్టించిన శక్తి చివరికి కరోనా వంటి ప్రపంచ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడిందని ప్రధానమంత్రి చెప్పారు. “కేవలం ఒకే ఒక క్లిక్ తో కోట్లాది మంది మహిళలు, రైతులు, కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయగలిగాం. ఒక జాతి ఒక రేషన్ కార్డు సహాయంతో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ అందించగలిగాం” అని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ సహాయ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని ఆయన తెలిపారు. కోవిన్ వేదిక ద్వారా 200 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు ఇవ్వడం, సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగిందని ప్రధానమంత్రి అన్నారు.
“భారత ఫిన్ టెక్ ప్రజల చేత, ప్రజలే, ప్రజల కోసం చేపట్టిన వాస్తవమైన సొల్యూషన్. వాస్తవానికి టెక్నాలజీయే ప్రజల చేత అనుసరించే ప్రక్రియ. ప్రజల కోసం ప్రజలే టెక్నాలజీని భాగం చేసుకున్నారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రజలే డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు” అని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచ స్థాయిలో 40 శాతం డిజిటల్ లావాదేవీలు భారతదేశంలోనే జరుగుతున్నాయి అంటూ “మన డిజిటల్ సొల్యూషన్ల పరిధి, భద్రత, ప్రజాస్వామిక విలువ ఇది” అని ఆయన చెప్పారు.
వచ్చే 4-5 సంవత్సరాల కాలంలో పరిశ్రమ 4.0కి అవసరం అయిన 14-15 లక్షల మంది యువతను సిద్ధం చేసేందుకు నైపుణ్యాల కల్పన, పాత నైపుణ్యాలకు మెరుగులు, కొత్త నైపుణ్యాలు అందించడంపై దృష్టి సారించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. “అంతరిక్షం, మ్యాపింగ్, డ్రోన్లు, గేమింగ్, యానిమేషన్ వంటి రంగాలన్నీ భవిష్యత్తులో డిజిటల్ టెక్నాలజీని విస్తరింపచే స్తాయి. అవి ఇన్నోవేషన్ కు ద్వారాలు తెరిచాయి. వర్తమాన దశాబ్దిలో రాబోయే సంవత్సరాల్లో ఇన్-స్పేస్, కొత్త డ్రోన్ విధానం భారత సాంకేతిక పరిజ్ఞానానికి కొత్త శక్తిని అందిస్తాయి” అన్నారు.
“వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల కాలంలో ఎలక్ర్టానిక్స్ తయారీని $300 బిలియన్ కన్నా పై స్థాయికి చేర్చడం లక్ష్యంగా నేడు భారతదేశం కృషి చేస్తోంది, చిప్ ల సేకరణ దేశం స్థాయి నుంచి చిప్ తయారీ కేంద్రంగా మారాలని భారతదేశం భావిస్తోంది. సెమీ కండక్టర్ల తయారీని పెంచడంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి” అని ప్రధానమంత్రి తెలిపారు.
డిజిటల్ ఇండియా ప్రచారం తనకు తాను కొత్త కోణాలు జత చేస్తుంది, పౌరులకు సేవలు అందిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు.
కొత్తగా ప్రారంభమైన కార్యక్రమాల వివరాలు
“డిజిటల్ ఇండియా భాషిణి” వాయిస్ ఆధారిత సేవలు సహా ఇంటర్నెట్, డిజిటల్ సేవలు అందరికీ తేలిగ్గా అందుబాటులోకి రావడానికి దోహదపడడంతో పాటు భారతీయ భాషల్లో కంటెంట్ సృష్టికి సహాయకారిగా ఉంటుంది. ఎఐ–ఆధారిత భాషా టెక్నాలజీ సొల్యూషన్ల వల్ల బహుభాషా డేటాసెట్లు అందుబాటులోకి వస్తాయి. భాషాదాన్ పేరిట క్రౌడ్ సోర్సింగ్ ఆధారిత చొరవతో ఈ తరహా డేటా సెట్లు నిర్మించేందుకు కూడా డిజిటల్ ఇండియా భాషిణి సహాయకారిగా ఉంటుంది.
“డిజిటల్ ఇండియా జెనెసిస్” (ఇన్నోవేటివ్ స్టార్టప్ లకు కొత్తతరం మద్దతు) – జాతీయ స్థాయి డీప్ టెక్ స్టార్టప్ వేదిక. ఇది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో విజయవంతమైన స్టార్టప్ లను గుర్తించి, మద్దతు ఇచ్చి, వృద్ధి చేసేందుకు సహాయపడుతుంది. ఈ స్కీమ్ కోసం రూ.750 కోట్లు కేటాయించారు.
“ఇండియాస్టాక్.గ్లోబల్” – ఆధార్, యుపిఐ, డిజిలాకర్, కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రభుత్వ ఇ–మార్కెట్ (జెమ్) దీక్ష, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం వంటి కీలక ప్రాజెక్టులకు ప్రపంచ రిపోజిటరీ. ఇలాంటి టెక్నాలజీ కోసం అన్వేషించే ఇతర దేశాలకు విస్తృత పరిధిలో జనాభాకు అవసరమైన డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులు అందించడంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతుంది.
“మై స్కీమ్” – ప్రభుత్వ స్కీమ్ లు అందుబాటులోకి తేవడానికి అవసరం అయిన సేవల డెలివరీ వేదిక ఇది. వినియోగదారులు తమకు అర్హత గల స్కీమ్ లను అన్వేషించుకునేందుకు ఉపయోగపడే ఒక స్టాప్ సెర్చ్, డిస్కవరీ పోర్టల్ ఇది. ఒకే సిటిజెన్ లాగిన్ లో జాతీయ స్థాయిలో సంతకం చేసేందుకు ఉపయోగపడే వేదిక “మేరీ పెహచాన్”ను కూడా ఆయన అంకితం చేస్తారు. బహుళ ఆన్ లైన్ అప్లికేషన్లు లేదా సర్వీసుల కోసం నేషనల్ సింగిల్ సైన్ ఆన్ (ఎన్ఎస్ఎస్ఓ) ఇది.
సి2ఎస్ – సెమీ కండక్టర్ల చిప్ ల తయారీలో బ్యాచిల్, మాస్టర్స్, పరిశోధన స్థాయిల్లో ప్రత్యేక నైపుణ్యాలు గల మానవ వనరులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇది. దేశంలో సెమీ కండక్టర్ డిజైన్ లో పాల్గొంటున్న స్టార్టప్ ల వృద్ధికి చోదకశక్తిగా నిలుస్తుంది. ఇది సంస్థాగత స్థాయిలో మెంటరింగ్ సేవలు అందిస్తుంది. ఆ రంగంలోని సంస్థలకు ఆధునిక డిజైనింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంచుతుంది. దేశంలో శక్తివంతమైన సెమీ కండక్టర్ డిజైనింగ్ వ్యవస్థ నిర్మించేందుకు ఉద్దేశించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో ఇది ఒకటి.
డిజిటల్ ఇండియా వారోత్సవం 2022 సందర్భంగా గాంధీనగర్ లో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా వార్షికోత్సవం కూడా నిర్వహిస్తారు. ఆధార్, యుపిఐ, కోవిన్, డిజిలాకర్ వంటి డిజిటల్ వేదికలు పౌరులకు జీవన సౌలభ్యం ఎలా అందిస్తున్నాయో ప్రదర్శిస్తుంది. భారత సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటి చెబుతుంది. ఆ రంగంలో సహకారాలకు, వ్యాపారావకాశాలను అన్వేషిస్తుంది. కొత్త తరానికి భారత టెకేడ్ అందించే అవకాశాలు ప్రదర్శిస్తుంది. స్టార్టప్ లు, ప్రభుత్వ నేతలు, పరిశ్రమ ప్రతినిధులు, విద్యావేత్తలు ఇందులో పాల్గొటారు. ప్రజల జీవన సౌలభ్యం కోసం భారతదేశంలోని యునికార్న్ లు, స్టార్టప్ లు అభివృద్ధి చేసిన డిజిటల్ సొల్యూషన్లు ప్రదర్శించే 200 పైగా స్టాల్స్ తో డిజిటల్ మేళా కూడా నిర్వహిస్తారు. జూలై 7-9 తేదీల మధ్యన వర్చువల్ విధానంలో ఇండియా స్టాక్ నాలెడ్జ్ ఎక్స్ఛేంజి కూడా నిర్వహిస్తారు.
Digital India has empowered people by making technology more accessible. Speaking at Digital India Week 2022 in Gandhinagar. #IndiasTechade https://t.co/4Fw4gAJYZz
— Narendra Modi (@narendramodi) July 4, 2022
टेक्नोलॉजी का सही इस्तेमाल पूरी मानवता के लिए कितना क्रांतिकारी है, इसका उदाहरण भारत ने डिजिटल इंडिया अभियान के तौर पर पूरे विश्व के सामने रखा है।
— PMO India (@PMOIndia) July 4, 2022
मुझे खुशी है कि आठ वर्ष पहले शुरू हुआ ये अभियान, बदलते हुए समय के साथ खुद को विस्तार देता रहा है: PM @narendramodi
समय के साथ जो देश आधुनिक टेक्नोलॉजी को नहीं अपनाता, समय उसे पीछे छोड़कर आगे निकल जाता है।
— PMO India (@PMOIndia) July 4, 2022
तीसरी औद्योगिक क्रांति के समय भारत इसका भुक्तभोगी रहा है।
लेकिन आज हम ये गर्व से कह सकते हैं कि भारत चौथी औदयोगिक क्रांति, इंडस्ट्री 4.0 में दुनिया को दिशा दे रहा है: PM @narendramodi
सिर्फ 8-10 साल पहले की स्थितियों को याद कीजिए...
— PMO India (@PMOIndia) July 4, 2022
Birth certificate लेने के लिए लाइन,
बिल जमा करना है तो लाइन,
राशन के लिए लाइन,
एडमिशन के लिए लाइन,
रिजल्ट और सर्टिफिकेट के लिए लाइन,
बैंकों में लाइन,
इतनी सारी लाइनों का समाधान भारत ने Online होकर किया: PM @narendramodi
DBT के माध्यम से बीते 8 साल में 23 लाख करोड़ रुपए से अधिक सीधे लाभार्थियों के बैंक खाते में भेजे गए हैं।
— PMO India (@PMOIndia) July 4, 2022
इस टेक्नोलॉजी की वजह से देश के 2 लाख 23 हजार करोड़ रुपए गलत हाथों में जाने से बचे हैं: PM @narendramodi
बीते आठ वर्षों में डिजिटल इंडिया ने देश में जो सामर्थ्य पैदा किया है, उसने कोरोना वैश्विक महामारी से मुकाबला करने में भारत की बहुत मदद की है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 4, 2022
हमने दुनिया का सबसे बड़ा और सबसे efficient covid vaccination और covid relief programme चलाया: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 4, 2022
FinTech का प्रयास सही मायने में by the people, of the people, for the people समाधान है।
— PMO India (@PMOIndia) July 4, 2022
इसमें जो टेक्नॉलॉजी है वो भारत की अपनी है यानि by the people
देशवासियों ने इसे अपने जीवन का हिस्सा बनाया यानि of the people
इसने देशवासियों के लेनदेन को आसान बनाया यानि for the people: PM
स्पेस हो, मैपिंग हो, ड्रोन हो, गेमिंग और एनीमेशन हो, ऐसे अनेक सेक्टर जो future digital tech को विस्तार देने वाले हैं, उनको इनोवेशन के लिए खोल दिया गया है
— PMO India (@PMOIndia) July 4, 2022
IN-SPACe और नई ड्रोन पॉलिसी जैसे प्रावधान आने वाले वर्षों में भारत के tech potential को इस दशक में नई ऊर्जा देगा: PM
आज भारत, अगले तीन-चार साल में electronics manufacturing को 300 बिलियन डॉलर से भी ऊपर ले जाने के लक्ष्य पर काम कर रहा है।
— PMO India (@PMOIndia) July 4, 2022
भारत Chip Taker से Chip Maker बनना चाहता है।
Semiconductors का उत्पादन बढ़ाने के लिए भारत में तेजी से निवेश बढ़ रहा है: PM @narendramodi
डिजिटल इंडिया ने पिछले 7 वर्षों में देशवासियों के सपनों की उड़ान को नए पंख दिए हैं। एक सशक्त, समृद्ध और सुरक्षित न्यू इंडिया के निर्माण को इसने तेज गति देने का काम किया है। pic.twitter.com/r3U5KJOHiw
— Narendra Modi (@narendramodi) July 4, 2022
From long lines to online…the last 8 years have witnessed effective usage of technology to boost ‘Ease of Living.’ pic.twitter.com/4IG4gzk4qT
— Narendra Modi (@narendramodi) July 4, 2022
India’s digital infrastructure is rapidly improving. From education to healthcare, it has positively impacted lives across sectors. pic.twitter.com/d7NuDkWwrh
— Narendra Modi (@narendramodi) July 4, 2022
Technology has played a vital role in fighting the once in a century COVID-19 pandemic. Thanks to technology, the pace of India’s vaccination received a great impetus. pic.twitter.com/cQvKqV1hgC
— Narendra Modi (@narendramodi) July 4, 2022