ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా సందర్భంగా ప్రధానమంత్రి ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ‘సేవ్ సాయిల్’ ఉద్యమాన్ని అభినందిస్తూ- దేశం స్వాతంత్ర్య మహోత్సవాలు నిర్వహించుకుంటూ కొత్త సంకల్పాలు పూనుతున్న వేళ ఇలాంటి ప్రజా ఉద్యమాలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. దేశంలో ఎనిమిదేళ్లుగా అమలవుతున్న కీలక పథకాలు ఎంతోకొంత పర్యావరణ కోణంతో ముడిపడి ఉండటం తనకెంతో సంతృప్తినిస్తోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు భారతదేశం బహుముఖంగా కృషి చేస్తున్నదని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం లేదా ‘వ్యర్థం నుంచి అర్థం’ సంబంధిత కార్యక్రమాలు, అల్ప వినియోగ ప్లాస్టిక్‌ను వదిలించుకోవడం, ఒకే సూర్యుడు-ఒకే భూమి లేదా ఇథనాల్ మిశ్రమం కార్యక్రమం వంటివాటిని ఇందుకు ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు భారతదేశం బహుముఖంగా ప్రయత్నాలు చేస్తున్నదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వాతావరణ మార్పు విపరిణామాల్లో భారత్ పాత్ర నామమాత్రమే అయినా, బాగుచేయడంలో తనవంతు కృషికి ఎన్నడూ లోటులేదని చెప్పారు. ప్రపంచంలోని పెద్ద, ఆధునిక దేశాలు భూమ్మీది వనరులను మరింతగా దోచుకుంటున్నాయని, పర్యవసానంగా అత్యధిక కర్బన్ ఉద్గారాలు కూడా వాటి ఖాతాలోకే వెళ్తాయని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల తలసరి సగటు 4 టన్నులు కాగా, భారత్‌లో కర్బన ఉద్గార జాడ ఏడాదికి 0.5 టన్నులు మాత్రమేనని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయినప్పటికీ పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయ సమాజంతో సంయుక్తంగా భారత్ ఒక దీర్ఘకాలిక సమగ్ర దృక్పథంతో కృషి చేస్తున్నదని వివరించారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విపత్తు ప్రతిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), అంతర్జాతీయ సౌరశక్తి కూటమి (ఐఎస్ఎ) ఏర్పాటుకు భారత్ నాయకత్వం వహించిందని పేర్కొన్నారు. మరోవైపు 2070 నాటికి నికర శూన్య ఉద్గార స్థాయి సాధన స్వీయ లక్ష్యాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు.
భూసార పరిరక్షణ కోసం ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. మొదటిది- మట్టిని రసాయన విముక్తం చేయడంఎలా? రెండోది- సాంకేతిక భాషలో భూ సేంద్రియ పదార్థంగా వ్యవహరించే మట్టిలోని జీవుల రక్షణ ఎలా? మూడోది- నేలలో తేమను కాపాడుకోవడం… ఆ దశదాకా నీటి లభ్యతను పెంచడం ఎలా? నాలుగోది- భూగర్భజలాల కొరతతో నేలకు వాటిల్లే నష్టనివారణ ఎలా? ఐదోది- అడవుల క్షీణతవల్ల సంభవించే నిరంతర భూమికోతను ఆపడం ఎలా?
భూసార సమస్యల పరిష్కారం దిశగా వ్యవసాయ రంగంలో ప్రధానంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాగా- నేల రకాలు, మట్టిలోని లోపం, నీటి పరిమాణం వగైరాలపై దేశంలోని రైతలకు తగిన సమాచారం లేదని అంతకుముందు ప్రధాని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా దేశవ్యాప్తంగా రైతులందరికీ ‘భూసార కార్డులు’ అందించేందుకు భారీ కార్యక్రమం చేపట్టామని వివరించారు.
దేశ ప్రజానీకాన్ని నీటి పొదుపుతో అనుసంధానించే దిశగా ప్రతి వర్షపు చినుకునూ ఒడిసిపట్టడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలియజేశారు. మరోవైపు దేశంలోని 13 పెద్ద నదుల పరిరక్షణకు ఈ ఏడాది మార్చిలోనే ఉద్యమం కూడా ప్రారంభమైందన్నారు. జల కాలుష్యం తగ్గింపుతోపాటు నదీతీరాల్లో అడవుల పెంపకానికీ కృషి సాగుతున్నదని పేర్కొన్నారు. తద్వారా 7400 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. దీంతో గత ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన 20 వేల చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం మరింత పెరుగుతుందని ఆయన వివరించారు.
జీవవైవిధ్యం-వన్యప్రాణులకు సంబంధించి భారత్ నేడు అనుసరిస్తున్న విధానాలు కూడా వన్యప్రాణుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవాళ దేశంలో పులి, సింహం, చిరుతపులి, ఏనుగు వంటి వన్యప్రాణి ఏదైనా వాటన్నిటి సంఖ్యా పెరుగుతున్నదని పేర్కొన్నారు. దేశంలో ఇంధనానికి సంబంధించి స్వచ్ఛత, స్వావలంబన కార్యక్రమాలను తొలిసారి చేపట్టామని ప్రధాని నొక్కిచెప్పారు. రైతుల ఆదాయం పెంపు, భూసారం పెంపు సంబంధిత కార్యక్రమాల పరస్పర అనుసంధానానికి ‘గోబర్-ధన్’ పథకాన్ని ఆయన ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.
నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో కొన్నిటికి ప్రకృతి వ్యవసాయంలో విస్తృత పరిష్కారం ఉందని ప్రధానమంత్రి అన్నారు. తదనుగుణంగా గంగా నదీతీర గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయానికి ఈ ఏడాది బడ్జెట్లో పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గుర్తుచేశారు. దీంతో మన పొలాలు రసాయన విముక్తం కావడమేగాక ‘నమామి గంగే’ ఉద్యమానికి కొత్త బలం చేకూరుతుందని చెప్పారు. ఈ మేరకు 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమి పునరుద్ధరణ లక్ష్యంతో భారత్ కృషి చేస్తున్నదని ప్రధాని తెలిపారు. అలాగే ‘బిఎస్-6, ఎల్ఈడీ’ బల్బుల పంపిణీ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.
మన వ్యవస్థాపిత విద్యుదుత్పాదన సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజేతర ఇంధనం వనరులద్దారా పొందే లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు 9 ఏళ్లు ముందుగానే భారత్ సాధించిందని ప్రధాని చెప్పారు. అలాగే సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యం 18 రెట్లు పెరిగిందని, ఉదజని కార్యక్రమం (హైడ్రోజన్ మిషన్), వర్తుల ఆర్థిక వ్యవస్థ సంబంధిత విధానాలు, తుక్కు విధానం వంటివి పర్యావరణ పరిరక్షణపై మన నిబద్ధతకు నిదర్శనాలని ఆయన ఉదాహరించారు.
మరోవైపు ఇంధనంలో 10 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు 5 నెలలు ముందుగానే భారత్ నేడు సాధించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ ఘనత ఎంత బృహత్తరమైనదో వివరిస్తూ- 2014లో ఇథనాల్ మిశ్రమం 1.5 శాతమేనని ఆయన గుర్తుచేశారు. ఈ లక్ష్య సాధనతో మూడు స్పష్టమైన ప్రయోజనాలు సమకూరాయని ప్రధాని తెలిపారు. మొదటిది- 27 లక్షల టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు; రెండోది- రూ.41 వేల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా; మూడోది- ఇథనాల్ మిశ్రమం ద్వారా గడచిన ఎనిమిదేళ్లలో దేశంలోని రైతులు రూ.40,600 కోట్లు ఆర్జించగలిగారని వివరించారు. ఈ ఘనత సాధించడంపై దేశ ప్రజలు, రైతులు, చమురు కంపెనీలను ప్రధాని అభినందించారు.
ప్రధానమంత్రి జాతీయ గతిశక్తి బృహత్ ప్రణాళికతో మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ బలోపేతం అవుతాయని, తద్వారా కాలుష్యం తగ్గుతుందని ప్రధాని అన్నారు. అలాగే 100కుపైగా జలమార్గాలపై బహుళ ప్రయాణ సాధన అనుసంధానం పనులు కూడా కాలుష్యం తగ్గింపులో తోడ్పడతాయన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల దృష్టిని ఆయన హరిత ఉద్యోగావకాశాలవైపు మళ్లించారు. పర్యావరణ పరిరక్షణలో భారత్ కృషి ఊపందుకోవడం వల్ల హరిత ఉద్యోగావకాశాలు పెద్ద సంఖ్యలో అందివస్తాయన్నారు. పర్యావరణం, భూసార పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ 75 అమృత్ సరోవరాల రూపకల్పనకు ప్రజా ఉద్యమం చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.
భూసారం నానాటికీ క్షీణిస్తున్న పరిస్థితుల నడుమ నేలను రక్షించుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్ సాయిల్’ ఉద్యమం మొదలైంది. ఈ మేరకు సద్గురు 2022 మార్చి 5వ తేదీన మోటార్ సైకిల్‌పై 27 దేశాల మీదుగా 100 రోజుల యాత్రను ప్రారంభించారు. దీనికి జూన్ 5వ తేదీతో 75 రోజులు పూర్తయిన నేపథ్యంలో న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ప్రధానమంత్రి ఇందులో పాల్గొనడం భారతదేశంలో భూసారం మెరుగుపరచే కృషిలో సంయుక్త భాగస్వామ్యం దిశగా ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.
Speaking at a programme on ‘Save Soil Movement’. @cpsavesoil https://t.co/YRYC1vWEsw
— Narendra Modi (@narendramodi) June 5, 2022
पर्यावरण रक्षा के भारत के प्रयास बहुआयामी रहे हैं। भारत ये प्रयास तब कर रहा है जब Climate Change में भारत की भूमिका न के बराबर है।
— PMO India (@PMOIndia) June 5, 2022
विश्व के बड़े आधुनिक देश न केवल धरती के ज्यादा से ज्यादा संसाधनों का दोहन कर रहे हैं बल्कि सबसे ज्यादा carbon emission उन्ही के खाते में जाता है: PM
तीसरा- मिट्टी की नमी को कैसे बनाए रखें, उस तक जल की उपलब्धता कैसे बढ़ाएं।
— PMO India (@PMOIndia) June 5, 2022
चौथा- भूजल कम होने की वजह से मिट्टी को जो नुकसान हो रहा है, उसे कैसे दूर करें।
और पांचवा, वनों का दायरा कम होने से मिट्टी का जो लगातार क्षरण हो रहा है, उसे कैसे रोकें: PM @narendramodi
मिट्टी को बचाने के लिए हमने पांच प्रमुख बातों पर फोकस किया है।
— PMO India (@PMOIndia) June 5, 2022
पहला- मिट्टी को केमिकल फ्री कैसे बनाएं।
दूसरा- मिट्टी में जो जीव रहते हैं, जिन्हें तकनीकी भाषा में आप लोग Soil Organic Matter कहते हैं, उन्हें कैसे बचाएं: PM @narendramodi
पहले हमारे देश के किसान के पास इस जानकारी का अभाव था कि उसकी मिट्टी किस प्रकार की है, उसकी मिट्टी में कौन सी कमी है, कितनी कमी है।
— PMO India (@PMOIndia) June 5, 2022
इस समस्या को दूर करने के लिए देश में किसानों को soil health card देने का बहुत बड़ा अभियान चलाया गया: PM @narendramodi
हम catch the rain जैसे अभियानों के माध्यम से जल संरक्षण से देश के जन-जन को जोड़ रहे हैं।
— PMO India (@PMOIndia) June 5, 2022
इस साल मार्च में ही देश में 13 बड़ी नदियों के संरक्षण का अभियान भी शुरू हुआ है।
इसमें पानी में प्रदूषण कम करने के साथ-साथ नदियों के किनारे वन लगाने का भी काम किया जा रहा है: PM
भारत आज Biodiversity और Wildlife से जुड़ी जिन नीतियों पर चल रहा है, उसने वन्य-जीवों की संख्या में भी रिकॉर्ड वृद्धि की है।
— PMO India (@PMOIndia) June 5, 2022
आज चाहे Tiger हो, Lion हो, Leopard हो या फिर Elephant, सभी की संख्या देश में बढ़ रही है: PM @narendramodi
इस साल के बजट में हमने तय किया है कि गंगा के किनारे बसे गांवों में नैचुरल फार्मिंग को प्रोत्साहित करेंगे, नैचुरल फॉर्मिंग का एक विशाल कॉरिडोर बनाएंगे।
— PMO India (@PMOIndia) June 5, 2022
इससे हमारे खेत तो कैमिकल फ्री होंगे ही, नमामि गंगे अभियान को भी नया बल मिलेगा: PM @narendramodi
हमने अपनी installed Power Generation capacity का 40 परसेंट non-fossil-fuel based sources से हासिल करने का लक्ष्य तय किया था।
— PMO India (@PMOIndia) June 5, 2022
ये लक्ष्य भारत ने तय समय से 9 साल पहले ही हासिल कर लिया है: PM @narendramodi
आज भारत ने पेट्रोल में 10 प्रतिशत इथेनॉल ब्लेंडिंग के लक्ष्य को प्राप्त कर लिया है।
— PMO India (@PMOIndia) June 5, 2022
आपको ये जानकर भी गर्व की अनुभूति होगी, कि भारत इस लक्ष्य पर तय समय से 5 महीने पहले पहुंच गया है: PM @narendramodi
भारत पर्यावरण की दिशा में एक होलिस्टिक अप्रोच के साथ न केवल देश के भीतर काम कर रहा है, बल्कि वैश्विक समुदाय को भी साथ जोड़ रहा है।
— Narendra Modi (@narendramodi) June 5, 2022
पर्यावरण रक्षा के भारत के प्रयास बहुआयामी रहे हैं। पिछले 8 साल से जो योजनाएं चल रही हैं, सभी में किसी ना किसी रूप से पर्यावरण संरक्षण का आग्रह है। pic.twitter.com/DHhnFQNmZh
बीते आठ वर्षों में देश ने मिट्टी को जीवंत बनाए रखने के लिए निरंतर काम किया है। मिट्टी को बचाने के लिए हमने पांच प्रमुख बातों पर फोकस किया है… pic.twitter.com/Hj0o1fRvpC
— Narendra Modi (@narendramodi) June 5, 2022
देश में बीते वर्षों में सबसे बड़ा बदलाव हमारी कृषि नीति में हुआ है। pic.twitter.com/q5UdgSwruM
— Narendra Modi (@narendramodi) June 5, 2022
आज पर्यावरण दिवस के दिन देश ने एक और उपलब्धि हासिल की है। भारत ने न केवल पेट्रोल में 10 प्रतिशत इथेनॉल ब्लेंडिंग के लक्ष्य को प्राप्त कर लिया है, बल्कि इस लक्ष्य पर तय समय से 5 महीने पहले पहुंच गया है। pic.twitter.com/xX2C9HQveu
— Narendra Modi (@narendramodi) June 5, 2022