ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు దహోద్ లో ఆదిజాతి మహా సమ్మే
ళన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు 22000 కోట్ల రూపాయల విలువగల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రి 1400 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధానమంత్రి దహోద్ జిల్లా దక్షిణ ప్రాంత ప్రాంతీయ నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. నర్మదా నదీ పరివాహక ప్రాంతంలో 840 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు.
ఇది దహోద్ జిల్లా లోని సుమారు 280 గ్రామాలకు , దేవగఢ్ బారియా సిటీకి మంచినీటిని సరఫరా చేస్తుంది. ప్రధానమంత్రి దహోద్ స్మార్ట్‌సిటీకి సంబంధించి 335 కోట్ల రూపాయల విలువగల 5 ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి), వాన నీటి డ్రైనేజ్ వ్యవస్త, మురుగునీటిపారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ, వాననీటి సంరక్షణ వ్యవస్థల వంటివి ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 120 కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలను పంచమహల్,దహోద్ జిల్లాలలోని 10 వేల మంది గిరిజనులకు అందించారు. ప్రధానమంత్రి 66 కెవి ఘోడియా సబ్ స్టేషన్‌ను , పంచాయతి భవనాలను , అంగన్ వాడీలను తదితరాలను ప్రారంభించారు.
దహోద్ లో 9000 హెచ్‌పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ల తయారీ యూనిట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రాజెక్టు వ్యయంసుమారు 20,000 కోట్ల రూపాయలు. దహోద్ వర్క్‌షాప్‌ను 1926 లో ఏర్పాటు చేశారు. స్టీమ్ లోకోమోటివ్‌లను ఎప్పటికప్పుడు ఒవర్‌హాల్ చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాల మెరుగుతో దీనిని ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. రాష్ట్రప్రభుత్వానికి చెందిన 550 కోట్ల రూపాయల విలువగల పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో నీటిసరఫరాకు సంబంధించిన ప్రాజెక్టులు 300కోట్ల రూపాయల విలువగలవి ఉన్నాయి. దహోద్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు సుమారు 175 కోట్ల రూపాయల విలువగలవి ఉన్నాయి. అలాగే దుధిమతి రివర్ ప్రాజెక్టు, ఘోడియా వద్ద జెట్‌కో సబ్‌స్టేషన్ వంటివి ఇందులో ఉన్నాయి. కేంద్ర మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీమతి దర్శన జర్దోష్,గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, గుజరాత్‌కు చెందిన పలువురు మంత్రులు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, స్థానిక గిరిజన ప్రజలతో తనకు గల సుదీర్ఘ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ సేవకు తనకు ప్రేరణను అందించి ఆశీస్సులు అందించారని వారిని ప్రశంసించారు. వీరి ఆశీస్సులు , మద్దతు కారణంగా గిరిజను ల సమస్యలు ప్రత్యేకించి మహిళల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులలో ఒకటి మంచినీటికి సంబంధించినది.మరోకటి దహోద్‌ను స్మార్ట్‌సిటీగా మార్చేందుకు సంబంధించినదని ప్రధానమంత్రి చెప్పారు. ఇది ఈ ప్రాంత మహిళలు, కుమార్తెల జీవితాలను సులభతరం చేస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. దహోద్ మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి ఉపకరిస్తుందని, దహోద్ ఉత్పత్తి కేంద్రంలో 20,000 కోట్ల రూపాయల విలువగల 9000 హెచ్‌పి ఎలక్ట్రిక్ లోకోఓటివ్‌లు ఉత్పత్తి అవుతాయని చెప్పారు. ఎంతో కాలం క్రితం తాను ఈ ప్రాంతంలోని రైల్వే సర్వెంట్ క్వార్టర్లను సందర్శించినపుడు ఎంత దయనీయంగా ఉండేదో ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాంతంలో రైల్వే స్థితిగతులను మార్చాలని తాను సంకల్పం చెప్పుకున్నానని, ఇవాళ ఆ కల సాకారం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెడుతుండడంతో ఈ ప్రాంత యువతకు నూతన ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. అన్ని విధాలుగా రైల్వే ను అప్ గ్రేడ్ చేయడం జరుగుతోందని, అధునాతన లోకోమోటివ్‌ల తయారీ , భారత్ శక్తి సామర్థ్యాలను సూచిస్తోందని అన్నారు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లకు విదేశాలలో డిమాండ్ పెరుగుతున్నదని ఆయన అన్నారు. దహోద్ ఈ డిమాండ్‌ను తట్టుకోవడంలో కీలక పాత్రను పోషించనున్నదని ఆయన అన్నారరు. 9000 హార్స్‌పవర్ శక్తి కలిగిన శక్తిమంతమైన లోకోమోటివ్‌లు తయారు చేస్తున్నకొద్ది దేశాలలో ఇండియా ఒకటి అని ఆయన అన్నారు.
గుజరాతికి మారుతూ,ప్రధానమంత్రి, ప్రగతి ప్రయాణంలో మన తల్లులు, కుమార్తెలను వదిలివేయరాదన్నారు. అదువల్లే, మహిళల సులభతర జీవనం, సాధికారత అనేవి ప్రభుత్వ అన్ని పథకాలలో కీలకంగా ఉంటూ వస్తున్నదని అన్నారు. నీటి కొరత ముందుగా మహిళలపైనే ప్రభావం చూపుతుందని, అందువల్ల ప్రతి ఇంటికీ కుళాయి నీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గత కొద్ది సంవత్సరాలలో 6 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం కల్పించినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రచారాన్ని రాగల రోజులలో మరింత ముందుకు తీసుకుపోనున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో, యుద్ధ సమయంలో కూడా ప్రభుత్వం ఎస్.సి.ఎస్.ట , ఒబిసి లు, వలస కార్మికుల సంక్షేమానికి పాటుపడినట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఏ పేద కుటుంబం ఆకలితో అలమటించే పరిస్థితి ఉండరాదని, 80 కోట్ల మందికిపైగా ప్రజలకు రెండు సంవత్సరాలుగా ఉచిత రేషన్ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ప్రతి గిరిజన కుటుంబం టాయిలెట్ సదుపాయం, గ్యాస్ కనెక్షన్, విద్యుత్, వాటర్ కనెక్షన్‌తో పక్కా ఇంటిని కలిగి ఉండాలన్నది తన సంకల్పమని ఆయన అన్నారు. అలాగే గ్రామంలో ఆరోగ్య ,స్వస్థత కేంద్రం, అంబులెన్స్ సదుపాయం, రోడ్డు సదుపాయం,అందుబాటులో విద్యా సంస్థ, ఉండాలన్నారు.ఇది సాధించడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయన్నారు. దేశసేవలో భాగంగా ప్రకృతి వ్యవసాయం వంటి రంగాలలోకి లబ్ధిదారులు ప్రవేశిస్తుండడం చూసి తనకు ఆనందంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. సికిల్‌సెల్ వ్యాధి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించినట్టు ఆయన తెలిపారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఎంతో మంది నిజమైన స్వాతంత్ర సమరయోధులు తగిన గుర్తింపును పొందలేదని అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా వంటివారికి లభించిన గుర్తింపు గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. దాహోద్ లో జరిగిన అలనాటి ఊచకోత గురించి స్థానిక ఉపాధ్యాయులు పిల్లలకు తెలియజేయాలని, ఇది జలియన్ వాలా బాగ్ ఊచకోత వంటిదని అన్నారు. దీనివల్ల కొత్తతరం ఇలాంటి ఘటనలను గురించి తెలుసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు.ఈ ప్రాంతంలో జరిగిన ప్రగతి గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. గతంలో ఈ ప్రాంతంలో ఒక్క సైన్స్ స్కూలు కూడా ఉండేది కాదని అన్నారు. ఇవాళ మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఇక్కడికి వస్తున్నాయన్నారు. యువత చదువుకునేందుకు విదేశాలకు వెళుతున్నదని, ఎకలవ్యమోడల్ పాఠశాలు ఏర్పడుతున్నాయన్నారు. గిరిజన పరిశోధన కేంద్రాలు చెప్పుకోదగిన స్థాయిలో పెరిగాయన్నారు. 108 సదుపాయం కిద పాము కాటుకు ఇంజక్షన్ సదుపాయం కల్పిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తన ప్రసంగాన్ని ముగించే ముందు ప్రధానమంత్రి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లాలో 75 సరోవరాలు ఉండేలా చూడాలని ఆయన పునరుద్ఘాటించారు.
Addressing a programme at launch of development initiatives in Dahod, Gujarat. https://t.co/AK1QGDYDTZ
— Narendra Modi (@narendramodi) April 20, 2022
आज दाहोद और पंचमहाल के विकास से जुड़ी 22 हज़ार करोड़ रुपए से अधिक की परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया गया है।
— PMO India (@PMOIndia) April 20, 2022
जिन परियोजनाओं का आज उद्घाटन हुआ है, उनमें एक पेयजल से जुड़ी योजना है और दूसरी दाहोद को स्मार्ट सिटी बनाने से जुड़ा प्रोजेक्ट है: PM @narendramodi
दाहोद अब मेक इन इंडिया का भी बहुत बड़ा केंद्र बनने जा रहा है।
— PMO India (@PMOIndia) April 20, 2022
गुलामी के कालखंड में यहां स्टीम लोकोमोटिव के लिए जो वर्कशॉप बनी थी, वो अब मेक इन इंडिया को गति देगी।
अब दाहोद में 20 हज़ार करोड़ रुपए का कारखाना लगने वाला है: PM @narendramodi
इलेक्ट्रिक लोकोमोटिव की विदेशों में भी डिमांड बढ़ रही है।
— PMO India (@PMOIndia) April 20, 2022
इस डिमांड को पूरा करने में दाहोद बड़ी भूमिका निभाएगा।
भारत अब दुनिया के उन चुनिंदा देशों में है जो 9 हज़ार हॉर्स पावर के शक्तिशाली लोको बनाता है: PM @narendramodi
હું આ પહેલા પણ અનેક પ્રસંગોએ દાહોદ આવ્યો છું પરંતુ આજની જાહેર સભાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામનો આભાર… pic.twitter.com/O5QW1NtdIH
— Narendra Modi (@narendramodi) April 20, 2022
અમારી સરકારને છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારો માટે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને પાછલા કેટલાક વર્ષોમાં આ વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેનાથી લોકોને ખૂબ ફાયદો થયો છે. pic.twitter.com/aLPozrW79h
— Narendra Modi (@narendramodi) April 20, 2022
અમારી સરકારે બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને ગૌરવનું સ્થાન આપ્યું છે. pic.twitter.com/6OeLWdho8t
— Narendra Modi (@narendramodi) April 20, 2022
વર્ષોથી ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો અભાવ હતો. અમારી સરકારે આમાં આમૂલ પરિવર્તન લાવ્યું અને તેના પરિણામો આપણે સૌ જોઈ શકીએ છીએ…. pic.twitter.com/MukX0rikfi
— Narendra Modi (@narendramodi) April 20, 2022